Swarna Kamalam
-
ఆ విధానం తప్పని ఈ సినిమాతో చెప్పారు విశ్వనాథ్, ఈ చిత్రమేదంటే
నిజమైన కళ అంటే.. కనులకు, చెవులకు ఆనందాన్నిచ్చేది కాదు. మనుసును ఆహ్లాదపరిచేది. అలాంటి కళతో జనాలను రంజింపజేసిన కళాకారుడు చరితార్థుడువుతాడు. కె. విశ్వనాథ్ ఆ కోవకు చెందిన వారే. పాశ్చాత్య పోకడల పెను తుఫాను తాకిడికి రెప రెపలాడుతున్న భారతీయ కళాజ్యోతిని తన సినిమాలతో ప్రజ్వలింపజేసిన మహోన్నతుడు కె. విశ్వనాథ్. ఆయన సృజించిన ప్రతి చిత్రం.. నటరాజ పాదపద్మాలను స్మృశించిన స్వర్ణకమలమే. ఆయన కెరీర్లో వచ్చిన మరపురాని చిత్రాల్లో స్వర్ణకమలం ఒకటి. ఈ సినిమా పాతికేళ్ల సందర్భంగా గతంలో కె విశ్వనాథ్ ఓ చానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మూవీ విశేషాలతో పాటు పాశ్యాత్య పోకడలకు నేటితరం చూపిస్తున్న ఆసక్తిపై ఆయన స్పందించారు. మరి ‘స్వర్ణకమలం’ మూవీ ఎలా పుట్టింది, ఈ చిత్రం గురించి ఆయన ఏమన్నారో మరోసారి గుర్తు చేసుకుందామా! కళ దైవదత్తం. జన్మ జన్మల పుణ్యం వల్లే అది ప్రాప్థిస్తుంది. ఆ నిజాన్ని గ్రహించలేదని వేదాంతం వారి అమ్మాయి కథ ఇది. ‘సమాజం జెట్ వేగంతో వెళుతోంది. దాంతో పాటే మనమూ వెళ్లాలి. అంతేకాని సంప్రదాయ కళలనే శ్వాసిస్తూ అదే మోక్షంగా భావిస్తూ కూపస్త మండూకాల్లా బతకడం ఎంత వరకు సమంజసం’ అని వాదిస్తుందీ పాత్ర. పాతికేళ్ల క్రితం విశ్వనాథ్ సృష్టించిన ఈ మీనాక్షి పాత్ర.. నాటి అమ్మాయిలకే కాదు.. నేటి అమ్మాయిలకు రేపటి అమ్మాయిలకు అద్దమే. ఆ పాత్రలో భానుప్రియ ఒదిగిన తీరు అనితరసాధ్యం. చిత్తశుద్దీ ఏకాగ్రత తోడైతే.. ఏ కళైనా అజరామరం అవుతుందని ఆ పాత్ర తెలుసుకోవడమే స్వర్ణకమలం. ఇప్పటికీ ‘స్వర్ణకమలం’ చిత్రాన్ని స్మరించుకుంటున్నారంటే కారణం? ‘సంప్రదాయ కళలపై ఇష్టంతో జనహృదయాలపై వాటిని ఉన్నతంగా నిలపాలనే ఉన్నతమైన ధ్యేయంతో సినిమాలు తీశాను. వాటిల్లో ఒకటే స్వర్ణకమలం. సంప్రదాయ కళలపై వృత్తి విద్యలపై ప్రస్తుతం యువతరానికి నమ్మకం పోయింది. మనది కానిది వాటిపైనే వారు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విధానం తప్పని ఈ సినిమాలో చెప్పాను. ఇళయరాజా సింగీతం, సిరివెన్నెల సాహిత్యం ఈ చిత్రానికి రెండు కళ్లు. ఇందులో భానుప్రియ నటనకు నాట్యాలకు మంచి పేరొచ్చింది. చివరి పాట తప్ప అనిన పాటలకు శేషు, ముక్కురాజు కొరియోగ్రఫి ఇచ్చారు. చివరి పాట అందెల రవమిది పదములదా పాటలకు మాత్రం సుప్రసిద్ద హిందీ కొరియోగ్రాఫర్ గోపీకృష్ణ చేశారు’ అని ఆయన చెప్పుకొచ్చారు. రెండున్నర గంటల పాటు సాగే ఈ సినిమాలో ఒక్క నాట్యం గురించే కాదు. మన సంస్కృతి సంప్రదాయం భక్తి, ప్రేమ, తిరుగుబాటు.. ఇలా ఎన్నో అంశాలను స్మృశించారు కె. విశ్వనాథ్. హృదయాలను బరువెక్కించే భావోద్వేగం, ఆహ్లాదపరిచే హాస్యం ఈ ఆసినిమాకు అలంకారాలు. వెంకటేశ్. భానుప్రియ సాక్షి రంగరావు, శ్రీలక్ష్మి, షణ్ముఖ శ్రీనివాస్, కేఎస్టీ సాయి.. ఇలా ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు జీవం పోశారు. -
సీతాకోకచిలుక హీరోయిన్ అరుణ ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తుంది?
సీతాకోకచిలుక హీరోయిన్ అరుణ గుర్తున్నారా? ఈ ఒక్క సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్డమ్ సంపాదించుకున్న అరుణ ప్రస్తుతం ఎక్కడుంది? ఇప్పుడేం చేస్తుంది అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అందం, అభినయం కలబోసిన అచ్చతెలుగు అమ్మాయి ముచ్చర్ల అరుణ. తొలి సినిమాతోనే ప్రముఖ దర్శకుడు భారతీరాజా సినిమాలో చాన్స్ కొట్టేసింది. 1981లో ఆయన తెరకెక్కించిన సీతాకోకచిలుక అప్పట్లో ఓ సంచలనం. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఓవర్‌నైట్ స్టార్డడమ్ సంపాదించుకుంది అరుణ. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారామె. చటంబ్బాయి, స్వర్ణకమలం, సంసారం ఒక చదరంగం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి హిట్ సినిమాల్లో నటించిన మెప్పించింది. ఫ్యామిలీ హీరోయిన్గా స్థానం సంపాదించిన అరుణ కేవలం 10 సంవత్సరాల్లోనే 70కి పైగా సినిమాల్లో నటించి సత్తాచాటింది. అయితే హీరోయిన్గా దూసుకుపోతున్న సమయంలోనే బిజినెస్‌మ్యాన్ మోహన్గుప్తను పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. వీరికి నలుగురు సంతానం. ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయిన ముచ్చర్ల అరుణ రీసెంట్‌గానే ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసింది. ఇందులో వంటలు, హెల్తీ లైఫ్, వర్కవుట్స్ వంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకుంటుంది. అలనాటి అందాల తార మళ్లీ ఇన్నాళ్లకు టచ్‌లోకి రావడంతోనే ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్‌గానే ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చిన అరుణకు ప్రస్తుతం ఒక లక్షా 69వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. View this post on Instagram A post shared by Aruna Gupta (@mucherla.aruna) View this post on Instagram A post shared by Aruna Gupta (@mucherla.aruna) -
ఆ సాంగ్ వింటుంటే స్వర్ణకమలం గుర్తొచ్చింది– వెంకటేశ్
డ్యాన్సర్ సంధ్యారాణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ ఈ చిత్రానికి దర్శకుడు. నిశ్రింకళ ఫిల్మ్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘పోనీ పోనీ..’ పాటను విడుదల చేసిన వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘డ్యాన్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు వచ్చి చాలా రోజులైంది.‘పోనీ పోనీ...’ పాటను చూస్తుంటే విలక్షణ కథకు ఎమోషన్స్ కలగలిపినట్లుంది. నాకు నా ‘స్వర్ణకమలం’ సినిమా గుర్తొచ్చింది. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు. (చదవండి: డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ నటుడు) ‘‘స్వర్ణ కమలం’ సినిమాను చాలాసార్లు చూశాను. ఎమోషనల్‌గా సాగే ‘పోనీ పోనీ..’ పాటను వెంకటేశ్‌గారు లాంచ్ చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు సంధ్యారాణి. ‘‘మా సినిమాకు ‘స్వర్ణకమలం’ ఓ స్ఫూర్తి’’ అన్నారు రేవంత్. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్. -
‘పెద్దింటి’కి సినీ స్వర్ణ కమలం అవార్డు
సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ కథకుడు, సినీరచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌కు సినీ స్వర్ణ కమలం అవార్డు లభించింది. సినిమా రంగంలో ప్రతిభావంతులకు ఇచ్చే ఈ అవార్డును ఉత్తమ రచయిత విభాగంలో 2020 సంవత్సరానికిగాను పెద్దింటి అశోక్‌కుమార్‌కు ఇస్తున్నట్లు అవార్డు కమిటీ సభ్యులు సీవీఎల్ నరసింహరావు ప్రకటించారు. కథకుడిగా తెలంగాణ భాష, యాసలపై పట్టుకున్న ‘పెద్దింటి’ పది సినిమాలకు మాటల రచయితగా పనిచేశారు. ఆయన మాటలు, పాటలు రాసిన ‘మల్లేశం’ సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రస్తుతం అశోక్‌కుమార్ ముగ్గురు ప్రముఖ అగ్రహీరోల సినిమాలకు మాటల రచయితగా పనిచేస్తున్నారు. జిల్లాలోని గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటకు చెందిన అశోక్‌కుమార్ రాసిన జిగిరి నవల ఆధారంగా హాలీవుడ్ హంగులతో సిని మాగా రూపొందుతుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ప్రస్తుతం సిరిసిల్లలో స్థిరపడిన అశోక్‌కుమార్‌కు సినీ స్వర్ణకమలం అవార్డు రావడంపై పలువురు ఆయన్ని అభినందించారు. -
వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి
పదం పలికింది – పాట నిలిచింది సినిమాలో ఒక పాత్ర వ్యక్తిత్వాన్ని పాటలో పట్టుకోవడం, అదీ కవితాత్మకంగా మలవగలగడం గీతరచయితకు ఒక సవాలు. దాన్ని విజయవంతంగా ‘స్వర్ణకమలం’ కోసం ఛేదించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. భానుప్రియ పోషించిన మీనాక్షి పాత్ర స్వభావాన్నీ, ఆమె జీవితంలో వచ్చిన పరిణామాలనూ ప్రకృతికి అన్వయిస్తూ ‘కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకి/ మెత్తగా రేకు విచ్చెనా కొమ్మచాటునున్న కన్నె మల్లికి’ పాట రాశారు. ఇందులోని ఈ పాదాలు మరింత శ్రేష్ఠమైనవి: ‘వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి ఎదురులేక ఎదిగింది మధుర గానకేళి’ ‘కొండదారి మార్చింది కొంటెవాగు జోరు కులుకులెన్నో నేర్చింది కలికి ఏటినీరు’. దీనికి సంగీతం ఇళయరాజా. పాడినవారు ఎస్.జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. 1988లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు కె.విశ్వనాథ్. వెంకటేష్ నాయకుడు. -
అందెల రవమిది...
‘స్వర్ణకమలం’ సినిమాలో ‘అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా’ పాటతత్వం గురించి గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తన భావాలను ఇలా పంచుకున్నారు.... భగవంతుడు ప్రతి ప్రాణికీ ఏదో ఒక కళ ప్రసాదిస్తాడు. అది గ్రహించి ఆనందం పొందగలిగితే అదే పరమానందం. అప్పుడు ఆ కళ ద్వారా జనం కూడా ఆనందిస్తారు. అయాచితంగా వచ్చిన విద్యను చులకనగా భావించకూడదని పెద్దలు చెబుతారు. ఇందులో కథానాయిక తనకు తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన నాట్యాన్ని తక్కువగా చూస్తుంది. ఏదో ఒక హోటల్లో టిప్‌టాప్‌గా డ్రెస్ చేసుకుని, అందరికీ సర్వ్ చేస్తూ ఉండాలనుకుంటుంది. నాట్యంలో ఎత్తుకు ఎదగాలనుకోదు. అటువంటి మనస్సు కలిగిన ఆ అమ్మాయి ఒకసారి, తన తండ్రి ఫొటోకి దండ వేసి నాట్యం చేస్తున్న శిష్యుడిని చూస్తుంది. మనసు నాట్యం వైపుకు మళ్లుతుంది. ‘‘నీ నాట్యంలో ఆత్మ లేదు, ఎవరి కోసమో పని చేస్తుంటే ఆనందం, తృప్తి ప్రయోజనం ఏవీ ఉండవు. నీ కోసం నువ్వు చేయాలి...’’ అనే మాటలు మనసులో మెదలుతాయి. ‘నాట్యం దైవీయమైన విభూతి. నాట్యం చేయడమంటే శరీరాన్ని ఊపడం, కళ్లు కదపడం, పెదవుల ధ్వనులు... కాదు. మనసు లగ్నం చేసి నర్తించాలి. అప్పుడు నీ హృదయస్పందన నీకు తెలుస్తుంది’ అని సాటి నృత్యకారిణి అన్న మాటలు ఆమె మనస్సును తట్టి లేపుతాయి. ఆమె వెంటనే ఎవ్వరూ లేని మైదాన ప్రదేశంలో తనను తాను మరచిపోయి పరవశంతో నర్తిస్తుంది. ప్రకృతితో మమేకమై నాట్యం చేస్తుంది. అమ్మ చేసే నాట్యాన్ని లాస్యం, శివుడు చేసే నాట్యం తాండవం అంటారు. విశ్వమంతా ఆయన తాండవంలా ఉంటుంది. నాట్యం చేయడానికి కొంత సరంజామా కావాలి. ఎందరికో లభించని విద్య ఆమెకు వరంగా భగవంతుడు ప్రసాదించాడు. ఏ పనినీ తక్కువగా చూడకూడదు. ముఖే ముఖే సరస్వతి. స్వాత్మానందం కోసం నాట్యం చేయాలనేది ఈ పాటలో వివరించాను. ఈ పాటలో కథక్, ఒడిస్సీ, మణిపురి, కూచిపూడి... అన్ని నాట్యరీతులూ కనిపిస్తాయి. – సంభాషణ: డా. పురాణపండ వైజయంతి -
25 వసంతాల స్వర్ణకమలం