mucherla
-
సునోజి మేరగాన – కహాతా రహే తెలంగాణ..
సంగంరెడ్డి సత్యనారాయణ (Sangam Reddy Satyanarayana) పేరు తెలంగాణ పాత తరానికి బాగా పరిచయం. కొత్త తరానికి ఆయన అంతగా తెలియదు. వరంగల్ జిల్లాలోని ముచ్చర్ల (Mucherla) గ్రామంలో 1933 జనవరి 21న పుట్టిన ఆయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మూలమైన ‘నాన్–ముల్కి’ ఉద్యమం 1950లో ప్రారంభమైనప్పుడు దానికి సాహిత్య ప్రాణం పోసిన తొలి విద్యార్థి మేధావి. హన్మకొండలోని మల్టీ పర్పస్ హైస్కూల్ అధ్యక్షుడిగా ఆ స్కూల్లోని ఆంధ్ర టీచర్లు, తెలంగాణ భాషను అవమానిస్తుంటే తిరుగుబాటును ఆర్గనైజ్ చేశాడు. అప్పటినుండే పాటలు రాయడం, ఉపన్యాసమివ్వడం, నాటకాలెయ్యడంలో దిట్టగా ఎదిగాడు.‘పచ్చని చెట్ల పైట రెపరెపలాడంగ; పాడిపంటలనిచ్చి కడుపునింపే తల్లి చల్లని మా తల్లి ముచ్చర్ల గ్రామం’ వంటి పాటతో మొదలెట్టి, నాన్ –ముల్కీ పోరాటంలోనే ‘తెలంగాణ సోదర తెలుసుకో నీ బతుకు; మోసపోతివ నీవు గోస పడతావు’ అనే పాట రాసి, పాడి ఉర్రూత లూగించాడు. తన గ్రామంపై పాట రాసినందున ఆయనను ముచ్చెర్ల సత్యనారాయణ (Mucherla Satyanarayana) అనేవారు. ఊరి నుండి బడికి రోజూ 12 మైళ్ళు నడిచొచ్చే, బట్టలు కూడా సరిగా లేని ఆయన 12వ తరగతి ఫెయిల్ అయ్యాడు. సప్లమెంటరీ రాసి పాసై హైదరాబాద్‌కు వచ్చిసంగీత కళాశాలలో చేరాడు. ఉండటానికి చోటు లేక గూటి కోసం వెతగ్గా రవీంద్ర భారతి పక్కన బీసీ హాస్టల్ (BC Hostel) ఉందని తెలిసి సంగం లక్ష్మీబాయమ్మను కలిసి పాట పాడి ఆమెను మెప్పించి అడ్మిషన్ తెచ్చుకున్నాడు.ఒక సంవత్సరంలో హిందూస్థానీ, కర్ణాటక సంగీతం నేర్చుకొని సత్యనారాయణ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో (Osmania Arts College) బీఏ తెలుగు, సంస్కృతం, ఎకనామిక్స్ చదువుకున్నాడు. 1956లో తెలంగాణ స్టేట్ ఆంధ్రలో కలిసి ఆంధ్రప్రదేశ్ కావడంతో సత్యనారాయణ, ఆయన మిత్రులు నాన్– ముల్కీ ఉద్యమాన్ని ఆంధ్ర వ్యతిరేక ఉద్యమంగా మార్చారు. ఆ ఉద్యమ మొదటి పాట ఆయన రాసి పాడిందే. అదీ మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మీద.‘అయ్యయ్యో రామరామ సంజీవరెడ్డి మామ / సునోజి మేరగాన – కహాతా రహే తెలంగాణ /..... / ఛోడోజీ తెలంగాణ – భలే జావో రాయలసీమ’... ఈ పాట ఆ కొత్త ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది. 1948 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి 1956 మధ్యలో అటు ఆంధ్ర నుండి, ఇటు మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుండి బ్రాహ్మణ మైగ్రేషన్ బాగా జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రమంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లిష్ డిగ్రీలు సంపాదించిన బ్రాహ్మణ మేధావులు ప్రొఫెసర్లు అయ్యారు. దాదాపు 1960 నాటికి ఇక్కడి రెడ్లు, వెలమలు ఎంఏ, ఎమ్మెస్సీ పట్టాలు పొందినవారు లేరు.1953–56 మధ్య సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలనే చర్చల్లో తెలంగాణ ప్రాంతం బ్రాహ్మణ మేధావులు ఉన్నారు. ఇప్పుడు వరంగల్‌లో ఒక హెల్త్ యూనివర్సిటీ పేరు, ఒక కళాక్షేత్రం పేరు పెట్టిన కాళోజీ 1969 వరకు సమైక్యవాదే. సత్యనారాయణ నాన్–ముల్కీ పోరాటం స్కూలు ప్రెసిడెంట్‌గా నడిపినపుడు జయశంకర్ ఆయన క్లాస్మేట్. ఇద్దరు కలిసి నాటకాలు వేశారు. కానీ సత్యనారాయణ లాగా మిలిటెంట్ నాన్– ముల్కీ వ్యతిరేక ఉద్యమంలో ఆయన ఉన్న దాఖలాలు లేవు. సత్యనారాయణ గొల్ల (యాదవ) కులంలో పుట్టినందున ఒక క్రియేటివ్ కవిగా, పాటగాడిగా ఆయనకు రావలసినంత గుర్తింపు రాలేదు. 1950 దశకంలో ఉస్మానియాలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన గ్రామానికి పోయి గ్రామ ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్, ఆ తరువాత 1970లో హన్మకొండ సమితి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆనాటి మొట్ట మొదటి దళిత్ కలెక్టర్ కాకి మాధవరావుతో దోస్తీ చేసి గ్రామాలకు అభివృద్ధి పథకాలను తీసుకెళ్లాడు.చదవండి: ప్రపంచానికి ఏం రాసి పెట్టి ఉంది?1983 ఎన్టీఆర్ టీడీపీ రాగానే అందులో చేరి ఎమ్మెల్యేగా హయగ్రీవాచారిని చిత్తుగా ఓడించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అయ్యాడు. అయితే అనతి కాలంలోనే వరంగల్ జిల్లాలో మైగ్రేట్ కమ్మ నాయకుడు శివాజిని, కమ్మ డాక్టర్ కల్పనాదేవిని ఆయనపై అజమాయిషికి పెట్టడంతో ఎన్టీఆర్ మీద ఆయన తిరుగుబాటు మొదలైంది. ఆయన ఎన్టీఆర్ మీద కోపంతో నాదెండ్ల భాస్కర్ రావు క్యాంపులో చేరి చివరికి పదవి కోల్పోయాడు. ఆ తరువాత మళ్ళీ కడవరకు అంటే 2016లో చనిపోయే వరకు ప్రత్యేక తెలంగాణ కోసం రకరకాల కార్యక్రమాలు చేపట్టాడు. 2001లో కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ పెడితే దానిలో చేరి కొంతకాలం పనిచేశాడు.చదవండి: ఓబీసీల వర్గీకరణతో సమన్యాయంఆయన చనిపోయి 8 సంవత్సరాలు అయినా ఆయనకో విగ్రహంగానీ, ఆయన పోతే వరంగల్ ప్రాంతంలో ఏ సంస్థనూ ఎవరూ పెట్టింది లేదు. ఆయనతో పని చేసిన జయశంకర్‌కు, కాళోజీకి, కొండా లక్ష్మణ్‌కి చాలా గుర్తింపు దొరికింది. జీవితంలో సుదీర్ఘకాలం బీదరికంలో బతికిన ఆయన మనకో ఆదర్శాన్ని మిగిల్చాడు.- ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు(జనవరి 21న సంగంరెడ్డి సత్యనారాయణ జయంతి) -
సినిమాల్లోకి ఒకప్పటి స్టార్ హీరోయిన్ రీఎంట్రీ?
ముచ్చెర్ల అరుణ.. అచ్చ తెలుగింటి ఆడపడుచు. తన సినీప్రయాణం మొదలైంది మాత్రం తమిళ సినిమాతోనే! 1980లో కళుక్కుల్ ఈరమ్ అనే సినిమాతో హీరోయిన్గా మారింది. అక్కడ పదుల సంఖ్యలో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాక తెలుగు ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చింది. అలా రావుగారి ఇంట్లో రౌడీ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. సెకండ్ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించింది. బిజినెస్‌మెన్‌తో పెళ్లి ఆమె హీరోయిన్గా నటించిన సీతాకోక చిలుక మూవీ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు గెలుచుకుంది. ఈ కథానాయిక 1987లో బిజినెస్మెన్ మోహన్‌ను పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత సినిమాలు చేయకూడదు అని ఆయన కండీషన్ పెట్టాడట! దానికి ఒప్పుకునే పెళ్లి చేసుకుంది. వీరికి నలుగురు ఆడపిల్లలు. భర్తకు ఇచ్చిన మాట ప్రకారం ఇండస్ట్రీకి దూరమైంది. అలా ఆమె సినిమాలకు దూరమై దాదాపు పాతికేళ్లవుతోంది. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వంటలు చేస్తూ, రీల్స్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తోంది. తాజాగా ఓ నగల దుకాణానికి వెళ్లిన ఆమెకు రీఎంట్రీ గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై అరుణ మాట్లాడుతూ.. ప్రస్తుతానికైతే నేను ఏ సినిమా చేయడం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండటాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ రీల్స్ చేస్తూ కాలక్షేపం చేయడం బాగుంది. ఇదే కంటిన్యూ చేస్తాను. నా కూతుర్లు బిజీగా ఉండటంతో నా వీడియోలు తీయడం లేటవుతోంది. వీడియోల కోసం ప్రత్యేకంగా రెడీ అవడం, మేకప్ లాంటివేమీ ఉండదు. ఫోన్లోనే చాలా సహజంగా వీడియోలు చేస్తుంటాను. నాకిది చాలనిపిస్తోంది. జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను' అని అరుణ చెప్పుకొచ్చింది. చదవండి: 18 ఏళ్ల వయసులో అలా చెప్పా.. ముద్దు సీన్‌పై అనుపమ రియాక్షన్ -
సీతాకోకచిలుక హీరోయిన్ అరుణ ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తుంది?
సీతాకోకచిలుక హీరోయిన్ అరుణ గుర్తున్నారా? ఈ ఒక్క సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్డమ్ సంపాదించుకున్న అరుణ ప్రస్తుతం ఎక్కడుంది? ఇప్పుడేం చేస్తుంది అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అందం, అభినయం కలబోసిన అచ్చతెలుగు అమ్మాయి ముచ్చర్ల అరుణ. తొలి సినిమాతోనే ప్రముఖ దర్శకుడు భారతీరాజా సినిమాలో చాన్స్ కొట్టేసింది. 1981లో ఆయన తెరకెక్కించిన సీతాకోకచిలుక అప్పట్లో ఓ సంచలనం. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఓవర్‌నైట్ స్టార్డడమ్ సంపాదించుకుంది అరుణ. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారామె. చటంబ్బాయి, స్వర్ణకమలం, సంసారం ఒక చదరంగం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి హిట్ సినిమాల్లో నటించిన మెప్పించింది. ఫ్యామిలీ హీరోయిన్గా స్థానం సంపాదించిన అరుణ కేవలం 10 సంవత్సరాల్లోనే 70కి పైగా సినిమాల్లో నటించి సత్తాచాటింది. అయితే హీరోయిన్గా దూసుకుపోతున్న సమయంలోనే బిజినెస్‌మ్యాన్ మోహన్గుప్తను పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. వీరికి నలుగురు సంతానం. ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయిన ముచ్చర్ల అరుణ రీసెంట్‌గానే ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసింది. ఇందులో వంటలు, హెల్తీ లైఫ్, వర్కవుట్స్ వంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకుంటుంది. అలనాటి అందాల తార మళ్లీ ఇన్నాళ్లకు టచ్‌లోకి రావడంతోనే ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్‌గానే ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చిన అరుణకు ప్రస్తుతం ఒక లక్షా 69వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. View this post on Instagram A post shared by Aruna Gupta (@mucherla.aruna) View this post on Instagram A post shared by Aruna Gupta (@mucherla.aruna) -
తెలంగాణ తొలి పోరాట భేరి
మూడు తరాల తెలం గాణవాది ముచ్చర్ల సత్య నారాయణ. అతని జీవితం ఒక మహా ప్రవాహం. అలాంటి నాయకులు అతి తక్కువ. ఆ విలక్షణతే అతడిని ప్రజలకు దగ్గర చేసింది. స్కూలు విద్యా ర్థిగా ఉన్నప్పుడే ఊరిని గెలిచాడు. పాటలు పాడి, బుర్రకథలు చెప్పి ఊరి ప్రజల తరపున నిలబడ్డాడు. ఊళ్లో భూపోరాటా లకు అక్షరమై మద్దతునిచ్చాడు. కంఠస్వరమై వారికి రక్షణ కవచమయ్యాడు. కాసం లింగారెడ్డి దొర ప్రజల భూములు లాక్కుంటుంటే ప్రజలు ప్రతిఘ టించారు. తన భూముల్లోకి ఎవరూ రాకుండా దారికి అడ్డంగా దొర గోడ కట్టించాడు. అది గమ నించిన ముచ్చర్ల ఓ అర్థరాత్రి తన స్నేహితుల్ని తీసుకెళ్ళి గోడల్ని పగలగొట్టి ఆధిపత్యాల్ని ధిక్క రించాడు. సత్యనారాయణ ఇంటిపేరు సంగంరెడ్డి. సొంతూరు హనుమకొండ పక్కనే ఉన్న ముచ్చర్ల. అందుకే ముచ్చర్ల ఇంటిపేరైంది. ముందు తన ఊరికి సేవ చేయాలను కున్నాడు. తన బాల్య స్నేహితులలో ఎరుకల, యానాది, హరిజన, గిరి జన కులాల వారు ఎందరో. చివరివరకు వారి స్నేహ మాధుర్యాన్ని ఆస్వాదించిన ప్రజల బంధువు. వ్యవసాయ కుటుంబమే అయినా ఎన్నో ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కొన్నాడు. ఒకే జత బట్టలతో స్కూలు విద్య పూర్తి చేశాడు. స్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడే పొరుగురాష్ట్రం నుండి కుప్పలు తెప్పలుగా వచ్చిన అధికారులు, టీచర్ల వివక్షని ఎదుర్కొన్నాడు. ఫీజు కట్టలేదనే నెపంవేసి పరీక్షలు రాయనివ్వలేదు. ఐతే ఇలాంటి ఎన్నో విషయాలను తనదైన శైలిలో ఎదుర్కొని నిలబడ్డాడు. ఒకవైపు రైతాంగం, ప్రజలు నిజాంకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుంటే ముచ్చర్ల గ్రామ ప్రజలు ఊళ్ళోని దొరలకు వ్యతిరేకంగా పోరాడు తుంటే ఆ ప్రజలకు అనుకూలంగా నిలిచాడు. ఆయన తండ్రి నర్సయ్య, తల్లి నర్సమ్మ. ఐదుగురు అన్నదమ్ములు. అందరు కూడా అన్యాయాలను ఎదిరించే గుణం కలిగినవారే. ఇదే లక్షణం చివరి కంటా సత్యనారాయణని వదిలిపెట్టలేదు. ఎన్టీ రామారావు పిలిచి తెలుగుదేశం టిక్కెట్టు ఇప్పిం చాడు. గెలిచాక రవాణా శాఖ మంత్రిగా నియమిం చాడు. కానీ తన ఆత్మగౌరవానికి ప్రజాశ్రేయస్సుకు భంగం కలిగినప్పుడు చేస్తున్న పదవిని తృణ ప్రాయంగా పడేసి వచ్చాడు. ఆ తరువాత ప్రజా జీవితంలో అతి సామాన్య జీవితం గడిపాడు. చదువులకు దూరమైన కుటుం బంలో పుట్టినా తన స్వంతశక్తితో పై చదువులు చదివాడు. ధిక్కార కెరటం లాంటి అతనిలో బలమైన కవి, కళాకారుడు దాగి ఉన్నాడు. పాటలు పాడుతూ బుర్రకథలు చెబుతూ అన్యాయంపై యుద్ధభేరి ప్రకటించాడు. అందుకే ‘‘ తెలంగాణ తొలి పోరాట భేరి’’ అని తనను పిలుచుకున్నారు. ‘నాన్ ముల్కీ గో బ్యాక్’ అని నినదించిన తొలితరం ఉద్యమకారుల్లో ముచ్చర్ల మొదటి శ్రేణిలో నిలు స్తాడు. ఈయన వేసే నాటకాలలో ప్రొ. జయ శంకర్ గారు స్త్రీ వేషాలు వేసేవారు. అంతేకాదు ఇద్దరు ఎంతో మంచి స్నేహితులు. తెలంగాణ వారిని మరింత దగ్గరకు చేర్చింది. ఏనాడు అనుచర ప్రవృత్తిని దరిచేరనివ్వలేదు. నాయకుని గానే నిలి చాడు. ప్రజలకు దూరంగా ఉండి సేవ చేయాలని ఏనాడు భావించలేదు. అందుకే ప్రజల మధ్య, ప్రజలలో ఒకడిగా ఉంటూ కలెక్టర్ల దగ్గరికి, పోలీసుల దగ్గరికి అన్యాయం జరిగిన వాళ్ళని తీసు కెళ్ళి న్యాయం జరిగేలా చూసే వాడు. ప్రేక్షక పాత్ర వహించడానికి ఆమడదూరంలో ఉండేవాడు. తన దైన స్థానాన్ని తాను నిర్మించుకో గల దిట్ట. అది ఉపన్యాసం కావచ్చు. పాట కావచ్చు. అక్షరశక్తి అతనికి వరం. తెలంగాణ సోదరా తెలు సుకో నీ బతుకు అని పాడినా ‘రావోయి రావోయ్ మర్రి చెన్నా రెడ్డి ఇకనైనా రావేమి వెర్రి చెన్నారెడ్డి’ అని గళ మెత్తినా ఇసుక వేస్తే రాలని జనం ఏకగాన ప్రవాహంలో లీనం కావలసిందే. ముచ్చర్ల పాటల మాటలు వినడానికి వేలాదిమంది జనం పిలవ కున్నా వచ్చేవారు. అతని పాటలు ఒక్కొక్కటి ఆయా సందర్భంలో పిడిబాకులవలె దిగేవి. శ్రోతలు అగ్రహోదగ్రులు అయ్యేవారు. ఆలోచించే వారు. తన మాటలతో వారిని కనికట్టు చేసేవారు. మంత్రముగ్ధులై వినేవారు. అంతటితో తనపని పూర్తయిందని ఇంటికెళ్ళి పడుకుంటాడు. ముచ్చర్ల ఆశావాది. గాలికెదురీదుతాడు. సభా నంతరం వారిలో వెలిగిన చైతన్యాన్ని ఏ రూపంలో ఏ దారిలో ముందుకు తీసుకెళ్ళాలో ప్రణాళికలు వేసేవాడు. గాలివాటిన్ని బట్టి పోడు. తానే సుడి గాలై దారిచూపుతాడు. సాహిత్యంలోనే కాదు రాజకీయ ఎత్తుగడలు నిర్మించడంలో అతను దిట్ట. పట్టువిడుపులు లేవని కాదు. కానీ తనకు, తన జాతి, ప్రాంతాలకు అన్యాయం ఎదురైనా, ఆత్మ గౌరవానికి దెబ్బతగిలినా సహించలేడు. వరంగల్ లోనే తనకు పోటీగా ఎన్టీఆర్ మరొకరిని ప్రోత్స హిస్తే దానిని వ్యతిరేకించాడు. కులమో, స్థలమో, బంధు త్వమో, ఏదో ఒక పేరుతో గ్రూపులు పెట్ట డాన్ని సహించలేదు. ఆ విష యాన్ని అధిష్టానానికి స్పష్టం చేసిన గుండెదిటవు గల మనిషి. అందుకే ఒకచోట ఇలా అన్నాడు. ఊరిలో సర్పం చుగా పనిచేసిన ప్పుడు ఇంట్లో ఉన్నట్లు అనిపిం చింది. సమితి ప్రెసిడెంట్ అయ్యాక స్కూల్లో విద్యార్థులతో ఉన్నట్లు అనిపిం చింది. మంత్రి అయినాక మాత్రం జైల్లో ఉన్నట్లు అనిపిస్తుంది. అని తన పరిస్థితి వివరించాడు. ఇల్లు గడవకుంటే ముచ్చర్ల చివరి దశలో కొన్ని వ్యాపారాలు మొదలుపెట్టి చేతులు కాల్చుకున్నాడు. ఉన్న ఆస్థిని కరిగించడంలో దిట్ట. ఏనాడూ వెనకంజ వేయలేదు. 1969 తొలి తెలంగాణ ఉద్యమానికన్నా సుమారు రెండు దశాబ్దాల క్రితమే తెలంగాణ ఇంటా బయటా ఎలా మోసపోతున్నదో కళ్ళారా చూసినవాడు. భవిష్యత్‌ని అంచనా వేశాడు. అందుకు వ్యతిరేకంగా పావులు కదిలించాడు. తాను కదలుతూ ప్రజలను కదిల్చాడు. మలి ఉద్యమం ఆరంభం నుండి నగారాలా మోగిన వాడు. తెలంగాణ కోసం ఒక సెంట్రీలాగ పనిచేశాడు. తానే ఒక సైరన్ అయి మోగాడు. తెలంగాణ ప్రయో జనాలకు పరిరక్షకుడిగా నిలబడ్డాడు. ముచ్చర్ల జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. కానీ అన్ని మలుపుల్లో కూడా తెలంగాణానే శాసించాడు. ఒక రాష్ట్రం కోసం దాని ఏర్పాటు నుండి సాధించిన దశ వరకు జీవించిన వ్యక్తి మరొకరు లేరు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఎందుకోగాని ముచ్చర్ల పక్కనే ఉండిపోయాడు. ఎంతో గుర్తింపు పొందాల్సిన వాడు చాలా మందిలాగే సైడ్‌లైన్ కాబడ్డాడు. అలాంటివాడికి ఒక విగ్రహం కూడా లేకపోవడం వింతే. ఒక రాష్ట్రం కోసం ఒక వ్యక్తి జీవితాన్ని ధారపోసి కనుమరుగయ్యాడు. అలా కావాలనే కనుమరుగు చేశారని అతని మిత్రులు అంటారు. ఏమైనా ముచ్చర్ల రాష్ట్రం కోసం చేసిన కృషి చరిత్ర పుటల నుండి బయటపడక తప్పదు. మలి పోరా టంలో కనిపించీ కనబడని వాళ్ళకే అందలాలు, తాయిలాలు, అందుతున్న కాలంలో చరిత్రకే ముచ్చెమటలు పోయించిన ముచ్చర్లల చరిత్ర రేపటి అవసరం. వలపోతల మధ్య చరిత్ర మరో మహోజ్వల ఉద్యమాన్ని కలగంటున్న వేళ అది అవసరం. జయధీర్ తిరుమలరావు వ్యాసకర్త కవి, పరిశోధకులు మొబైల్: 99519 42242 (ముచ్చర్ల సత్యనారాయణ ఐదో వర్ధంతి సందర్భంగా నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సంస్మరణ సభ) -
ముచ్చర్లలో ‘ఫార్మా’ సరికాదు
డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఇబ్రహీంపట్నం: ముచ్చర్లలో ఫార్మా పరిశ్రమ నెలకొల్పడం వల్ల ఇక్కడి ప్రశాంతమైన పర్యావరణానికి పెనుప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉందని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. సీరిస్ పరిశ్రమ నెలకొల్పడం మూలంగా రంగారెడ్డి జిల్లాలోని జీటిమెట్ల, సరూర్‌నగర్ మండలాల్లో ఇప్పటికే వాతావరణ కాలుష్యం ఏర్పడిందని, ఎంతో మంది ప్రజలు ఫ్లోరైడ్‌బారిన పడి అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించే సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ రంగాలను నెలకొల్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీపై ఎక్కడా మాట్లాడని ముఖ్యమంత్రి.. పరిశ్రమల ఏర్పాటు ప్రకటనలు, పర్యటనలతో నిరుద్యోగ యువతను భ్రమల్లోకి నెడుతున్నారన్నారు. ఎంతోమంది యువకుల బలిదానాలకు చలించి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, విద్యార్ధుల బలిదానాలను, మేధావుల పోరాటాలను అపహాస్యం చేస్తూ సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజావ్యతిరేక పాలనపై ప్రజలు విసుగెత్తి పోతున్నారని, గతంలో కొనసాగిన కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నారని వెల్లడించారు.