మహిళలు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి | womens are face the problems with courage | Sakshi
Sakshi News home page

మహిళలు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి

Published Wed, Aug 20 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM

మహిళలు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి

మహిళలు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి

నేషనల్ పోలీస్ అకాడమీ డెరైక్టర్ అరుణ బహుగుణ

హైదరాబాద్: మహిళలు సమస్యలకు వెరవకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని నేషనల్ పోలీస్ అకాడమీ డెరైక్టర్ అరుణ బహుగుణ అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో మూడురోజులుగా జరుగుతున్న 12వ ఉమెన్ వరల్డ్ కాంగ్రెస్‌లో అరుణ బహుగుణ మంగళవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు విద్యావంతులైతే దేశం అభివృద్ధిపథంలో దూసుకుపోతుందన్నారు. ఉత్తమ మానవవనరులని తయారు చేసేది మహిళలేనని కొనియాడారు. రక్షణ, పోలీసు వ్యస్థల్లో మహిళలు మగాళ్లకు దీటుగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. కాగా, ఈ సదస్సులో 58 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఆయా దేశాల్లో మహిళల స్థితిగతులపై ప్రసంగించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement