ఎమ్మెల్యేలు అరూరి, ఎర్రబెల్లి చొరవతో అన్నారంలో సమావేశం
కొత్త, పాత నేతల మధ్య సఖ్యత పెంచడమే లక్ష్యం
వరంగల్: అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో కొత్త, పాత నేతల మధ్య సమన్వయ లేమితో తలెత్తుతున్న ఇబ్బందులకు స్వస్తి చెప్పే కార్యక్రమం వర్ధన్నపేట నియోజకవర్గంలో మొదలైంది. కీలక రాజకీయ పరిణామాలకు చిరునామాగా భావించే వర్ధన్నపేట నుంచే గులాబీ నేతల సయోధ్యకు శ్రీకారం చుట్టడం గమనార్హం. పార్టీ ఆవిర్భావం నాటి గులాబీ దళంలో పనిచేసిన వారికి, కొత్తగా ఆ గూటికి చేరిన వారికి పొసగకపోవడంతో విబేధాలు పొడచూస్తున్నారుు. వీటికి స్వస్తి పలికే సంకల్పంతో మంగళవారం పర్వతగిరి మండలం అన్నారంలో ‘ఆత్మీయ సమ్మేళనం’ పేరిట ప్రత్యే క సమావేశాన్ని నిర్వహించారు. దీనికి నియోజకవర్గంలోని అన్ని మండలాల టీఆర్‌ఎస్ కొత్త, పాత నేతలంతా హాజరయ్యారు. 300 మంది వస్తారని భావించగా.. 2000 మందికిపైనే రావడంతో టీఆర్‌ఎస్ వర్గాల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ కలిసి ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు.
‘ఆధిపత్యం వద్దు, ఐకమత్యం ముద్దు’
టీఆర్‌ఎస్‌లో మొదటి నుంచీ పనిచేస్తున్న వారు వర్ధన్నపేటలో ఎక్కువ మంది ఉన్నారు. గత సాధారణ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలోనే టీఆర్‌ఎస్‌కు రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద మెజారిటీ వచ్చింది. అన్ని గ్రామాల్లోనూ టీఆర్‌ఎస్‌కు బలమైన నేతలు ఉన్నారు. మూడు దశాబ్దాల పాటు టీడీపీలో కీలక నేతగా వ్యవహరించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు రెండు నెలల క్రితమే టీఆర్‌ఎస్‌లో చేరారు. రెండు దశాబ్దాల పాటు ఇదే నియోజకవర్గంలో టీడీపీకి పెద్దదిక్కుగా వ్యవహరించిన ఆయనకు ఈ సెగ్మెంట్‌లో బలమైన అనుచరగణం ఉంది. వారంతా కూడా ఎర్రబెల్లితో పాటే గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో టీడీపీ చిరునామా గల్లంతరుుంది. మరోవైపు పార్టీ పరంగా, ప్రభుత్వ కార్యక్రమాలపరంగా నెలకొన్న పోటీ కారణంగా క్షేత్రస్థారుులో టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తల సఖ్యత దెబ్బతింటోంది. ఆధిపత్య పోరులో గ్రూపులు ఏర్పడుతున్నారుు. ఆదిలోనే ఈ పరిస్థితిని నివారించాలని ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి, అరూరి నిర్ణయించారు. ఆధిపత్యం వద్దు.. ఐకమత్యం ముద్దు అంటూ పార్టీ శ్రేణులను ఏకతాటికిపైకి తెచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నారు. తమ ప్రయత్నంగా అన్నారంలో కొత్త, పాత నేతల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తదుపరి చర్యగా గ్రామాలవారీగా నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికలో టీఆర్‌ఎస్ తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీచేసి, గెలిచిన పలువురు కార్పొరేటర్లు సైతం కొన్ని రోజుల్లోనే అధికారికంగా టీఆర్‌ఎస్‌లోకి చేరనున్నారని భావిస్తున్నారు.
పార్టీ పటిష్టత కోసమే..
టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను పార్టీల నేతలంతా ఐకమత్యంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇప్పటికే ఎంతోమంది మా పార్టీలో చేరారు. పాత, కొత్త నేతలు సమన్వయంతో ముందుకుసాగితే టీఆర్‌ఎస్‌కు తిరుగుండదని ఇటీవల జరిగిన టీఆర్‌ఎస్ ప్లీనరీలో పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారు. ఆ దిశగానే నియోజకవర్గంలోని నాయకులను ఏకతాటిపైకి తెచ్చేందుకే ఈ సమ్మేళనం మేం నిర్వహించాం. - అరూరి రమేష్, వర్ధన్నపేట ఎమ్మెల్యే