ముచ్చెర్ల అరుణ.. అచ్చ తెలుగింటి ఆడపడుచు. తన సినీప్రయాణం మొదలైంది మాత్రం తమిళ సినిమాతోనే! 1980లో కళుక్కుల్ ఈరమ్ అనే సినిమాతో హీరోయిన్‌గా మారింది. అక్కడ పదుల సంఖ్యలో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాక తెలుగు ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చింది. అలా రావుగారి ఇంట్లో రౌడీ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. సెకండ్ హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించింది.
బిజినెస్‌మెన్‌తో పెళ్లి
ఆమె హీరోయిన్‌గా నటించిన సీతాకోక చిలుక మూవీ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు గెలుచుకుంది. ఈ కథానాయిక 1987లో బిజినెస్‌మెన్ మోహన్‌ను పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత సినిమాలు చేయకూడదు అని ఆయన కండీషన్ పెట్టాడట! దానికి ఒప్పుకునే పెళ్లి చేసుకుంది. వీరికి నలుగురు ఆడపిల్లలు. భర్తకు ఇచ్చిన మాట ప్రకారం ఇండస్ట్రీకి దూరమైంది. అలా ఆమె సినిమాలకు దూరమై దాదాపు పాతికేళ్లవుతోంది. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వంటలు చేస్తూ, రీల్స్ చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తోంది. తాజాగా ఓ నగల దుకాణానికి వెళ్లిన ఆమెకు రీఎంట్రీ గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై అరుణ మాట్లాడుతూ.. ప్రస్తుతానికైతే నేను ఏ సినిమా చేయడం లేదు.
ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండటాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ రీల్స్ చేస్తూ కాలక్షేపం చేయడం బాగుంది. ఇదే కంటిన్యూ చేస్తాను. నా కూతుర్లు బిజీగా ఉండటంతో నా వీడియోలు తీయడం లేటవుతోంది. వీడియోల కోసం ప్రత్యేకంగా రెడీ అవడం, మేకప్ లాంటివేమీ ఉండదు. ఫోన్‌లోనే చాలా సహజంగా వీడియోలు చేస్తుంటాను. నాకిది చాలనిపిస్తోంది. జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను' అని అరుణ చెప్పుకొచ్చింది.
చదవండి: 18 ఏళ్ల వయసులో అలా చెప్పా.. ముద్దు సీన్‌పై అనుపమ రియాక్షన్
Comments
Please login to add a commentAdd a comment