
అరుణమ్మ(ఫైల్)
కడప కార్పొరేషన్ : రైల్వేకోడూరు నియోజకవర్గం టీ కమ్మలపల్లెకు చెందిన పంట అరుణమ్మ కువైట్‌లో మృతి చెందిందని వైఎస్సార్‌సీపీ గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలాయాస్, కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి తెలిపారు. జీవనోపాధి కోసం కువైట్ వచ్చిన రమణమ్మ చలికి తట్టుకోలేక ఎలక్ట్రానిక్ హీటర్ వేసుకోవడంతో ఊపిరి ఆడక ఈనెల 3న చనిపోయిందన్నారు. ఆమె మృతదేహాన్ని స్వస్థలం పంపించేందుకు అంబేడ్కర్ సేవా సమితి ద్వారా ఇమ్మిగ్రేషన్, భారత రాయబార కార్యాలయంలో పనులన్ని పూర్తి చేసి ఎయిర్ ఇండియా ప్లైట్‌లో ఈనెల 26న పంపించారు. చెన్నై నుంచి టీ కమ్మపల్లె వరకు రాజంపేట మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి ఉచితంగా అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అరుణమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ కువైట్ కమిటీ నాయకులు నివాళి అర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment