
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం ఏర్పాటు చేసిన అన్ని రకాల గురుకుల పాఠశాలలను ప్రారంభించాలని కుల నిర్మూలన వేదిక (కేఎన్‌వీ) అధ్యక్షుడు పాపని నాగరాజు డిమాండ్ చేశారు. అన్ని రకాల విద్యా సంస్థలను ప్రారంభించి కేవలం గురుకుల విద్యా సంస్థలను ప్రారంభించకపోవడంతో బడుగులకు విద్య దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల విద్యా సంస్థలకు మాత్రమే కరోనా వస్తుందా అని ఆయన ప్రశ్నించారు.