
సాక్షి, కడప : తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ స్వాతి ఉదంతం మరవక ముందే కడపలోనూ అదే తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. ఈ దారుణ సంఘటన వైఎస్‌ఆర్ జిల్లా పుల్లంపేట మండలం చవనవారిపల్లెలో చోటుచేసుకుంది. ఆలస్యంగా ఈ వెలుగులోకి వచ్చింది. స్థానికంగా నివసించే శివ, అరుణ దంపతులకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. వివాహానికి ముందే సాయి సుభాష్ అనే వ్యక్తితో అరుణకు ప్రేమ వ్యవహారం ఉంది.
పెళ్లైన తర్వాత కూడా అది కొనసాగుతుండటంతో వద్దంటూ పలుమార్లు శివ వారించాడు. దీంతో భర్త అడ్డు తొలగించుకునేందుకు అరుణ ప్రియుడితో కలిసి హత్యకు పథకం వేసింది. సుభాష్ తన ఇద్దరు మిత్రులతో కలిసి పార్టీ పేరుతో భార్యభర్తలిద్దరిని తోటకు తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగించి విచక్షణా రహితంగా శివను కత్తులతో పొడిచి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని పుల్లంపేట మండలం అన్నసముద్రం అటవీప్రాంతంలో పడేశారు. శివ కనిపించకపోవడంతో మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అరుణ, సాయిసుభాష్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనలో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
వైఎస్సార్ జిల్లాలో మరో స్వాతి కథ
Comments
Please login to add a commentAdd a comment