సీతాకోకచిలుక హీరోయిన్ అరుణ గుర్తున్నారా? ఈ ఒక్క సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్‌డమ్ సంపాదించుకున్న అరుణ ప్రస్తుతం ఎక్కడుంది? ఇప్పుడేం చేస్తుంది అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అందం, అభినయం కలబోసిన అచ్చతెలుగు అమ్మాయి ముచ్చర్ల అరుణ. తొలి సినిమాతోనే ప్రముఖ దర్శకుడు భారతీరాజా సినిమాలో చాన్స్ కొట్టేసింది. 1981లో ఆయన తెరకెక్కించిన సీతాకోకచిలుక అప్పట్లో ఓ సంచలనం. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఓవర్‌నైట్ స్టార్డడమ్ సంపాదించుకుంది అరుణ.
ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారామె. చటంబ్బాయి, స్వర్ణకమలం, సంసారం ఒక చదరంగం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి హిట్ సినిమాల్లో నటించిన మెప్పించింది. ఫ్యామిలీ హీరోయిన్‌గా స్థానం సంపాదించిన అరుణ కేవలం 10 సంవత్సరాల్లోనే 70కి పైగా సినిమాల్లో నటించి సత్తాచాటింది.
అయితే హీరోయిన్‌గా దూసుకుపోతున్న సమయంలోనే బిజినెస్‌మ్యాన్ మోహన్‌గుప్తను పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. వీరికి నలుగురు సంతానం. ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయిన ముచ్చర్ల అరుణ రీసెంట్‌గానే ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసింది. ఇందులో వంటలు, హెల్తీ లైఫ్, వర్కవుట్స్ వంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకుంటుంది. అలనాటి అందాల తార మళ్లీ ఇన్నాళ్లకు టచ్‌లోకి రావడంతోనే ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్‌గానే ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చిన అరుణకు ప్రస్తుతం ఒక లక్షా 69వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment