హైదరాబాద్ : నల్లొండలో మంగళవారం ఓ కిరాతకుడు నిప్పంటించటంతో తీవ్రంగా గాయపడ్డ బీటెక్ విద్యార్థిని అరుణ ఆరోగ్యం విషమంగా ఉంది. ఆమెకు మెరుగైన నిమిత్తం నిన్న కంచన్బాగ్లోని డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రిలో చేర్చారు. దాదాపు 90 శాతం గాయపడిన అరుణను తొలుత ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
అయితే మరింత మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో అపోలోకి తీసుకువచ్చారు. అరుణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సమీ తెలిపారు. ఆమెను జిల్లా జాయింట్ కలెక్టర్ నీలకంఠం, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట్రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి పరామర్శించారు.