వేధింపులతో మహిళ బలవన్మరణం
Published Thu, Jan 21 2016 11:54 AM | Last Updated on Wed, Sep 26 2018 6:15 PM
తాడిమర్రి: లైంగిక వేధింపుల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం దాడితోట గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల కథనం... గ్రామానికి చెందిన ఎన్. అరుణ(30) భర్త నాగరాజు రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో ఆమె అత్త, ఇద్దరు పిల్లలతో కలసి గ్రామంలో ఉంటోంది.
కాగా, ఇటీవల ఆమెకు గ్రామానికి చెందిన కొందరి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే గురువారం వేకువజామున ఇంటి పక్కనే అంగడి ప్రాంతంలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Advertisement