Disagreements
-
రోడ్డు పక్కన కూర్చుని కేరళ గవర్నర్ నిరసన
తిరువనంతపురం/కొల్లం: కేరళ గవర్నర్, వామపక్ష ప్రభుత్వం మధ్య విభేదాలు ముదిరిన నేపథ్యంలో శనివారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈసారి కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ రోడ్డు పక్కన రెండు గంటలపాటు కూర్చుని దాదాపు ధర్నాకు దిగినంత పనిచేశారు. శనివారం ఉదయం కొట్టరక్కరలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనే ందుకు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ వెళ్తుండగా అధికార సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నిలామెల్ వద్ద నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ‘సంఘీ చాన్సెలర్ గో బ్యాక్’అంటూ ఆయన్నుద్దేశించి నినాదాలు చేశారు. ఆగ్రహించిన గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ తన కారును ఆపించి, కిందికి దిగారు. తన వద్దకు రావాలంటూ పెద్దగా అరుస్తూ వారి సమీపానికి వెళ్లారు. దీంతో, పోలీసులు నినాదాలు చేస్తున్న ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు, గవర్నర్‌కు మధ్య అడ్డుగా నిలబడ్డారు. అనంతరం, గవర్నర్ సమీపంలోని దుకాణం నుంచి కుర్చీ తెప్పించుకుని రెండు గంటలపాటు రోడ్డు పక్కనే కూర్చున్నారు. నిరసనకారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను గట్టిగా డిమాండ్ చేశారు. నిరసనల్లో పాల్గొన్న 17 మంది ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీని చేతికి అందించాకే ఆయన నిరసన విరమించారు. ముఖ్యమంత్రి విజయన్ రాష్ట్రంలో అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారని, రాష్ట్ర అధినేతగా వాటిని సహించబోనన్నారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే వామపక్ష ప్రభుత్వం తనపై దాడులకు ఉసిగొల్పుతోందని ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను గూండాలు, రోజువారీ కూలీలుగా ఆయన అభివరి్ణంచారు. దేశంలోని ఏరాష్ట్ర గవర్నర్ కూడా ఇలా వ్యవహరించ లేదని కేరళ విద్యామంత్రి వి.శివన్కుట్టి వ్యాఖ్యానించారు. నిలామెల్ ఘటన జరిగిన గంటలోపే ఆయనకు సీఆర్పీఎఫ్ బలగాలతో కూడిన జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలి్పంచినట్లు కేంద్ర హోం శాఖ సమాచారం అందించిందని రాజ్‌భవన్ ప్రకటించింది. గవర్నర్ తిరిగి తిరువనంతపురంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనగా ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అక్కడ కూడా నిరసనలు కొనసాగించడం గమనార్హం. -
YSR Kadapa: జిల్లా టీడీపీలో అగ్నిగుండంలా అసమ్మతి!
కడప రూరల్ : జిల్లా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి. ఆ పార్టీ అధిష్టానం, నేతలపై కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇక కడప టీడీపీలో అయితే అసమ్మతి అగ్నిగుండంలా మారింది. గురువారం స్ధానిక రహమతియా ఫంక్షన్ హాల్లో టీడీపీ కడప మాజీ ఇన్చార్జి అమీర్‌బాబు, సీనియర్ నాయకుడు లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నియోజకవర్గ క్లస్టర్లు, యూనిట్ ఇన్చార్జిల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ కార్యకర్తలు పలువురు పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి, కడప ఇన్చార్జి మాధవిరెడ్డిల వ్యవహార శైలిపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు రామలక్షుమ్మ, స్వర్ణలత మాట్లాడుతూ ఏళ్ల తరబడి టీడీపీలో సీనియర్ కార్యకర్తలుగా పనిచేస్తున్నాం. పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి అయితే ఏ నాడూ మమ్మల్ని కనీసం పలకరించను కూడా లేదని విమర్శించారు. ఆయన ఓ వ్యాపారి, పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా వ్యాపారమే చేసుకుంటాడని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీనివాసులురెడ్డి నీరు–చెట్టు నిధులను కొల్లగొట్టారు. ఆ డబ్బులో చిల్లిగవ్వ కూడా తమలాంటి కార్యకర్తలకు ఇవ్వలేదన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాల్లో అభ్యర్థులను గెలిపిస్తామని ప్రగల్బాలు పలికి దారుణంగా విఫలమయ్యారని గుర్తు చేశారు. కడప కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అతికష్టం మీద ఒక్క కార్పొరేటర్ స్థానం మాత్రమే గెలిచిందన్నారు. ఇప్పుడు తన సతీమణి మాధవిరెడ్డిని తెరపైకి తెచ్చి, కడప ఇన్చార్జిగా నియమించుకోగలిగారని అన్నారు. ఆమెకు పార్టీ గురించి, కార్యకర్తల గురించి ఏమి తెలుసని ప్రశ్నించారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఆమెకు కడప ఇన్చార్జి బాధ్యతలు కట్టబెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కడప ఎమ్మెల్యే టికెట్‌ను సీనియర్లకు కేటాయిస్తే తామంతా బలపరుస్తామని తెలిపారు. పార్టీలో కార్యకర్తలకే విలువ, గ్యారెంటీ లేదు ప్రజలకు ఏమి గ్యారెంటీ ఇస్తారని నిలదీశారు. అసమ్మతి అంశం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. -
‘కారు’లో చల్లారిన అసంతృప్తి మంటలు..
మంచిర్యాల: గులాబీ పార్టీలో అసమ్మతి నాయకులు వెనక్కి తగ్గుతున్నారు. అధిష్టానం సూచనలతో తమ పట్టు వీడుతున్నారు. జిల్లాలో మంచిర్యాల బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి పార్టీ ఆదేశాలే శిరోధార్యంగా భావిస్తూ మరోసారి గెలుపునకు కృషి చేసేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం మంచిర్యాలలో గడ్డం అరవింద్‌రెడ్డి ఇంట్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఖానాపూర్ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ దండె విఠల్, కార్మిక నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశం అయ్యారు. మంచిర్యాల సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలని అరవింద్‌రెడ్డి పట్టుబట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కోసం పని చేస్తామని ప్రకటించడంతో గులాబీ పార్టీలో ఐక్యత రాగం మొదలైంది. దీంతో మంచిర్యాల నియోజకవర్గంలో అసమ్మతి దాదాపు చల్లారినట్లేనని కార్యకర్తలు భావిస్తున్నారు. ఇక బెల్లంపల్లిలో టికెట్ ఆశించిన రేణికుంట్ల ప్రవీణ్‌కుమార్‌ను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నియమించడంతో అక్కడ అసంతృప్తి చల్లారింది. ఇక క్షేత్రస్థాయిలో పట్టణ, మండల, గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు, కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని చల్చార్చేందుకు జిల్లా నాయకత్వం ప్రణాళికలు వేస్తోంది. జిల్లాలో బీఆర్ఎస్ జెండా ఎగరాలి : బాల్క సుమన్ మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ జెండా మళ్లీ ఎగరాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో పార్టీని గెలిపించేందుకు మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించామని తెలిపారు. శుక్రవారం మంచిర్యాలలో గడ్డం అరవింద్‌రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఎమ్మెల్సీ దండె విఠల్‌తో కలసి ప్రత్యేకంగా సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎన్నికల సంబంధించిన సమాలోచనలు చేశామని చెప్పారు. అందరం సమన్వయంతో ముందుకు సాగుతామని, మరోమారు సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. సీఎం ఈ నెల 15న అభ్యర్థులకు బీ ఫాం ఇస్తారని, 17నుంచి నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టనున్నారని తెలిపారు. ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ మంచిర్యాల ప్రశాంతంగా ఉండాలన్నా, సమర్థవంతమైన అభివృద్ధి జరగాలన్నా బీఆర్ఎస్కే ఓటేయాలని అన్నారు. అరవింద్‌రెడ్డి గతంలోనూ, ప్రస్తుతం తమ గెలుపు కోసం పని చేస్తారని చెప్పారు. అరవింద్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణిలో కార్మికులకు సీఎం కేసీర్ బోనస్ ఇచ్చారని, గతంలో వచ్చిన దానికి కన్నా 20వేల మెజార్టీతో దివాకర్‌రావును గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో రెండు స్థానాలకు బీసీలకే టికెట్లు ఇచ్చామని, విపక్ష పార్టీలు ఎన్ని సీట్లు ఇస్తాయో చూస్తామని అన్నారు. అసంతృప్తులకే గెలుపు బాధ్యతలు గత కొంతకాలంగా పార్టీలో అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డికి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలు అప్పగించారు. ‘పురాణం’ను ముధోల్ నియోజకవర్గానికి ఎన్నికల ఇన్చార్జిగా నియమించారు. ఇక అరవింద్‌రెడ్డికి మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావును గెలిపించేందుకు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని పార్టీ నుంచి ఆదేశాలు రావడంతో ఆయన కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కోసం పని చేయనున్నారు. ఇక్కడ ఎన్నికల ఇన్చార్జిగా ఎమ్మెల్సీ భానుప్రసాద్ ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న అరవింద్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల షెడ్యూ ల్ వెలువడకముందే మంచిర్యాలలో ఈసారి ఎన్నికల్లో బీసీలకే బీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని పార్టీలో స్థానిక నాయకులు పట్టుబట్టడం, పలు కార్యక్రమాలు చేయడం తెలిసిందే. ఆ నాయకులకు అరవింద్‌రెడ్డి మద్దతు పలికా రు. సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. కొందరు పార్టీని వీడా రు. ఇదే విషయాన్ని పలుమార్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి, కేటీఆర్ దృష్టి తీసుకెళ్లారు. చివరకు అభ్యర్థిని మార్చే ప్రసక్తే లేకపోవడంతో పార్టీలో వెనక్కి తగ్గారు. -
ఆమెకు మరోసారి టికెట్ ఇస్తే ఓడిస్తాం
-
చోడవరం టీడీపీ ఎమ్మెల్యే రాజుకు అసమ్మతి సెగ
-
కడప టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి..
-
హిందూపురం ఎంపీ టికేట్పై మడకశిర నేతలు తిరుగుబాటు
-
అనంతపురం టీడీపీలో అసమ్మతి సెగ
-
నాదంటే.. నాదే!
మెదక్ కాంగ్రెస్ టికెట్ ఎవరిని వరిస్తుందో తెలియక కార్యకర్తలు, ముఖ్య నాయకులు అయోమయంలో పడ్డారు. ఆశావహులు ఎవరికి వారు టికెట్ తమదే అంటూ ప్రచారం సాగిస్తున్నారు. కానీ కార్యకర్తలు ఎవరి వెంట ప్రచారానికి వెళ్లాలో తెలియక మిన్నకుండిపోతున్నారు. ఒకరు బీసీ కార్డుతో ప్రయత్నిస్తే.. మరొకరు పార్టీ సీనియర్ నాయకలతో, అలాగే మరో నాయకుడు మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీ నాయకుడితో లాబీయింగ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టికెట్ విషయంలో మాజీ ఎంపీ విజయశాంతి కూడా గెలిచే వారికే టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి సూచించినట్లు సమాచారం. దీంతో పార్టీ శ్రేణులు ఎవరిని టికెట్ వస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాక్షి, మెదక్: ఎన్నికల బరిలో దిగేది నేనే.. నా లెక్కలు నాకున్నయ్. ఢిల్లీకి వెళ్లిన స్క్రీనింగ్ కమిటీ జాబితాలో కూడా నా పేరుంది. అధిష్టానం పెద్దల ఆశీస్సులు ఫుల్‌గా నాకే ఉన్నయ్... మనం పోటీలో ఉండటం ఖాయం.. అంటూ మెదక్ నియోకజవర్గంలోని కాంగ్రెస్ ఆశావహులు ఎవరికి వారే టికెట్‌పై ధీమాగా ఉన్నారు. టికెట్ కేటాయింపు అంశం ఢిల్లీకి చేరడంతో అక్కడా టికెట్ కోసం ఎవరికివారే ముమ్మర లాబీయింగ్ చేస్తున్నారు. తమకే టికెట్ ఖాయమని తమ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలకు సంకేతాలు ఇస్తున్నారు. ఆశావహుల తీరు కాంగ్రెస్ శ్రేణులను నివ్వెరపరుస్తోంది. టికెట్ ఆశిస్తున్న ముఖ్యనేతలు బలంగా తమకే టికెట్ దక్కుతుందని ఘంటాపథంగా చెబుతుండటంతో తాము ఎవరి వైపు వెళ్లాలో తెలియక కార్యకర్తలు ఆయోమయానికి గురవుతున్నారు. ఇప్పుడు ఒక నాయకుడి పక్షం నిలబడితే అధిష్టానం అతనికి టికెట్ ఇవ్వని పక్షంలో ఆ తర్వాత తమ భవిష్యత్తు ఏమిటన్న సంశయం వెంటాడుతోంది. దీంతో ఏమి చేయాలో పాలుపోక చాలా మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మిన్నుకుండిపోతున్నారు. అధిష్టానం టికెట్ ప్రకటించాకే ప్రచారంలోకి దిగాలని కార్యకర్తలు ఎక్కువ మంది అనుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బట్టి జగపతి, తిరుపతిరెడ్డి, సుప్రభాతరావు, ప్రతాప్‌రెడ్డి, మ్యాడం బాలకృష్ణ తదితరులు ఎమ్మెల్యే టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.కాగా మాజీ ఎంపీ విజయశాంతి పేరును సైతం అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. కార్యకర్తల్లో అయోమయం.. అధిష్టానం ఈ నెలాఖరులోగా టికెట్ ప్రకటించవచ్చని తెలుస్తోంది. ఈ విషయమై పీసీసీ చీఫ్ ఉత్తమ్, పార్టీ ఇన్చార్జి కుంతియా ఢిల్లీ వెళ్లడంతో ఆశావహులంతా టికెట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆయన ముఖ్య నాయకులు జైపాల్‌రెడ్డి, జానారెడ్డి ద్వారా టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. బట్టి జగపతి బీసీ కార్డు ఉపయోగించి టికెట్ కోరుతున్నారు. అలాగే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డితోపాటు మహాకూటమిలో కీలక బాగస్వామి అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ద్వారా లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. సుప్రభాతరావు, తిరుపతిరెడ్డిలు మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ నేత ప్రతాప్‌రెడ్డి ఎంపీ నంది ఎలయ్య, ఏఐసీసీ నేత ఆజాద్ ద్వారా ఢిల్లీ స్థాయిలో టికెట్ కోసం వత్తిడి తీసుకువస్తున్నారు. మ్యాడం బాలకృష్ణ మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ సీఎం రోశయ్య ద్వారా టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. వీరంతా ఎవరికివారే తమకు టికెట్ దక్కుతుందని ధీమాగా చెబుతున్నారు. దీంతో కార్యకర్తల్లో ఆమయోమయం నెలకొంది. పట్టుసడలించిన రాములమ్మ? మెదక్ ఎమ్మెల్యే టికెట్ కేటాయింపులో మాజీ ఎంపీ విజయశాంతి అభిప్రాయానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆమె మద్దతు తెలిపిన వారికే దాదాపు టికెట్ దక్కవచ్చన్న ప్రచారం కూడా సాగుతోంది. మొదట తానే స్వయంగా మెదక్ నుంచి పోటీ చేయాలని ఆమె భావించినప్పటికీ స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్రం అంతటా ప్రచారం చేయాల్సి ఉన్నందున పోటీకి ఆమె ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో ఆమె ఇప్పుడు ఎవరికి మద్దతు ఇస్తుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. మాజీ ఎంపీ శశిధర్‌రెడ్డి మినహాయించి ఆశావహుల్లో గెలిచే అవకాశం ఉన్న వారికి ఎవరికి టికెట్ ఇచ్చిన తనకు అభ్యంతరం లేదని తన అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం టికెట్ల కేటాయింపులో సర్వేలతోపాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విజయశాంతి తన వైఖరి మార్చుకుని శశిధర్‌రెడ్డి టికెట్ కేటాయించే విషయంలో అభ్యంతరం తెలుపుతున్న విజయశాంతి ప్రస్తుతం అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా తనకు సమ్మతమేనని, గెలిచే అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. -
సాగర్ పంచాయితీ కొలిక్కి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో అసమ్మతులకు తెరపడుతోంది. నియోజకవర్గాల వారీగా అసమ్మతి, అసంతృప్త నేతలతో మంత్రి కేటీఆర్ బుజ్జగింపుల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. గురువారం నల్లగొండ లో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అసమ్మతి, అసంతృప్త నేతలతో బుధవారం కేటీఆర్ చర్చలు జరిపారు. నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల నేతలతో కేటీఆర్ తన క్యాంపు కార్యాలయంలో వేర్వేరుగా సమావేశమయ్యారు. నాగార్జునసాగర్ అభ్యర్థిగా నోముల నర్సింహయ్య ను ప్రకటించడంపై అక్కడి స్థానిక నేత ఎంసీ కోటిరెడ్డి అసమ్మతికి తెరలేపారు. స్థానికులకే నాగార్జునసాగర్ టిక్కెట్ ఇవ్వాలని, పార్టీ అధిష్టానం నిర్ణయం మార్చుకోకపోతే టీఆర్ఎస్ గెలవదని హెచ్చరించారు. సొంతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. నోముల విజ్ఞప్తి మేరకు కేటీఆర్ ఆ నియోజకర్గ నేతలను పిలిపించారు. 2 గంటల పాటు సమావేశయ్యారు. కోటిరెడ్డి, పలువురు ద్వితీయశ్రేణి నేతలు నాగార్జునసాగర్ నియోజకర్గంలోని పరిస్థితిని కేటీఆర్‌కు వివరించారు. నాలుగేళ్లుగా పట్టించుకోవట్లేదు.. నాలుగేళ్లుగా నోముల పార్టీని పట్టించుకోలేదని, ఇప్పుడు టికెట్ ఇస్తే ఆయన గెలిచే అవకాశం లేదని చెప్పారు. మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా పార్టీ నేతలను పట్టించుకోవట్లేదని, తమ నియోజకవర్గంలో టీఆర్ఎస్ శ్రేణులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ‘టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్ని పరిస్థితులను పూర్తిగా పరిశీలించాకే అభ్యర్థులను ఖరారు చేశారు. నర్సింహయ్య గత ఎన్నికల్లోనూ నాగార్జునసాగర్‌లో పోటీ చేశారు. పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా మళ్లీ ఆయనకే అవకాశం ఇచ్చారు. సీనియర్ నేత నర్సింహయ్య గెలుపు కోసం అందరూ కలసి పనిచేయాలి. మన పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా మీరే స్థానికత అంశాన్ని తెరపైకి తెస్తే ఎలా. అన్నింటికంటే పార్టీ ముఖ్యం. మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. అందరికీ అవకాశాలు ఉంటాయి. కలసి పని చేసి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి’అని కేటీఆర్ సూచించారు. అనంతరం నోముల నర్సింహ య్య, కోటిరెడ్డిలు కరచాలనం చేసుకున్నారు. కలసి పని చేస్తామని కోటిరెడ్డి ప్రకటించారు. దేవరకొండ లోని ద్వితీయశ్రేణి నేతల్లో కొందరు.. టీఆర్ఎస్ అభ్యర్థి రవీంద్రకుమార్‌పై అసంతృప్తితో ఉన్నారు. రవీంద్రకుమార్ విజ్ఞప్తి మేరకు దేవరకొండ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. అందరూ కలసి రవీంద్రకుమార్‌ను గెలిపించాలని సూచించారు. ఖైరతాబాద్ తిరకాసు.. గ్రేటర్ హైదరాబాద్‌లోని సీట్ల కేటాయింపు రోజుకో మలుపు తిరుగుతోంది. టీఆర్ఎస్ అధిష్టానం దానం నాగేందర్‌కు గోషామహల్ స్థానాన్ని ఖరారు చేసింది. ప్రచారం చేసుకోవాలని సూచించింది. అయితే దానం నాగేందర్ మాత్రం తనకు ఖైరతాబాద్ కేటాయించాలని కోరుతున్నారు. ఈ విషయంపై దాదాపు రోజూ కేటీఆర్‌ను కోరుతున్నారు. దీనిపై కేసీఆర్ నిర్ణయిస్తారని కేటీఆర్ స్పష్టం చేస్తూ వస్తున్నారు. అయినా దానం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా, తమలో ఒకరికి ఖైరతాబాద్ టికెట్ ఇవ్వాలని ఈ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి, పీజేఆర్ కూతురు విజయారెడ్డి బుధవారం కేటీఆర్‌ను కోరారు. దానం కూడా కేటీఆర్‌ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అభ్యర్థులను ప్రకటించని 14 స్థానాలపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
నష్టం జరగబోతోంది..!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి పొగలు గక్కుతోంది. టికెట్ రాని నేతలు ఎదురు తిరుగుతున్నారు. కారును వదిలి హస్తం, కమలం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీని నమ్ముకుంటే మట్టే మిగిలిందనే కసితో ఉన్న ఇంకొందరు నేతలు కేసీఆర్ బొమ్మ పెట్టుకుని ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. భూపాలపల్లి, స్టేషన్ ఘన్పూర్, వరంగల్ తూర్పు, పాలకుర్తి, జనగామ, మహబూబాబాద్, ములుగు నియోజకవర్గాల్లో రెబల్స్ రెడీ అయ్యారు.’ అని ఇంటెలిజెన్సీ విభాగం ‘గులాబీ’ అధినేత కేసీఆర్‌కు ఉప్పందించినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. స్వతంత్రులతోనే మోసం.... భూపాలపల్లి, స్టేషన్ ఘన్పూర్, ములుగు నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులు స్వతంత్రంగా బరిలో నిలబడేందుకు మానసికంగా సిద్ధమయ్యారు. భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ, స్టేషన్ ఘన్‌పూర్‌లో రాజారపు ప్రతాప్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వర్గం, ములుగులో చందూలాల్ వ్యతిరేక కూటమి తో భారీ ప్రమాదం ఉందని ఇంటెలిజెన్సీ పసిగట్టినట్లు తెలిసింది. ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులు కేసీఆర్ బొమ్మ పెట్టుకుని టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారని, వీళ్ల చర్యల మూలంగా టీఆర్ఎస్ పార్టీ ఓట్లు భారీగా చీలిపోయే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. భూపాలపల్లిలో భారీ సంక్షోభం.. భూపాలపల్లి నియోజకవర్గంలో మధుసూదనాచారికి టికెట్ కేటాయించిన రోజు నుంచే గండ్ర సత్యనారాయణరావు తిరుగుబాటు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తానని ప్రకటించిన ఆయన తన పని తాను చేసుకుపోతున్నారు. తనకు సహకరించాలని ప్రచారం సైతం మొదలుపెట్టారు. గండ్ర సత్యనారాయణకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతోందని.. భారీ ఎత్తున ఓట్లు చీల్చే ప్రమాదం ఉందని.. ఇది కాంగ్రెస్‌కి మేలు చేస్తుందని.. ఇప్పటికే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి భారీగా నష్టం జరిగిందని ఇంటెలిజెన్సీ వర్గాలు హెచ్చరించినట్లు తెలిసింది. రాజయ్య నైతికతపై దాడులు.. స్టేషన్ ఘన్‌పుర్‌లో డాక్టర్ రాజయ్యపై అసమ్మతి సెగలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాజారపు ప్రతాప్ తిరుగుబాటుతో రాజుకున్న అసమ్మతిని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అనుచర వర్గం అందుకుంది. రాజయ్యకు టికెట్ ఇవ్వొద్దనే డిమాండ్‌తో ఇప్పటికీ ధర్నాలు, నిరసనలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో రోజుకో చోట ముఖ్య కార్యకర్తల సమావేశాలు జరుగుతున్నాయి. అవినీతి, కమీషన్ల దందా ఉన్న రాజయ్యకు టికెట్ ఇస్తే తాము సహకరించబోమని ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. సోషిల్ మీడియా మాధ్యమంగా రాజయ్య నైతికతపై దాడులకు తెగబడుతున్నారు. 20 రోజుల కిందట ఒక మహిళతో సెల్ఫోన్లో చేసిన సంభాషణను వైరల్ చేశారు. దళిత ఉప జాతులను ఉద్దేశించి మాట్లాడినట్టు రాజయ్య స్వరాన్ని పోలిన మాటల వీడియో తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పరిస్థితి ఇలానే కొనసాగితే అక్కడ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ములుగులో ముసలం.. ములుగు నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మాజీ మంత్రి చందూలాల్‌కు ఇచ్చిన టికెట్ రద్దు చేయాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. మొదట అబ్బాపురం ఎంపీటీసీ సభ్యుడు గోవింద్ నాయక్ లేవనెత్తిన తిరుగుబాటుకు ఇతర ద్వితీయ శ్రేణి నాయకత్వం జత కలిసింది. ములుగు జెడ్పీటీసీ సభ్యుడు, జెడ్పీ ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్, మంగపేట జెడ్పీటీసీ సభ్యుడు సిద్ధంశెట్టి వైకుంఠంతోపాటు పలువురు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అబ్బాపురం ఎంపీటీసీ సభ్యుడు పోరిక గోవింద్‌నాయక్‌కుగానీ, మరెవరికైనా టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. నియోజకవర్గంలోని దాదాపు 20 మంది టీఆర్ఎస్ ముఖ్యనేతలు మంగపేటలో సమావేశమై చందూలాల్‌కు సహకరించబోమని తీర్మానించారు. వాళ్ల ఆధ్వర్యంలో ఇటీవల ములుగులో భారీ ర్యాలీ నిర్వహించి సత్తా చాటారు. చందూలాల్‌కు కాకుండా మరో వ్యక్తికి టికెట్ ఇస్తే గెలుపించుకుని కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తామని, లేకుంటే స్వతంత్రంగా బరిలో నిలబడుతామని వారు హెచ్చరించారు. ఆ నాలుగు నియోజకవర్గాల్లో ... పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు అభ్యర్థిత్వాన్ని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు వ్యతిరేకిస్తున్నారు. ఎర్రబెల్లితో పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి ఆగిపోయిందని విమర్శిస్తున్నారు. ఇటీవల తక్కెళ్లపల్లి మద్దతుదారులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. తన మద్దతుదారులతో కలిసి గ్రామల్లో తిరుగుతున్నారు. మహబూబాబాద్ నుంచి టీఆర్ఎస్ టికెట్‌ను ఆశించి భంగపడిన మోహన్‌లాల్ తిరిగి టీడీపీలోకి వెళ్లిపోయారు. ఎక్సైజ్ అధికారిగా పనిచేస్తున్న ఆయన గత ఎన్నికల్లో టీడీపీ తరఫున మహబూబాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. టికెట్ రాకపోవడంతో ఆయన తిరిగి సొంత గూటికి వెళ్లిపోయారు. మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత వర్గం కూడా శంకర్ నాయక్‌కు సహకరించే యోచనలో లేనట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఇక డోర్నకల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన సత్యవతి రాథోడ్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు గానీ.. ఎంత కాలం ఇలా మౌనంగా ఉందామని, తిరిగి సొంత గూటికి వెళ్లిపోదామని కార్యకర్తలు ఆమెపై ఒత్తిడి తెస్తున్నట్లు గుర్తించారు. జనగామ నియోజకవర్గంలో కూడా ఓ వర్గం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకు చీలిపోయే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు తెలిసింది. -
మా దగ్గర మార్చాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల వ్యూహంలో ముందున్న టీఆర్ఎస్లో అసంతృప్తుల సమస్యకు ఎంతకీ తెర పడట్లేదు. డజను వరకు నియోజకవర్గాల్లో ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. ఎనిమిది సెగ్మెంట్లలో టీఆర్ఎస్ అభ్యర్థికి పోటీగా అసమ్మతి నేతలు ఏకంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని చెబుతున్నారు. అభ్యర్థులను మార్చాలని, లేకుంటే పార్టీ విజయం సాధించదని మరో 4 సెగ్మెంట్లలో ద్వితీయ శ్రేణి నేతలు కార్యక్రమాలు చేపడుతున్నారు. 105 అసెంబ్లీ స్థానాలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టికెట్లు ప్రకటించిన రోజే అసమ్మతి రాజకీయాలు మొదలయ్యాయి. ప్రతిరోజూ కేటీఆర్ చర్చ లు జరుపుతుండటంతో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేసేందుకు అసమ్మతి, అసంతృప్త నేతలు అంగీకరిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పరిస్థితి ఎంతకీ మారట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు నేతలు సొంతంగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జోక్యంతోనే అన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తులు, అసమ్మతి నేతలు పార్టీ దారిలోకి వస్తారనే అభిప్రాయం ఉంది. ప్రచార సభలు నిర్వహించేలోపే అసంతృప్త, అసమ్మతి నేతల బుజ్జగింపుల కార్యక్రమం ముగించాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. ► రామగుండంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణకు ప్రధాన పోటీదారుగా తిరుగుబాటు అభ్యర్థి కోరుకంటి చందర్ ప్రచారం చేస్తున్నా రు. మంత్రి కేటీఆర్ చర్చలకు పిలిచినా చందర్ రావట్లేదని, పోటీలో ఉంటానని తేల్చి చెప్పినట్లు తెలిసిం ది. ఒకే పార్టీ నుంచి ఇద్దరు ప్రచారం చేస్తుండటంతో ఇక్కడి శ్రేణుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. ► భూపాలపల్లిలోనూ ఇద్దరు టీఆర్ఎస్ నేతల ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారితో సమానంగా అసమ్మతి నేత గండ్ర సత్యనారాయణరావు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏ హామీ ఇచ్చినా కచ్చితంగా పోటీలో ఉంటానని చెబుతున్నారు. ► వేములవాడలో టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబును మార్చాలని ద్వితీయ శ్రేణి నేతలు రోజూ డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ► మిర్యాలగూడలో తాజా మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావుకు టీఆర్ఎస్ మరో నేత పోటీ వచ్చే పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి ఇక్కడ ప్రచారం కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని మార్చకుంటే ఈ సెగ్మెంట్లో పార్టీ గెలవదని చెబుతున్నారు. ► సత్తుపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవికి పోటీగా ఆ పార్టీ మరో నేత మట్టా దయానంద్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దయానంద్ గత ఎన్నికల్లో ఇక్కడ రెండో స్థానంలో నిలిచారు. ► ఉప్పల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి బేతి సుభాష్‌రెడ్డిని మార్చాలని అక్కడి కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. సెగ్మెంట్లోని మొత్తం ఎనిమిది మంది కార్పొరేటర్లు బహిరంగంగా ఇదే డిమాండ్ చేస్తున్నారు. సుభాష్‌రెడ్డిని మార్చకుంటే ఇక్కడ టీఆర్ఎస్ గెలవదని.. గెలిచే వారికి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ► షాద్‌నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్‌ను మార్చాలన్న డిమాండ్‌తో అసమ్మతి నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు వి.శంకర్, అందె బాబయ్య ఆధ్వర్యంలో అధికారిక అభ్యర్థికి పోటీగా ప్రచారం చేస్తున్నారు. తమలో ఒకరు పోటీలో ఉంటారని చెబుతున్నారు. ► ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, గత ఎన్నికల అభ్యర్థి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వతంత్రంగా పోటీ చేసేందుకు చంద్రశేఖర్‌రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ► నాగార్జునసాగర్‌లో నోముల నర్సింహయ్యను మార్చాలని డిమాండ్ కొనసాగుతోంది. మరో నేత ఎంసీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో అన్ని మండలాల్లోనూ రోజూ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ► జగిత్యాల టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్‌కుమార్‌ను మార్చాలని అక్కడి నేతలు డిమాండ్ చేస్తున్నారు. సంజయ్‌ను మార్చకుంటే టీఆర్ఎస్ విజయం సాదించదని మాజీ జడ్పీటీసీ ఎం.జితేందర్‌రావు, ఎం.గంగారెడ్డి, బి.భాస్కర్‌రెడ్డి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బి.శంకర్, జగిత్యాల మున్సిపల్ ఫ్లోర్ లీడర్ టి.సరళాదేవీ అంటున్నారు. ► పటాన్చెరు నియోజకవర్గంలోనూ అభ్యర్థిని మార్చాలనే డిమాండ్ ఆగట్లేదు. తాజా మాజీ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికే ఇక్కడ టికెట్ ఇచ్చారు. టీఆర్ఎస్ నేతలు సఫాన్దేవ్, కొలను బాల్‌రెడ్డి, గాలి అనిల్‌కుమార్‌లు తమకే అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ► ఆలేరులో టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతకు వ్యతిరేకంగా అక్కడి స్థానిక నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేయాలని కోరుతూ ఆలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ మాజీ ఇన్చార్జి సుంకరి శెట్టయ్య, మాజీ జడ్పీటీసీ సభ్యులు గట్టు నరేందర్, కొంతం మోహన్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు వంచ వీరారెడ్డి, బోల్ల కొండల్‌రెడ్డి. బి.ఉపేందర్‌రెడ్డి తదితరులు యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయ మెట్లపై కొబ్బరికాయలు కొట్టారు. ► మహబూబాబాద్ అభ్యర్థి శంకర్‌నాయక్ ప్రచారం సాగట్లేదు. ఏ ఊరికెళ్లినా ప్రజలు, టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే పరిస్థితి ఉంది. దీంతో రెండు రోజుల కింద హైదరాబాద్‌కు వచ్చి మంత్రి కేటీఆర్‌ను కలిశారు. నియోజకవర్గంలో పరిస్థితిని సమీక్షిస్తానని కేటీఆర్ చెప్పారు. -
పసిడిపై భిన్నాభిప్రాయాలు
పసిడి ధర సమీప కదలికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. న్యూయార్క్ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర జూలై 27వ తేదీతో ముగిసిన వారంలో 1.4 శాతం తగ్గి 1,222 డాలర్ల వద్ద ముగిసింది. పసిడి పతనం ఇది వరుసగా ఇది మూడవవారం. అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 4.1 శాతంగా నమెదుకావడం దీనికి నేపథ్యం. ఇదే సమయంలో డాలర్ ఇండెక్స్ 94.47 వద్ద వారంలో ముగిసింది. డాలర్ ఇండెక్స్ ర్యాలీ ఖాయమని, పసిడి ధరను ఇది మరింత కిందకు దింపుతుందని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే వాణిజ్య యుద్ధం తీవ్రత, చైనాసహా పలుదేశాల కరెన్సీ విలువల పతనం పసిడికి సానుకూలమవుతుందని పలువురు భావిస్తున్నారు. కాగా భారత్ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్‌లో పసిడి ధర రూ.29,767 వద్ద ముగిసింది. మరోవైపు డాలర్ మారకంలో రూపాయి మారకం విలువ శుక్రవారం రూ. 68.62 వద్ద ముగిసింది. -
4 అనుకూలం.. 9 వ్యతిరేకం
న్యూఢిల్లీ: లోక్‌సభ, అన్ని శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడంపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశాయి. నాలుగు పార్టీలు ఏకకాల ఎన్నికలకు తమ మద్దతు తెలపగా, 9 పార్టీలు వ్యతిరేకించాయి. ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఏ మాటా చెప్పకుండా తమకు మరికొంత సమయం కావాలన్నాయి. ఒకేసారి ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు చెప్పాల్సిందిగా న్యాయ కమిషన్ గతంలో రాజకీయ పార్టీలను కోరింది. శని, ఆదివారాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు న్యాయకమిషన్ చైర్మన్‌ను కలసి అభిప్రాయాలను వెలిబుచ్చారు. శిరోమణి అకాలీ దళ్, టీఆర్ఎస్, అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లు ఏకకాల ఎన్నికలకు తమ మద్దతు తెలిపాయి. 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడే ఏకకాల ఎన్నికలను జరిపితేనే సమర్థిస్తామని ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ చెప్పారు. 2019లో ఏకకాల ఎన్నికలు నిర్వహిస్తే యూపీలో 2017లో ఏర్పడిన ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం రద్దయి మళ్లీ ఎన్నికలొస్తాయి. టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, డీఎంకే, సీపీఐ, సీపీఎం, జేడీఎస్, ఏఐఎఫ్బీ, గోవా ఫార్వర్డ్ పార్టీలు వ్యతిరేకించాయి. ఏకకాల ఎన్నికలకు తాము అనుకూలమేనంటూ జేడీయూ ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్‌లు జూలై 31లోపు తమ అభిప్రాయాలను చెప్పనున్నాయి. ఎన్నికలను ఆలస్యం చేసే కుట్ర: ఆప్ ఆప్ సీనియర్ నేత ఆశిశ్ ఖేతన్ న్యాయకమిషన్ చైర్మన్‌ను కలసి తమ పార్టీ అభిప్రాయాన్ని తెలియజెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో శాసనసభల పదవీకాలాన్ని పొడిగించి, ఎన్నికలను జాప్యం చేసేందుకు కుట్ర జరుగుతోందనీ, అందుకే ఏకకాల ఎన్నికలను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. అన్నాడీఎంకే తరఫున తంబిదురై న్యాయ కమిషన్ చైర్మన్‌తో భేటీ అయ్యారు. ఏకకాల ఎన్నికలకు తాము అనుకూలమేననీ, అయితే దీన్ని ఆచరణలోకి తేవాలంటే ముందుగా ఈ ప్రక్రియకు ఉన్న అడ్డంకులను తొలగించాలని తంబిదురై చెప్పారు. ఏకకాల ఎన్నికలు జరిగితే జాతీయ పార్టీలు తమ ధనబలంతో ఎన్నికల్లో అవినీతికి పాల్పడతాయనీ, ఈ ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నామని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బంధోపాధ్యాయ్ స్పష్టం చేశారు. ఈ ఆలోచన మాదే: బీజేడీ ఏక కాల ఎన్నికలకు తాము పూర్తిగా మద్దతిస్తామనీ, అసలు ఆ ఆలోచన తమ పార్టీ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌దేనని బిజూ జనతా దళ్ (బీజేడీ) తెలిపింది. ఏకకాల ఎన్నికల ప్రతిపాదనను తొలిసారిగా నవీన్ పట్నాయక్ 2004లోనే తీసుకొచ్చారంది. ఒడిశాలో 2005లో జరగాల్సిన శాసనసభ ఎన్నికలను నవీన్ పట్నాయక్ ఏడాది ముందుకు జరిపి, 2004లో లోక్‌సభ ఎన్నికలతోపాటే జరిగేలా చేశారని బీజేడీ ఎంపీ పినాకి మిశ్రా చెప్పారు. తమ అభిప్రాయాన్ని నివేదిక రూపంలో త్వరలోనే న్యాయకమిషన్‌కు అందజేస్తామని పినాకి మిశ్రా చెప్పారు. -
వేములవాడ టీ కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాలు
సాక్షి, సిరిసిల్లా : రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల మధ్య అంతర్గతంగా ఉన్న విబేధాలు మరో సారి భగ్గుమన్నాయి. తాజాగా సిరిసిల్లా జిల్లాలో కొనగాల మహేశ్, ఆది శ్రీనివాస్ వర్గాలుగా విడిపోయ్యాయి. దీంతో వేములవాడ పట్టణంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మృత్యుంజయం పాల్గొన్న సమావేశాన్ని మహేశ్ వర్గం వారు పూర్తిగా బహిష్కరించడంతో సొంత నియోజకవర్గంలోనే పొన్నంకు చుక్కెదురైంది. మాజీ ఎంపీ ప్రభాకర్ ఒంటెద్దు పోకడలకు విసిగిపోయి.. ఆయన నిర్వహించిన సమావేశానికి ఏఐసీసీ సభ్యులు కొనగాల మహేశ్‌తో సహా, మనోహర్ రెడ్డి, చంద్రశేఖర్, గంగాధర్, మండల అధ్యక్షులు, ఎంపీపీలు, సీనియర్ నాయకులు దూరంగా ఉన్నారు. వీరంతా కలసి కోరుట్లలో క్యాంప్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వేములవాడలో పార్టీని కాపాడుకునే విషయమై ఏఐసీసీ సభ్యులు కొనగాల మహేశ్ హైదరాబాద్ నుంచి చక్రం తిప్పుతున్నారు. -
సీఎం పీఠం కన్నా ఆత్మగౌరవమే ముఖ్యం: కుమారస్వామి
బెంగళూరు: కర్ణాటకలో మంత్రిత్వ శాఖల కేటాయింపు విషయంలో కాంగ్రెస్‌తో భేదాభిప్రాయాలున్నాయని సీఎం కుమారస్వామి చెప్పారు. ఇవి ప్రభుత్వాన్ని పడగొట్టేంత పెద్దవేమీ కాదన్నారు. ఆత్మగౌరవాన్ని వదులుకుని సీఎం పీఠానికి అతుక్కుపోవాలనుకోవటం లేదన్నారు. ‘శాఖల కేటాయింపు జరగలేదు. ఈ విషయంలో కాంగ్రెస్‌తో సమస్యలున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు అధిష్టానం నుంచి ఆమోదం లభించాక∙కేబినెట్ విస్తరణ ఉంటుంది. ఏ సమస్యను ప్రతిష్టాత్మకంగా తీసుకోను. ప్రతిదాన్నీ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా. ఆత్మగౌరవాన్ని వదులుకుని సీఎం పీఠానికి అతుక్కుపోను’ అన్నారు. కాంగ్రెస్‌తో చర్చించాకే రుణమాఫీ ‘దురుద్దేశపూర్వకంగానే యడ్యూరప్ప రాష్ట్రవ్యాప్త బంద్‌కు (సోమవారం) పిలుపునిచ్చారు. ఇచ్చిన మాటపై వెనక్కు తగ్గను. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ నేతలతో చర్చించాను. వారి నిర్ణయాన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని స్వామి తెలిపారు. కేంద్రంలో నాలుగేళ్ల పాలన పూర్తిచేసుకున్న ఎన్డీయే ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తానన్నారు. ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుపై అధిష్టానంతో చర్చించేందుకు డిప్యూటీ సీఎం పరమేశ్వర, మాజీ సీఎం సిద్దరామయ్య, సీనియర్ నేత డీకే శివకుమార్సహా పలువురు కర్ణాటక కాంగ్రెస్ నేతలు ప్రత్యేక విమానంలో శనివారం ఢిల్లీకి వెళ్లారు. ‘అన్ని చర్చలు ఢిల్లీలోనే జరుగుతాయి ఎవరికి ప్రాధాన్యతనివ్వాలి, ఎవరిని పరిగణనలోకి తీసుకోవాలి వంటి నిర్ణయాలను అధిష్టానమే తీసుకుంటుంది’ అని పరమేశ్వర తెలిపారు. అంతకుముందు వీరంతా బెంగళూరులోని ఓ హోటల్లో చర్చలు జరిపారు. కన్నడ ప్రభుత్వ పాలన కోసం కనీస ఉమ్మడి కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన సమన్వయ కమిటీ ఏర్పాటుపైనా అధిష్టానంతో చర్చించనున్నారని సమాచారం. కాంగ్రెస్ జాబితా ఖరారు డీకే శివకుమార్ సహా 16 మందికి చోటు సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కర్ణాటక ప్రభుత్వంలో కాంగ్రెస్ కోటాలో ఉన్న మంత్రిత్వ శాఖలకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఈ జాబితాలో మాజీ మంత్రులు డీకే శివకుమార్, మాజీ హోం మంత్రి రామలింగారెడ్డి, ప్రియాంక్ ఖర్గేసహా 16 మంది పేర్లున్నాయి. ఢిల్లీలోని 12 తుగ్లక్ రోడ్లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌తో కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర, మాజీ సీఎం సిద్దరామయ్య, సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేలు శనివారం సమావేశమై ఈ జాబితాను ఖరారు చేశారు. కీలక శాఖలను జేడీఎస్‌కు ఇవ్వద్దని కర్ణాటక కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. అటు, మే 28న (సోమవారం) జరగాల్సిన ఆర్ఆర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక విషయంలోనూ సంకీర్ణ పక్షాలు ఓ నిర్ణయానికి రాలేకపోయాయి. కాంగ్రెస్‌తో పొత్తు అంతవరకే: దేవెగౌడ కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మాత్రమే కాంగ్రెస్‌తో పొత్తు కుదిరిందని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ స్పష్టం చేశారు. శనివారం రాజరాజేశ్వరి నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తమ ప్రత్యర్థి అని దేవెగౌడ పేర్కొన్నారు. జేడీఎస్ అభ్యర్థి రామచంద్రప్ప బరి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదన్నారు. నకిలీ ఓటరు కార్డులు బయటపడడంతో ఈ నియోజకవర్గ ఎన్నిక ఈ నెల 28కి వాయిదా పడింది. -
మా వేతనాలు వదులుకోబోం: శివసేన
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ మలివిడత సమావేశాలు కొనసాగని కారణంగా.. 23 రోజుల వేతనాన్ని వదులుకుంటున్నామన్న బీజేపీ నిర్ణయంపై ఎన్డీయే పక్షాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ తమ వేతనాలు వదులుకోబోవటం లేదని శివసేన స్పష్టం చేసింది. వేతనాల విషయంలో తమను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారని మండిపడింది. పార్లమెంటు నిరసనలతో వాయిదా పడేందుకు ప్రభుత్వం తీరే కారణమని శివసేన విమర్శించింది. అటు ఆర్ఎల్ఎస్పీ చీఫ్, కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహ కూడా వేతనాల విషయం తమకు తెలియదన్నారు. బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కూడా బీజేపీ నాయకత్వం నిర్ణయంపై విభేదించారు. కాగా, మొత్తం 400 మంది ఎన్డీయే ఎంపీ (ఉభయసభలు)ల 23 రోజుల వేతనం రూ.3.66 కోట్లను వదులుకోనున్నట్లు గురువారం కేంద్ర మంత్రి అనంత్ కుమార్ వెల్లడించారు. -
అత్తగారి ఇంటి ఎదుట మహిళ ఆందోళన
♦ న్యాయం చేయాలని డిమాండ్ ♦ మద్దతు తెలిపిన మహిళా సంఘాలు నేరేడుచర్ల (హుజూర్నగర్) : తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ వివాహిత తన అత్తగారి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ స సంఘటన మంగళవారం మండలంలోని కల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఆందోళనకు సూర్యాపేటకు చెందిన మహిళా సంఘాలు మద్దతు పలికారు. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన అరుణకు నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన బుడిగె నాగరాజుతో 1998లో వివాహమైంది. వీరికి ఇద్దరు మగపిల్లలు. పెళ్లయిన కొద్దికాలం వరకు మంచిగానే సాగిన వీరి సంసారంలో విబేధాలు రావడంతో భార్యభర్తలు తరచూ గొడవలు పడుతుండేవారు. 2008లో అదనపు కట్నం కోసం వేధిం చాడని నాగరాజుపై అరుణ కేసు పెట్టి కోర్టును ఆశ్రయిం చింది. ఆనాటి నుంచి అరుణ పుట్టింట్లోనే ఉంటోంది. నాగరాజు పిల్లలిద్దరిని చదివించుకుంటూ మరో మహిళను పెళ్లి చేసుకోవడంతో వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఈ నేపథ్యంలో అరుణ మంగళవారం తనను ఆదరిచాలని తన పేరు మీద ఉన్న 3 ఎకరాల భూమిని తన ఇద్దరు కుమారులకు సమానంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారి ఇంటి ఎ దుట బైఠాయించింది. ఈమె ఆందోళనకు మహిళా సం ఘా ల మద్దతు తెలిపాయి. ఆందోళన జరుగుతున్న సమయంలో తన భర్త అందుబాటులో లేడు. విషయం తెలుసుకున్న నేరేడుచర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆం దోళన చేస్తున్న మహిళలను స్టేషన్‌కు వచ్చి వివాదం పరిష్కరించుకోవాలని సూచించడంతో స్టేషన్‌కు తరలివెళ్లారు. -
గులాబీ దళం.. ఆత్మీయ సమ్మేళనం
ఎమ్మెల్యేలు అరూరి, ఎర్రబెల్లి చొరవతో అన్నారంలో సమావేశం కొత్త, పాత నేతల మధ్య సఖ్యత పెంచడమే లక్ష్యం వరంగల్: అధికార పార్టీ టీఆర్ఎస్లో కొత్త, పాత నేతల మధ్య సమన్వయ లేమితో తలెత్తుతున్న ఇబ్బందులకు స్వస్తి చెప్పే కార్యక్రమం వర్ధన్నపేట నియోజకవర్గంలో మొదలైంది. కీలక రాజకీయ పరిణామాలకు చిరునామాగా భావించే వర్ధన్నపేట నుంచే గులాబీ నేతల సయోధ్యకు శ్రీకారం చుట్టడం గమనార్హం. పార్టీ ఆవిర్భావం నాటి గులాబీ దళంలో పనిచేసిన వారికి, కొత్తగా ఆ గూటికి చేరిన వారికి పొసగకపోవడంతో విబేధాలు పొడచూస్తున్నారుు. వీటికి స్వస్తి పలికే సంకల్పంతో మంగళవారం పర్వతగిరి మండలం అన్నారంలో ‘ఆత్మీయ సమ్మేళనం’ పేరిట ప్రత్యే క సమావేశాన్ని నిర్వహించారు. దీనికి నియోజకవర్గంలోని అన్ని మండలాల టీఆర్ఎస్ కొత్త, పాత నేతలంతా హాజరయ్యారు. 300 మంది వస్తారని భావించగా.. 2000 మందికిపైనే రావడంతో టీఆర్ఎస్ వర్గాల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ కలిసి ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ‘ఆధిపత్యం వద్దు, ఐకమత్యం ముద్దు’ టీఆర్ఎస్లో మొదటి నుంచీ పనిచేస్తున్న వారు వర్ధన్నపేటలో ఎక్కువ మంది ఉన్నారు. గత సాధారణ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలోనే టీఆర్ఎస్కు రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద మెజారిటీ వచ్చింది. అన్ని గ్రామాల్లోనూ టీఆర్ఎస్కు బలమైన నేతలు ఉన్నారు. మూడు దశాబ్దాల పాటు టీడీపీలో కీలక నేతగా వ్యవహరించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు రెండు నెలల క్రితమే టీఆర్ఎస్లో చేరారు. రెండు దశాబ్దాల పాటు ఇదే నియోజకవర్గంలో టీడీపీకి పెద్దదిక్కుగా వ్యవహరించిన ఆయనకు ఈ సెగ్మెంట్లో బలమైన అనుచరగణం ఉంది. వారంతా కూడా ఎర్రబెల్లితో పాటే గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో టీడీపీ చిరునామా గల్లంతరుుంది. మరోవైపు పార్టీ పరంగా, ప్రభుత్వ కార్యక్రమాలపరంగా నెలకొన్న పోటీ కారణంగా క్షేత్రస్థారుులో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల సఖ్యత దెబ్బతింటోంది. ఆధిపత్య పోరులో గ్రూపులు ఏర్పడుతున్నారుు. ఆదిలోనే ఈ పరిస్థితిని నివారించాలని ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి, అరూరి నిర్ణయించారు. ఆధిపత్యం వద్దు.. ఐకమత్యం ముద్దు అంటూ పార్టీ శ్రేణులను ఏకతాటికిపైకి తెచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నారు. తమ ప్రయత్నంగా అన్నారంలో కొత్త, పాత నేతల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తదుపరి చర్యగా గ్రామాలవారీగా నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికలో టీఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీచేసి, గెలిచిన పలువురు కార్పొరేటర్లు సైతం కొన్ని రోజుల్లోనే అధికారికంగా టీఆర్ఎస్లోకి చేరనున్నారని భావిస్తున్నారు. పార్టీ పటిష్టత కోసమే.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను పార్టీల నేతలంతా ఐకమత్యంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇప్పటికే ఎంతోమంది మా పార్టీలో చేరారు. పాత, కొత్త నేతలు సమన్వయంతో ముందుకుసాగితే టీఆర్ఎస్కు తిరుగుండదని ఇటీవల జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారు. ఆ దిశగానే నియోజకవర్గంలోని నాయకులను ఏకతాటిపైకి తెచ్చేందుకే ఈ సమ్మేళనం మేం నిర్వహించాం. - అరూరి రమేష్, వర్ధన్నపేట ఎమ్మెల్యే