wife kills husband
-
వ్యభిచారం చేసైనా డబ్బులు తెమ్మన్నాడు..
లంగర్‌హౌస్: వ్యభిచారం చేసైనా సరే మద్యం తాగేందుకు డబ్బులు తేవాలని వేధిస్తున్నందునే స్వయంగా భార్యే భర్తను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 7న జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ రఘుకుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వనపర్తి జిల్లా, పెద్దమందడి గ్రామానికి చెందిన ముక్తార్ అహ్మద్, నసీంబేగం దంపతులకు కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మూడేళ్ల క్రితం ముక్తార్ లంగర్‌హౌస్ డ్రీమ్ కాలనీలో నిరి్మస్తున్న భవనానికి వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. పేకాటతో పాటు తాగుడుకు బానిసైనన ముక్తార్ తరచూ భార్యను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. ఈ నెల 7న సాయంత్రం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన ముక్తార్ తనకు ఇంకా మద్యం కావాలని అందుకు డబ్బులు కావాలని భార్యను వేధిచాడు. తన వద్ద డబ్బులు లేవని చెప్పడా వ్యభిచారం చేసైనా డబ్బులు తేవాలని రోడ్డుపైకి తోసేశాడు. దీంతో తలకు గాయమైన నసీంబేగం భర్తను అంతమొందించాలని నిర్ణయించుకుంది. షేక్‌పేట్ కల్లు కంపౌండ్‌కు వెళ్లి కల్లు తాగి వచి్చన ఆమె భవనంలో నిద్రిస్తున్న ముక్తార్‌పై బండరాళ్లతో దాడి చేసింది. అనంతరం అక్కడి నుంచి లంగర్‌హౌస్‌లోని దర్గాకు వెళ్లి దాక్కుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నసీం బేగంను అదుపులోకి తీసుకోగా తానే హత్య చేసినట్లు తెలిపింది. నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
మేనకోడలిపై మోహంతో భార్యపై వేధింపులు.. చివరికి ఏమైందంటే?
లక్నో: యూపీలోని బుడౌన్ బుడౌన్‌లో ఓ మహిళా దారుణానికి ఒడిగటింది. తాగొచ్చి తన మేనకోడలిని లొంగదీసుకునే ప్రయత్నిస్తూ తనని తరచూ వేదిస్తున్నందుకు అతడి భార్య మిథ్లేశ్ దేవి(40) భర్త గొంతు కోసి చంపేసింది. కేసు దర్యాప్తు చేసిన యూపీ పోలీసులు చాకచక్యంగా అసలు నిజాన్ని రాబట్టారు. బుడౌన్‌లో ఆట వస్తువులను తయారు చేసే తేజేంద్ర సింగ్(43) ఆగస్టు 14న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బిల్సి పట్టణంలోని తన ఇంటి ప్రాంగణంలో నిద్రిస్తున్న తేజేంద్ర సింగ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసిన కుటుంబ సభ్యులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొదటి నుంచి తేజేంద్ర సింగ్ భార్య తడబడుతూ ఒకదానితో ఒకటి పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో అనుమానమొచ్చిందని తర్వాత ఆమెను విడిగా విచారణ చేయగా హత్య తానే చేసినట్లు అంగీకరించిందని తెలిపారు. తన మేనకోడలిని లొంగదీసుకోవడానికి తేజేంద్ర ప్రయత్నించేవాడని తనని ఒప్పించమని తరచూ వేధించేవాడని భర్త వేధింపుల నుండి విముక్తి పొందాలని ఎప్పటినుంచో అవకాశం కోసం ఎదురు చూస్తుండగా ఓ రోజు అతడు బాగా మద్యం సేవించి రావడంతో నిద్రిస్తున్న సమయంలో కొడవలితో గొంతు కోసి చంపినట్లు మిథ్లేశ్ దేవి నేరాన్ని అంగీకరించిందని వివరించారు బుడౌన్ ఎస్పీ ఓపీ సింగ్. ఇది కూడా చదవండి: HYD: మద్యం మత్తులో సీఐ కారు బీభత్సం.. -
ఆశాజ్యోతి దారుణ హత్య.. అనుమానమే ప్రాణం తీసిందా?
తాళ్లపూడి: కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యను కర్కశంగా కత్తితో నరికి చంపి ముగ్గురు పిల్లలను అనాథలను చేశాడు. అంగన్వాడీ హెల్పర్ హత్య పశ్చిమ గోదావరి జిల్లాలోని కుకునూరులో సంచలనమైంది. భార్యపై అనుమానంతో మెడపై కత్తితో నరికిన నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తాళ్లపూడి ఎస్సై కె.వెంకటరమణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాళ్లపూడి పరిధిలోని కుకునూరు అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న ఆటపాకల ఆశాజ్యోతి(30) తన ముగ్గురు పిల్లలతో నివాసం ఉంటోంది. భర్త ఆటపాకల వీర వెంకట సత్యనారాయణతో విభేదాలు రావడంతో కొంతకాలంగా దూరంగా ఉంటోంది. ఇటీవల మళ్లీ పిల్లల కోసమని వచ్చి భార్యా పిల్లలతో కలసి ఉంటున్నాడు. సోమవారం ఉదయం పిల్లలు స్కూలుకు వెళ్లే సమయంలో భార్య ఆశాజ్యోతితో గొడవ పడి కత్తితో ఆమె మెడపై, గొంతుపై నరికి హత్యచేశాడు. తీవ్ర రక్త స్రావం అయి రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుని ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తన కుమార్తెపై అనుమానంతో అల్లుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని మృతురాలి తండ్రి పెద్దాడ నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కె.వెంకటరమణ కేసు నమోదు చేశారు. కొవ్వూరు రూరల్ సీఐ కేవీ రమణ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కొవ్వూరు డీఎస్పీ సత్యనారాయణవర్మ ఆధ్వర్యంలో ఘటనా ప్రదేశంలో వివరాలను సేకరించారు. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పిల్లలు కన్నీరుమున్నీరు ఆశాజ్యోతి దంపతులకు ముగ్గురు పిల్లలు. ప్రభుత్వ పాఠశాలలో సురేంద్ర 8వ తరగతి, తేజ 5వ తరగతి, గోపి దుర్గ నాలుగో తరగతి చదువుతున్నారు. తల్లి మృతితో వీరు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ ఆలనా పాలనా చూసే తల్లి తమ కళ్ల ముందే మృత్యు వాత పడడంతో వారు జీరి్ణంచుకోలేకపోతున్నారు. వీరి పరిస్థితి చూసి పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని అంగన్వాడీ వర్కర్లు ఆశాజ్యోతి మృతదేహానికి నివాళులు అరి్పంచారు. -
వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని..
కౌడిపల్లి(నర్సాపూర్): మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించిన వ్యక్తి అనుమానాస్పద మృతి మిస్టరీ వీడింది. పోలీసులు మూడురోజులలోనే మిస్టరీని ఛేదించారు. కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి మంగళవారం నర్సాపూర్ సీఐ షేక్ లాల్మదార్, ఎస్ఐ శివప్రసాద్‌రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. కౌడిపల్లి మండలం పీర్లతండా పంచాయతీ కొయ్యగుండ తండాకు చెందిన కాట్రోత్ శ్రీను (28) భార్య దేవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీను ఈనెల 18న రాత్రి పొలానికి వెళ్తున్నాని భార్యకు చెప్పి వెళ్లి ఉదయం శవమై కనిపించాడు. భార్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద పోలీసులు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. స్నేహితురాలు, మరో వ్యక్తి సాయం.. మృతుడి భార్య దేవికి తండాలో పలువురితో అక్రమ సంబంధం ఉంది. ఈ విషయంలో పలుమార్లు భార్యాభర్తలకు గొడవలు జరిగాయి. దీంతో దేవి తన భర్తను చంపాలని నిర్ణయించుకుంది. తండాకు చెందిన ఆమె స్నేహితురాలు రాణి (ఆలియాస్ నవీన)తో కలిసి పథకం వేసింది. దీని కోసం కొడుకు వరుసయ్యే పవన్‌కుమార్‌ను సాయం తీసుకుంది. సహకరిస్తే రైతుబీమా డబ్బులు రాగానే రూ.50 వేలు ఇస్తానని ఆశపెట్టింది. చెట్టుకు ఉరేసి... ఈనెల 18వ తేదీ ఉదయం దేవి, శ్రీను తమ ఇంటి వద్ద జామ చెట్టు విషయంలో పాలివారు కాట్రోత్ ధన్సింగ్, అతడి కుమార్‌లు సంతోష్, తులసీరాం గొడవ పడ్డారు. ఇదే అదునుగా భావించిన దేవి అదే రోజు రాత్రి పవన్‌కుమార్‌కు మద్యం ఇప్పించి శ్రీనుకు తాగించాలని చెప్పింది. ఇద్దరూ కలిసి పొలంలో మద్యం తాగారు. రాత్రి దేవి అక్కడికి చేరుకొని మత్తులో ఉన్న శ్రీనును వేప చెట్టుకు ఉరివేశారు. మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి పొలంలో పడేశారు. భర్త చనిపోయాడని పాలివారే చంపేశారని దేవి ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దేవి ప్రవర్తనపై అనుమానం రావడంతో మృతుడి కాల్‌డేటా చెక్ చేశారు. దాని ఆధారంగా విచారణ చేపట్టారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య, చంపేస్తే రైతుబీమా, ఎల్ఐసీ డబ్బులు వస్తాయన్న ఆశతో హత్యచేసినట్లు ఒప్పుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు శాంతి, శోభారాణి, భాగయ్య, శ్రీనివాసులు, పోచయ్యను డీఎస్పీ అభినందించి నగదు రివార్డ్ అందజేశారు. -
బావతో వివాహేతర సంబంధం.. దుబాయ్ నుంచి భర్త రావడంతో..
కరీంనగర్: కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాస్(30)ను అతని భార్యే తన ప్రియుడితో కలిసి చంపిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం కొడిమ్యాల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగిత్యాల డీఎస్పీ ఆర్.ప్రకాశ్, మల్యాల సీఐ డి.రమణమూర్తి, ఎస్సై కె.వెంకట్రావ్ వెల్లడించారు. దేశాయిపేటకు చెందిన వేముల ప్రమీలకు కొడిమ్యాలవాసి బత్తుల శ్రీనుతో పదేల్ల క్రితం వివాహం జరిగింది. వీరికి సంతానం కలగలేదు. ఉపాధి నిమిత్తం శ్రీను కొన్నేళ్లు దుబాయ్ వెళ్లాడు. ఈ క్రమంలో తనకు బావ వరుస అయిన దేశాయిపేటకు చెందిన సూర రాజేశ్‌తో ప్రమీల అక్రమ సంబంధం పెట్టుకుంది. శ్రీను దుబాయ్ నుంచి వచ్చాక కూడా దీన్ని కొనసాగించింది. ప్రమీల తన ప్రియుడితో సన్నిహితంగా ఉన్న సమయంలో భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఈ విషయమై పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. శ్రీను మద్యానికి బానిసయ్యాడు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న అతన్ని హత్య చేయాలని ప్రమీల, రాజేశ్‌తోపాటు ప్రమీల తల్లిదండ్రులు రాజవ్వ, రాజనర్సు పథకం వేశారు. దీర్ఘకాలిక వ్యాధికి రాజవ్వ వాడుతున్న ట్యాబ్లెట్లను ప్రమీల పొడిగా చేసింది. ఈ నెల 11న శ్రీను తాగే మద్యంలో కలిపింది. అపస్మారకస్థితిలోకి వెళ్లిన అతన్ని ప్రమీల, రాజేశ్‌లు టవల్‌తో గొంతు బిగించి, చంపారు. అనంతరం మృతదేహా న్ని చీరతో దూలానికి ఉరివేసి, పారిపోయారు. మృతుడి సోదరుడు రవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. శ్రీనును చంపింది అతని భార్య, ఆమె ప్రియుడు, తల్లిదండ్రులేనని తేల్చారు. ఆదివారం ఆ నలుగురిని అ రెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు. హత్యకు ఉపయోగించిన టవల్, ట్యాబ్లెట్ షీట్లతోపాటు, బైక్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. -
ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్..
పలమనేరు/పెద్దపంజాణి(చిత్తూరు జిల్లా): కట్టుకున్న భార్యే తనభర్తకు విలనైంది. ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్‌వేసి తెలివిగా అంతమొందించింది. ఆపై ఏమీ తెలియనట్టు బంగారు నగల కోసం దొంగలు హత్య చేశారంటూ డ్రామా ఆడింది. నియోజకవర్గంలోని పెద్ద పంజాణి మండలం, తుర్లపల్లి సమీపంలో సోమవారం రాత్రి దామోదర్(25) దారుణ హత్యకుగురైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. చదవండి: పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి.. చివరికి వేరే అమ్మాయితో.. పెద్దపంజాణి మండలం, పెనుగొలకలకు చెందిన చంద్రమోహన్ కుమార్తె అనురాధ, పుంగనూరు మండలం, బత్తలాపురానికి చెందిన రెడ్డెప్ప కుమారుడు దామోదర్‌తో ఏడాది క్రితం వివాహం జరిగింది. అత్తారింట్లో నోముల పండగకు దంపతులు వచ్చి స్వగ్రామానికి బైక్‌పై భార్యాభర్తలు తిరుగు ప్రయాణంలో దామోదర్‌ను కత్తులతో పొడిచి చంపారు. అయితే కళ్లలో కారంపొడి కొట్టి దొంగలు నగల కోసమే హత్య చేశారంటూ మృతుని భార్య అనురాధ పోలీసులకు తెలిపింది. అందరూ నిజమేననుకున్నారు. అయితే ఆమె తండ్రి గ్రామంలో పాల సెంటర్‌ను నిర్వహించేవాడు. అక్కడికి పాలను తీసుకెళ్లేందుకు పెద్దపంజాణి మండలం, తిరుమలకొండయ్యగారిపల్లికి చెందిన గంగరాజు(25) పాల ఆటో డ్రైవర్‌గా వచ్చేవాడని తెలిసింది. అప్పటి నుంచే అనురాధ, గంగరాజు మధ్య చనువుందని సమాచారం. వీరికి భర్త అడ్డుగా ఉండడంతో పక్కా స్కెచ్‌తో ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. అనురాధ ఇచ్చిన సమాచారంతోనే గంగరాజు దారిమధ్యలో వేచి ఉండి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. ఇప్పటికే పోలీసులు మృతిని భార్య అనురాధ, పాల ఆటో డ్రైవర్ గంగరాజును అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడిందని సమాచారం. కేసులో పూర్తి వివరాలు తెలిశాక నిందితులను నేడో, రేపో పోలీసులు అరెస్ట్ చూపనున్నట్టు తెలిసింది. -
నిత్యం తాగొచ్చి వేధింపులు.. అత్తకు వివాహేతర సంబంధంపై రచ్చ.. పక్కా ప్లాన్‌తో!
ఖమ్మంఅర్బన్: మద్యం సేవించి నిత్యం వేధిస్తున్నాడని భావించి.. తన భర్త కాళ్లు, చేతులను కట్టి సాగర్ కాల్వలో పడేసిన భార్య ఉదంతమిది. శనివారం భార్య ఖమ్మంఅర్బన్ పోలీసుల వద్ద లొంగిపోగా మరికొందరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన వివరాలను ఆదివారం ఖమ్మం నగర ఏసీపీ ఆంజనేయులు, ఖమ్మం అర్బన్ సీఐ రామకృష్ణ వెల్లడించారు. ఖమ్మం నగరం యూపీహెచ్ కాలనీలో నివాసముంటున్న ఎస్కే అన్వర్ (33) కొంతకాలంగా కనిపించడం లేదని అతడి తల్లి ఎస్కే రహమత్ ఈ ఏడాది జూలైలో ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సీఐ రామకృష్ణ నేతృత్వంలో అన్వర్ ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణలో భాగంగా అనుమానితులైన భార్య సల్మా, అత్త సాధుఖాన్, బాలాజీపై నిఘా పెట్టి వారి కదలికలను గమనిస్తున్నారు. భార్య సల్మా సొంతగ్రామమైన మహబూబాబాద్‌లో ఉంటోందని తెలిసి అక్కడి పోలీసుల సాయంతో పట్టుకోవడం కోసం తిరిగినా ఫలితం లభించలేదు. తర్వాత ఐడీ పార్టీ పోలీసుల ద్వారా నిఘా పెంచారు. ఈ క్రమంలో పోలీసులు ఎలాగైనా పట్టుకుంటారని భయపడి, తప్పించుకునే పరిస్థితి లేదని గ్రహించి ఖమ్మం నగరంలో వారికి తెలిసిన పెద్దమనుషుల సహకారంతో శనివారం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన నిందితులు అన్వర్ భార్య సల్మా, అత్త సాదుఖాన్, బావమరిది యాకూబ్, బాలాజీ, వెంకన్న లొంగిపోయారు. వారిని విచారించగా అన్వర్‌ను తామే హత్య చేశామని అంగీకరించారని ఏసీపీ వెల్లడించారు. ఇదీ హత్యోదంతం.. అన్వర్ వివాహం అయిన నాటి నుంచి చికెన్ దుకాణంలో పనిచేస్తుండేవాడు. మద్యానికి బానిస కావడంతో పాటు గంజాయికి అలవాటు పడి భార్యను అనుమానిస్తున్నాడు. భార్య, ఇద్దరు ఆడపిల్లలను పట్టించుకోకుండా అప్పుడప్పుడూ ఇంట్లో నుంచి వెళ్లి రెండు, మూడు నెలల తర్వాత తనంతట తానుగా ఇంటికి వచ్చేవాడు. భార్యను చిత్రహింసలకు గురి చేసి కొట్టేవాడు. ఇదిలా ఉండగా అన్వర్ అత్త సాదుఖాన్ కూడా వీరి వద్దనే ఉంటూ సుతారి పనులకు వెళ్తోంది. ఆమెకు కొంతకాలంగా చింతకాని మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన బాలాజీతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది నచ్చని అన్వర్ గతేడాది యూపీహెచ్‌కాలనీలో బాలాజీ బైక్‌ను తగలబెట్టడంతోపాటు బాలాజీని కత్తితో బెదిరించాడు. దీనిపై ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. దీంతో అన్వర్‌ను చంపాలని భార్య సల్మా, అత్త కలిసి నిర్ణయించారు. గతేడాది సెప్టెంబర్ 30వ తేదీన రాత్రి అన్వర్ చేతులు, కాళ్లు కట్టి అన్వర్ బావమరిది యాకూబ్ ఆటోలో బాలాజీ, చిర్రా వెంకన్న కలిసి తీసుకెళ్లి గోపాలపురం సమీపంలోని సాగర్ కాల్వలో పడేశారు. అప్పటి నుంచి వారంతా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేయడంతో వారంతా భయపడి పోలీసుల ఎదుట లొంగిపోయారు. అన్వర్ భార్య సల్మా, అత్త సాదుఖాన్, యాకూబ్, బాలాజీ, చిర్రా వెంకన్నను రిమాండ్‌కు తరలించామని ఏసీపీ వివరించారు. అన్వర్ మృతదేహం ఆచూకీ కనుగొంటామని ఆయన పేర్కొన్నారు. -
కంపెనీలో అతడితో పరిచయం.. ప్రియుడి కోసం ఏం చేసిందంటే?
యశవంతపుర: ప్రియుని కోసం భర్తలను చంపే సంఘటనలు కర్నాటకలో పెరుగుతున్నాయి. ఒక టీవీ సీరియల్ ప్రేరణతో వివాహిత తన భర్తను పరలోకానికి పంపిన వైనం మండ్య జిల్లా మళవళ్లి తాలూకాలో జరిగింది. మళవళ్లి ఎన్ఇఎస్ లేఔట్లో నివాసం ఉంటున్న శశికుమార్ (30)ని భార్య నాగమణి (28), ప్రియుడు హేమంత్ (25)లు కలిసి ఆదివారం రాత్రి హత్య చేశారు. గార్మెంట్స్‌లో పరిచయమై కనకపురలో గార్మెంట్స్‌కు వెళ్తున్న నాగమణికి హేమంత్ పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి భర్త ఆమెను పలుసార్లు మందలించాడు. మొబైల్‌ఫోన్‌ను లాక్కుని పనికి వెళ్లవద్దని కట్టడి చేయడంతో ఆమె భగ్గుమంది. భర్తను తప్పిస్తే ఏ అడ్డూ ఉండదని నాగమణి నిశ్చయించుకుంది. టీవీలో వచ్చే కన్నడ సీరియల్ శాంతం పాపం చూస్తూ అందులో మాదిరిగానే హత్యకు పథకం వేసింది. ప్రియునితో కలిసి హత్య ఆదివారం రాత్రి ప్రియుడు హేమంత్‌ని పిలిపించుకుంది. నిద్రిస్తున్న పిల్లల చేతులు, కాళ్లు కట్టేసి నోటిలో బట్టలు కుక్కారు. తరువాత మద్యం మత్తులో నిద్రిస్తున్న శశికుమార్‌ను చున్నీతో గొంతు బిగించి హత్య చేశారు. ఎవరో దుండగులు చొరబడి చంపేశారని నాగమణి ఏడుపు అందుకుంది. కొడుకు మృతిపై అనుమానంతో తల్లి తాయమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా సోమవారం నుంచి అరెస్టు చేసి విచారించగా నేరం ఒప్పుకుంది. జంటను రిమాండ్‌కు తరలించారు. ఆమె ఇద్దరు పిల్లలూ అనాథల్లా మారారు. -
ఒకరేమో ఏడు ముక్కలు చేయిస్తే.. మరొకరు ప్రియుడి చేతికి తుపాకీ అందించి..
2021 నవంబర్.. ప్రియుడి మోజులో పడి అగ్నిసాక్షిగా తాళి కట్టించుకున్న భర్తను ఏడు ముక్కలు చేయించింది జ్యోతినగర్ ప్రాంతానికి చెందిన హేమలత. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని అక్కసుతో అతిగా మద్యం తాగించి ఆపరేషన్ చేసే సీజర్‌తో ప్రియుడితో ఏడు ముక్కలు చేయించి పలు ప్రాంతాల్లో పడేయించింది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇష్టపడి సొంత మేన మరదలిని పెళ్లి చేసుకున్నాడు సింగరేణి కార్మికుడు కోరుకొప్పుల రాజేందర్. ఇద్దరు పిల్లలు సంతానం. అయినా ప్రేమికుడి మోజులో పడిన ఆయన భార్య రవళి.. తాళికట్టిన రాజేందర్‌ను ఈనెల 20న పిస్తోల్‌తో కాల్పులు జరిపించి చంపించింది. ఈ సంఘటన ఈ ప్రాంతంలో సంచలనం రేపింది. గోదావరిఖని(పెద్దపల్లి): అర్థేచ.. కార్యేచ.. నాతి చరామి అంటూ చేతిలోచేయి వేసి జీవితాంతం తోడుంటామని బాస చేసిన కొందరు కట్టుకున్న భర్తను మట్టుబెట్టుతున్నారు. వివాహేతర సంబంధం మోజులో పడి తాళి కట్టిన వారిని కడతేర్చుతున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇలాంటి సంఘటనల రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధాల ముందు తాళికట్టిన బంధాలు పలుచనైపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచమంతా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం ఇస్తుంటే ఇక్కడ మాత్రం పాశ్చాత్య సంస్కృతివైపు పయనం పెరిగి పోతోంది. సింగరేణి కార్మిక క్షేత్రంలో ఇలాంటి సంఘటనలు ఏదో మూల జరుగుతూనే ఉన్నాయి. శనివారం హత్యకు గురైన కోరకొప్పుల రాజేందర్‌ను పెళ్లిచేసుకున్న రవళి ఇద్దరు పిల్లలకు తల్లి. భర్త, పిల్లలతో కలిసి హాయిగా కాపురం చేయాల్సిన సమయంలో పెళ్లికి ముందునుంచే ప్రేమికుడితో చెట్టపట్టాలేసుకుని తిరిగి పచ్చని కాపురంలో చిచ్చుపెట్టుకుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేరే ప్రాంతం నుంచి వచ్చిన ప్రేమికుడితో కలిసి తన భర్తను చంపించేందుకు సహకరించిందని అంటున్నారు. తాళి కట్టించుకుని ఏడడుగులు నడిచిన భార్య ప్రియుడితో కలిసి పెళ్లి చేసుకున్న ఏడేళ్లకు చంపించడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. గతేడాది నవంబర్లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. ఎన్టీపీసీ టీటీఎస్‌లో అగ్నిసాక్షిగా తాళికట్టించుకున్న భర్తను ప్రియుడితో కలిసి ఏడుముక్కలు చేయించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎవరికీ అనుమానం రాకుండా భర్తను చంపించిన భార్య.. అతడి శరీరభాగాలను ఏడు వేర్వేరు ప్రాంతాల్లో పడవేయించింది. ఇలాంటి ఘటనలతో స్థానికులు భయపడుతున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు విలువనిస్తూ అగ్నిసాక్షిగా తాళికట్టిన బంధాలను బలోపేతం చేసేలా స మాజం నడుం బిగించాలంటున్నారు. పోలీసుశాఖ కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య
నల్లగొండ క్రైం : సఖ్యతకు అడ్డొస్తున్నాడని ఓ మహిళ ఘాతుకానికి తెగబడింది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా కడతేర్చింది. ఈ ఘటన నీలగిరి మున్సిపాలిటీ పరిధి పానగల్లో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పానగల్‌కు చెందిన ఇరగదిండ్ల వెంకన్న (40) బోరు బావుల తవ్వకం పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడి భార్య సుజాత పత్తి కూలి మేస్త్రీగా పనిచేస్తోంది. వీరికి కూతురు, కుమారుడు సంతానం. సుజాత పత్తి కూలీలను తీసుకుపోయే క్రమంలో చెర్వుగట్టుకు చెందిన లింగస్వామితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీయడంతో సుమారు మూడు మాసాల క్రితం ఇద్దరూ ఇళ్లనుంచి పారిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఇద్దరిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి సుజాతను భర్త వెంకన్న వద్దకు పంపించారు. తమ సఖ్యతకు అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయాలని అప్పటినుంచే ఇందిర నిర్ణయించుకుంది. ప్రియుడికి ఫోన్ చేసి.. వెంకన్న శనివారం ఖమ్మం జిల్లాకు వెళ్లి వచ్చాడు. పూటుగా మద్యం తాగి పడుకున్నాడు. ఇదే అదునుగా భావించిన సుజాత భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది. వెంటనే ప్రియుడు లింగస్వామికి ఫోన్ చేసి రప్పించింది. అనంతరం ఇద్దరూ కలిసి మద్యం మత్తులో ఉన్న వెంకన్నను దిండుతో అదిమిపట్టి, గొంతునులిమి హత్య చేశారు. మద్యం మత్తులో చనిపోయాడని.. వెంకన్న హత్య చేసిన తర్వాత లింగస్వామి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తదనంతరం సుజాత తన భర్త మద్యం మత్తులో చనిపోయాడని చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. పోలీసులకు తానే ఫోన్ చేసి భర్త మద్యం తాగి కిందపడ్డాడని, ఆ క్రమంలోనే సొరగుంచి చనిపోయాడని వివరించింది. భర్త తరఫు వారు తానే హత్య చేసినట్లు బెదిరిస్తున్నారని వాపోయింది. అయితే, సుజాత, లింగస్వామి వివాహేతర సంబంధం పెట్టుకుని గతంలో ఇంటినుంచి పారిపోయారని, పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా ఉందని వెంకన్న తండ్రి పోలీసులకు వివరించాడు. అనుమానంతో పోలీసులు సుజాతను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. హత్యోదంతం విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐ చంద్రశేఖర్‌రెడ్డి ఘటన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హతుడి తండ్రి భిక్షమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్సై రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. గతంలోనూ పలుమార్లు హత్యకు కుట్ర సుజాత, లింగస్వామి కలిసి గతంలోనూ వెంకన్నను హత్య చేయాలని కుట్ర చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ నెల 24న వెంకన్న బైక్‌పై జనగామ జిల్లాకు వెళ్తుండగా లింగస్వామి తన స్నేహితులతో కలిసి కారుతో ఢీకొట్టి హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, అది సాధ్యపడలేదని తేలింది. మరోమారు ఈ నెల 28న సుజాత భర్త తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపి పెట్టింది. అది తిన్న వెంకన్నకు ఏమీ కాలేదని పోలీసుల విచారణలో సుజాత ఒప్పుకున్నట్లు తెలిసింది. -
వివాహేతర సంబంధమే కారణమా? భర్త మెడకు చున్నీ బిగించి..
సాక్షి, కామారెడ్డి(నిజామాబాద్): నిద్రిస్తున్న భర్త మెడకు చున్నీ బిగించి హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అజాంపుర కాలనీలో మంగళవారం వెలుగు చూసింది. తాగి వచ్చి వేధిస్తుండడంతో తానే చంపేశానని భార్య చెబుతుండగా, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే చంపేసిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. అజాంపుర కాలనీలో నివాసముండే అఫ్రోజ్ ఖాన్ (37)కు భార్య ఫర్జానా బేగం, కుమారుడు ఉన్నారు. ఫర్జానా మొదటి భర్తను వదిలేసి, అఫ్రోజ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. అఫ్రోజ్ ఖాన్ గతంలో ఆటో నడిపే వాడు. కొద్ది రోజుల నుంచి అల్లం, వెల్లుల్లి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, రోజూ మద్యం సేవించి వచ్చి భార్యను వేధిస్తున్నట్లు తెలిసింది. విసిగి పోయిన ఫర్జానా సోమవారం అర్ధరాత్రి సమయంలో భర్త మెడకు చున్నీ బిగించి హత్య చేసింది. సమాచారమందుకున్న పోలీసులు మృతదేహాన్ని మంగళవారం పోస్టుమార్టం కోసం తరలించారు. ఘటన స్థలాన్ని డీఎస్పీ సోమనాథం, ఎస్‌హెచ్‌వో మధుసూదన్ పరిశీలించారు. రోజు మద్యం సేవించి తనను వేధించడంతోనే హత్యకు పాల్పడినట్లు ఫర్జానా చెబుతోంది. అయి తే, వివాహేతర సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడనే కారణంతోనే హత్చ చేసినట్లు అఫ్రోజ్ బంధువులు ఆరోపిస్తున్నారు. భార్య ఒక్కరే హత్యకు పాల్పడిందా? లేక ఎవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతానికి హత్య కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని డీఎస్పీ సోమనాథం తెలిపారు. చదవండి: యువతి ఫొటోలతో న్యూడ్ ఫొటోలు అప్లోడ్ చేస్తానంటూ.. -
పక్కా ప్లాన్.. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను..
సాక్షి, కొందుర్గు(రంగారెడ్డి): వివాహేతర సంబంధం మోజులో పడి ఓ మహిళ కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి గొంతు నులిమి చంపేసింది. మొదట అనారోగ్యంతో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారు. కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు తమదైన శైలిలో విచారించి నిందితులిద్దరిని కటకటాల వెనక్కి పంపించారు. కొందుర్గు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా పొదిలి మండలం మర్రిపాడు గ్రామానికి చెందిన రూతమ్మ, వేణు దంపతులు. రూతమ్మకు గతంలో పొరుగు గ్రామానికి చెందిన శ్రీనుతో వివాహేతర సంబంధం ఉండేది. విషయం తెలుసుకున్న ఆమె భర్త వేణు భార్యాపిల్లలను తీసుకొని కొందుర్గుకు వలస వచ్చాడు. ఓ ఇల్లు అద్దెకు తీసుకొని స్థానికంగా కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న శ్రీనును ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం వేసిన రూతమ్మ తన ప్రియుడితో కలిసి గతనెల 29 రాత్రి వేణు గొంతు నులిమి చంపేసింది. ఈ విషయం బయటకు పొక్కకుండా తన భర్త అనారోగ్యంతో మృతిచెందిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో వేణు గొంతు నులిమి వేసినట్లుగా గాయాలు కనిపించాయి. గమనించిన కుటుంబసభ్యులు ఈనెల 1న కొందుర్గు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాద్‌నగర్ రూరల్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో కేసు విచారణ చేపట్టారు. పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. అనుమానంతో రూతమ్మను అదుపులోకి తీసుకొని విచారించగా తన ప్రియుడు శ్రీను కలిసి వేణును హత్యచేసినట్లుగా నేరం అంగీకరించింది. ఈమేరకు మంగళవారం నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
పరాయి పురుషుల వద్దకు వెళ్లాలని బలవంతం చేస్తున్నాడు!
సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): రెండవ భార్య చేతిలో రియల్టర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పలార్‌స్వామి అలియాస్ స్వామిరాజ్ (50)ను బ్యూటీషీయన్ కమ్ రెండవ భార్య అయిన నేత్ర హత్య చేసినట్లు కేసు నమోదైంది. ఆరేళ్ల కిందట పెళ్లి వివరాలు.. పలార్‌స్వామికి ఇదివరకే పెళ్లయింది. బెంగళూరు ఉత్తర తాలూకాలో లేఔట్లు వేసి కోట్ల రూపాయలు ఆర్జించాడు. 6 ఏళ్ల కిందట బ్యూటీపార్లర్ నడుపుతున్న నేత్రతో వివాహేతర సంబంధం ఏర్పడి తరువాత పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు హారో క్యాతనహళ్లి వద్ద రూ.6 కోట్లు ఖర్చుపెట్టి పెద్ద బంగ్లా నిర్మించి ఇచ్చాడు. ఆదివారం రాత్రి పలార్‌స్వామిని రాడ్‌తో కొట్టి హత్యచేసిన నేత్ర మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయింది. భర్త తనను పరాయి పురుషుల వద్దకు వెళ్లాలని బలవంతం చేసేవాడని, అందుకే హత్య చేసానని పోలీసులకు తెలిపింది. అయితే తమను, పిల్లలను బాగా చూసుకుంటున్నాడనే కోపంతో హత్య చేసిందని మొదటి భార్య ఆరోపిస్తోంది. కేసు విచారణలో ఉంది. -
భర్త ఆత్మహత్య చేసుకున్నాడని లబోదిబోమంది.. తీరా చూస్తే..?
వీరులపాడు(అమరావతి): వేధింపులకు గురిజేస్తున్న భర్తను భార్య కడతేర్చిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని జుజ్జూరు గ్రామంలో ఈ నెల ఐదో తేదీన షేక్ బాజీ అనే వ్యక్తిని తన భార్య ఖాసింబీ హత్య చేసింది. మరుసటి రోజు ఉదయం తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మేంచేందుకు ప్రయత్నించింది. మృతుడి తమ్ముడు ఖాశీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో విచారించారు. ఈ మేరకు కేసు వివరాలను డీఎస్పీ నాగేశ్వరరెడ్డి బుధవారం వెల్లడించారు. పూటుగా మద్యం తాగి వచ్చిన బాజీని తన భార్య ఖాసీంబి మెడకు చున్నీ బిగించి ఉరేసిందని తెలిపారు. నిత్యం మద్యం తాగి వచ్చి తనతో పాటు పిల్లలను తీవ్రంగా కొడుతూ తన భర్త హింస పెట్టేవాడని ఖాసింబి తెలిపింది. ఈ వేధింపులు తట్టుకోలేకనే హత్య చేశానని పేర్కొంది. ఖాశింబిని సీఐ నాగేంద్రకుమార్ అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకుందని చెప్పారు. ఖాసీంబి, బాజీకి ఇద్దరు కుమార్తెలున్నారు. తండ్రి మృతి చెందగా తల్లి హత్య కేసులో జైలుకు వెళ్లటంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇద్దరు పదేళ్ల లోపు వయసు చిన్నారులు కావటంతో తల్లి కోసం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎస్ఐ సోమేశ్వరరావు పాల్గొన్నారు. -
పిట్టల్లా కాల్చేసిన గ్యాంగ్‌స్టర్
-
పిట్టల్లా కాల్చేసిన గ్యాంగ్‌స్టర్: రెండు ప్రాణాలు బలి
న్యూఢిల్లీ: పెరోల్ మీద విడుదల అయిన ఓ రౌడీ షీటర్ కాల్పులకు పాల్పడ్డాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే తన భార్యతో పాటు మరొకరిని దారుణంగా తుపాకీతో కాల్చి హత్య చేశాడు.ఈ ఘటనలో ఓ నిండు గర్భిణి, యువకుడు మృతి చెందాడు. ఈ దారుణ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని దక్షిణ నిజాముద్దీన్ ప్రాంతానికి చెందిన డ్రగ్ డీలర్ షరాఫత్ షేక జైలుకు వెళ్లాడు. మూడు రోజుల కిందట పెరోల్‌పై విడుదల అయ్యాడు. వచ్చి రాగానే తన భార్య ఎక్కడుందో ఆచూకీ తెలుసుకుని ఆమె దగ్గరకు వెళ్లాడు ఈ క్రమంలో మంగళవారం భార్య ఉంటున్న ఇంటికి వెళ్లాడు షెరాఫత్. బయట కూర్చున్న భార్య షైనాతో కొద్దిసేపు మాట్లాడి ఆ వెంటనే తనతో తెచ్చుకున్న తుపాకీతో మొదట కాల్చాడు. అయితే పక్కన ఉన్న ఆమె సహాయకుడు వెంటనే షఫత్‌ను నిలువరించే ప్రయత్నం చేశాడు. దీంతో షఫత్ అతడిపై కూడా కాల్పులు జరిపాడు. అనంతరం భార్యపై మళ్లీ నాలుగు, ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆమె చనిపోయేదాక తుపాకీతో పేలుస్తూనే ఉన్నాడు. అడ్డుకోబోయిన వారిని తుపాకీతో బెదిరించాడు. తుపాకీ తూటాలకు బలయిన భార్య షైనా నిండు గర్భిణి. ఇంత కర్కషంగా.. విచక్షణా రహితంగా గర్భిణి అయిన తన భార్యను హతమార్చడం కలకలం రేపింది. అయితే కాపాడేందుకు వచ్చిన వారంతా ప్రాణభయంతో వెనక్కి తిరిగారు. వారిద్దరినీ కాల్చిన అనంతరం దర్జాగా అతడు వెళ్లిపోయాడు. ఇదంతా ఆ ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమరాలో రికార్డయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: మే 2 తర్వాతనే కరోనాపై కేంద్రం కఠిన నిర్ణయం? చదవండి: ‘బరాత్’లో పీపీఈ కిట్‌తో చిందేసిన అంబులెన్స్ డ్రైవర్ -
భర్తను కత్తితో హతమార్చిన భార్య, కుమారుడు
సాక్షి, మునుగోడు: భార్య, భర్తల నడుమ ఘర్షణ ఓ ప్రాణం తీసింది. ఈ సంఘటన మండలం పరిధిలోని కస్తాల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. 10వ తేదీన గ్రామంలో ముత్యాలమ్మ పండుగ జరిగింది. గ్రామానికి చెందిన యోహోవా(41) భార్య యాదమ్మ, కుమారుడు మనోజ్, తల్లి లక్ష్మమ్మ కలిసి పండుగ జరుపుకున్నారు. అదే రోజు రాత్రి అత్త లక్ష్మమ్మతో కోడలు యాదమ్మ ఘర్షణకు దిగింది. ఘర్షణ తీవ్ర స్థాయికి చేరడంతో లక్ష్మమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాత్రి పొద్దుపోయిన తర్వాత మద్యం మత్తులో ఇంటికి చేరిన భర్త యోహోవా అమ్మ కనిపించడం లేదని భార్యను ప్రశ్నించడంతో మొదలైన గొడవ తీవ్రస్థాయికి చేరింది. మద్యం మత్తులో ఉన్న భర్తపై భార్య, కుమారుడు కలిసి కత్తితో దాడి చేశారు. దీంతో యోహోవా సృహ కోల్పోయాడు. తల్లి, కుమారుడు రాత్రి ఇంట్లోనే పడుకున్నారు. సోమవారం ఉదయాన్నే లక్ష్మమ్మ పెద్ద మనుషులతో ఇంటికి వచ్చింది. రాత్రి జరిగిన విషయంపై ఆరా తీస్తూనే, కుమారుడి గురించి అడిగింది. ఇంట్లోకి వెళ్లి చూసే సరికి యోహోవా అపస్మారక స్థితిలో ఉన్నాడు. దీంతో వెంటనే చికిత్స నిమిత్తం నల్లగొండకు అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. పరిస్థితి విషమించి గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. స్టేషన్ ఎదుట ఆందోళన.. ఆదివారం జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిగా పట్టించుకోలేదని ఆరోపిస్తూ మృతుని బంధువులు మృతదేహాన్ని స్టేషన్ ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. యోహోను భార్యపై ఎందుకు కేసు నమోదు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఎస్పీ వస్తేనే ఆందోళన విరమిస్తామని సీఐ సురేష్‌కుమార్‌తో వాదనకు దిగారు. నిందితులకు శిక్షపడేలా చూస్తామని సీ ఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. శిక్షపడేలా చర్యలు : సీఐ సురేష్ కుమార్ యోహోవా మృతికి సంబంధించిన సంఘటనపై విచారణ చేసి, దోషులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీఐ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన ఇంట్లో ఏం జరిగిందో.. వివరాలు సేకరించే పనిలో ఉన్నాం. ఆందోళన చెందనవసరం లేదు. నిందితులను త్వరలో కోర్టుకు రిమాండ్ చేస్తాం. -
కష్టాలు భరించలేక భర్తను కడతేర్చిన భార్య
గంగవరం (తూర్పు గోదావరి) : మద్యం తాగి భార్యాబిడ్డలను వేధిస్తున్న భర్త హత్యకు గురైన సంఘటన గంగవరంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటన గురువారం సాయంత్రం జరగగా శుక్రవారం పోలీసులకు సమాచారం అందింది. సంఘటన వివరాలను రంపచోడవరం ఏఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ స్థానిక విలేకర్లకు శుక్రవారం సాయంత్రం వివరించారు. పాత గంగవరం గ్రామానికి చెందిన కంగల కృష్ణమూర్తి దొర (40)అనే వ్యక్తి రోజూ మద్యం సేవించి భార్యబిడ్డలను హింసిస్తున్నాడన్నారు. గురువారం సాయంత్రం ఐదుగంటల సమయంలో బాగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన కృష్ణమూర్తిదొర భార్య పిల్లలతో ఘర్షణకు దిగాడన్నారు. మద్యం మత్తులో ఉన్న కృష్ణమూర్తిదొర భార్య వరలక్ష్మి మధ్య తీవ్ర ఘర్షణకు దిగడంతో తోపులాట జరిగిందన్నారు. ఈ సమయంలో కృష్ణమూర్తిదొర మెడలో ఉన్న తువాళ్లను భార్య గట్టిగా తిప్పేయడంతో ఊపిరాడక కృష్ణమూర్తి మృతి చెందినట్టు ఏఎస్పీ వివరించారు. ప్రాథమిక సమాచారం మేరకు హత్య కేసుగా నమోదు చేశామని ఏఎస్పీ వివరించారు. హత్యా స్థలాన్ని ఏఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్, సీఐ గౌరీశంకర్ పరిశీలించి విచారణ చేశారు. అడ్డతీగల సీఐ గౌరీశంకర్ మాట్లాడుతూ గంగవరం వీఆర్వో ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేశామన్నారు. ఈ కేసును రంపచోడవరం ఏఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అడ్డతీగల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు సీఐ వివరించారు. ఈ సంఘటనతో కృష్ణమూర్తి దొర ఇద్దరు బిడ్డలు అనాథలుగా మిగిలారు. కంగల అరవింద్ టెన్త్ పాస్ కాగా, కుమార్తె కంగల అనూష 8వ తరగతి అభ్యసిస్తోంది. వీరిద్దరూ రంపచోడవరం గురుకుల పాఠశాలల్లోనే చదువుతున్నారు. ఈ ఘటనపై బంధువులు, గ్రామస్తులు ఎవ్వరూ నోరువిప్పడం లేదు. -
ప్రియురాలికి ఆస్తి రాసిచ్చేస్తాడని భర్తను కడతేర్చింది..
గుర్గావ్ : వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో కట్టుకున్న భర్తనే కిరాయి ముఠాతో కడతేర్చిన ఇల్లాలి ఉదంతం వెలుగుచేసింది. తన భర్త ఓ మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని, మొత్తం ఆస్తి ఆమె పేరున బదిలీ చేస్తాడనే అనుమానంతో కిరాయి హంతకులతో భర్తను హతమార్చానని పోలీసుల ఎదుట ఆమె అంగీకరించారు. ఈనెల 17న అదృశ్యమైన స్వీటీ భర్త జోగీందర్ సింగ్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే సమీపంలోని బజ్గేరా ప్రాంతంలోని కాలువలో గోనెసంచీలో గుర్తించిన మృతదేహం సింగ్‌దేనని పోలీసులు గుర్తించారు. కాలువ వద్ద ఓ మోటార్ సైకిల్‌నూ స్వాధీనం చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణను చేపట్టడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. కాగా, తమ సోదరుడి మృతికి వదినే కారణమని సింగ్ సోదరుడు తెలపడంతో పోలీసులు ఆమెను పలు కోణాల్లో ప్రశ్నించారు. పోలీసుల విచారణలో భర్తను తానే కిరాయి హంతకులతో హత్య చేయించానని స్వీటీ అంగీకరించారు. భర్త తన ఆస్తి మొత్తాన్ని ప్రియురాలికి రాసిస్తాడనే భయంతోనే తాను ఆయనను చంపించినట్టు వెల్లడించారు. హంతకుల ముఠాకు రూ 16 లక్షలతో ఒప్పందం చేసుకుని రూ 2.5 లక్షలను అడ్వాన్స్‌గా ముట్టచెప్పినట్టు ఆమె తెలిపారు. ఇక ముందుగా వేసుకున్న పథకం ప్రకారం జనవరి 16 అర్ధరాత్రి స్వీటీ ఇంటిలోకి ప్రవేశించిన హంతకులు నిద్రిస్తున్న ఆమె భర్తను దారుణంగా హతమార్చి శవాన్ని గోనెసంచీలో కుక్కి కాలువలో పడేశారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో స్వీటీని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారని త్వరలో అందరినీ అదుపులోకి తీసుకుంటామని గుర్గావ్ పోలీస్ అధికార ప్రతినిధి సుభాష్ బొకాన్ తెలిపారు. -
ప్రియుడి సాయంతో భర్త దారుణ హత్య
రాజమహేంద్రవరం క్రైం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఓ మహిళ ప్రియుడితో కలిసి పథకం వేసి హత మార్చింది. ఈ కేసును రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసులు ఛేదించారు. ఆ వివరాలను తూర్పు మండలం డీఎస్పీ యు.రాజారావు శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కడియం మండలం, కడియపు సావరానికి చెందిన గుబ్బల వెంకటరమణ (35)ను కొందరు యువకులు ఈ నెల నాలుగో తేదీన హత్య చేశారు. అతడి మృతదేహాన్ని రాజమహేంద్రవరం రూరల్ మండలం, పిడింగొయ్యిలోని కాదా దుర్గాప్రసాద్‌కు చెందిన తోట సమీపంలోని తుప్పల్లో ఐదో తేదీన బొమ్మూరు పోలీసులు కనుగొన్నారు. అసలేం జరిగిందంటే.. కడియం మండలం, గుబ్బలవారిపాలెంకు చెందిన చీకట్ల సతీష్ గ్రామంలోని ఒక నర్సరీలో గుమస్తాగా పనిచేస్తూ అదే గ్రామానికి చెందిన గుబ్బల వెంకటరమణ భార్య జ్యోతితో ఏడాదిగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జ్యోతి కుటుంబ సభ్యులు ఇద్దరినీ మందలించారు. జ్యోతిని తనతో కలవకుండా కట్టడి చేసిన వెంకటరమణపై కక్ష పెంచుకున్న సతీష్ అతడి హత్యకు పథక రచన చేశాడు. ఆ విషయాన్ని జ్యోతికి చెప్పగా ఆమె కూడా సమ్మతించింది. ఇందుకోసం డబ్బు ఎర చూపి సతీష్ గతంలో తనకు పరిచయం ఉన్న లావేటి నాగదేవి అనే మహిళ సాయాన్ని తీసుకున్నాడు. పథకంలో భాగంగా నాగదేవి కొత్త సిమ్ కార్డుతో వెంకటరమణకు ఈ నెల నాలుగో తేదీన ఫోన్ చేసింది. ‘నువ్వంటే నాకిష్టం. నిన్ను చూడాలని ఉంది. నేను కారు పంపిస్తాను. డ్రైవర్ నేను ఉన్న చోటుకు నిన్ను తీసుకు వస్తాడు’ అంటూ ఫోన్లో వగలు పోయింది. ఆ మాటలు నమ్మిన వెంకటరమణ పిడింగొయ్యి శివార్లలోని నర్సరీ కొబ్బరి తోటలో ఉన్న షెడ్ వద్దకు వచ్చాడు. అప్పటికే సతీష్ రూ. ఐదు వేలిచ్చి పురమాయించి సిద్ధం చేసిన ఎనిమిది మంది వ్యక్తులూ వెంకటరమణ తలపై బీరు సీసాలు, చైన్లు, కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు. వారందరూ అతడిని కొబ్బరి చెట్టుకు కట్టి ఆ రోజు రాత్రి 12.30 గంటల వరకూ కొడుతూనే ఉన్నారు. అనంతరం సతీష్ రేకుల షెడ్లో పదునైన కత్తితో వెంకటరమణ గొంతుపై నరికి హత్య చేశాడు. మృతదేహాన్ని తోట బయట ఉన్న తుప్పల్లో దాచి కత్తిని దూరంగా పడేశాడు. దగ్గరలోనే గోతిని తవ్వి శవాన్ని పూడ్చే ఉద్దేశంతో సతీష్ మరునాడు అక్కడే తచ్చాడ సాగాడు. తోట యజమాని దుర్గాప్రసాద్‌కు సందేహం వచ్చి సతీష్‌ను నిలదీయగా, అతడు జరిగిన విషయమంతా చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. మరో నలుగురు బాల నేరస్తులు ఈ కేసులో నిందితులైన చీకట్ల సతీష్, గంటేటి దుర్గాప్రసాద్, కప్పల రవికుమార్, బడుగు రాజేష్, ఖండవల్లి తరుణ్ అనే ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారే గాకుండా మరో నలుగురు బాల నేరస్తులను రాజానగరం మండలం, కానవరంలో బొమ్మురు సీఐ కె.నాగమోహన్ రెడ్డి అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తి, మూడు సెల్ ఫోన్లు, రెండు బైక్‌లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ రాజారావు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన జ్యోతి, నాగలక్ష్మి పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. -
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
చిత్తూరు అర్బన్: తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు భార్య అంగీకరించింది. తవణంపల్లెలో జరిగిన మొగిలిరెడ్డి (45) హత్య కేసును పోలీసులు ఛేదించారు. అతని భార్య మమత(38), ప్రియుడు వీరభద్రారెడ్డి (45)ని అరెస్టు చేశారు. డీఎస్పీ సుబ్బారావు శనివారం చిత్తూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. గంగాధరనెల్లూరు మండలం వరత్తూరుకు చెందిన మొగిలిరెడ్డికి తవణంపల్లె మండలం మిట్టూరుకు చెందిన మమతతో 20 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరు మిట్టూరులోనే నివసిస్తున్నారు. వీరికి డిగ్రీ కుమార్తె, కొడుకు ఉన్నారు. కొంతకాలంగా మమతకు మిట్టూరుకు చెందిన వీరభద్రారెడ్డి అలియాస్ మిట్టూరబ్బతో వివాహేతర సంబంధం ఉందని భర్త అనుమానించాడు. ఈ విషయమై పలుమార్లు గొడవ కూడా జరిగింది. భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన మమత ప్రియుడు వీరభద్రారెడ్డితో కలిసి పథకం పన్నింది. ఈ క్రమంలో గురువారం రాత్రి పొలంలో ఉన్న ఆవు ఈనుతుందని మొగిలిరెడ్డి అక్కడికెళ్లి పడుకున్నాడు. అర్ధరాత్రి ప్రాంతంలో వీరభద్రారెడ్డి వెదురుకొయ్యతో మొగిలిరెడ్డి తల, శరీరంపై బలంగా కొట్టాడు. అతను చనిపోకపోవడంతో గొంతు నులిమాడు. మొగిలిరెడ్డి కాళ్లను మమత గట్టిగా పట్టుకుంది. తెల్లారేసరికి గుర్తుతెలియని వ్యక్తులు తన భర్తను చంపేశారంటూ గ్రామస్తులను నమ్మించింది. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వారికి జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. పోలీసు జాగిలం మ్యాగీకి సన్మానం ఈ కేసును ఛేదించడంలో ప్రధాన పాత్ర పోషించిన పోలీసు జాగిలం మ్యాగీని అధికారులు ఘనంగా సన్మానించి గోల్డ్ మెడల్ బహూకరించారు. -
భర్తను హత్య చేయించిన భార్య
కడప అర్బన్ : తన భర్త, కుమార్తెతో కలిసి ఆనందంగా జీవితాన్ని గడపాల్సిన భార్య, మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త వివాహేతర సంబంధం మానుకోవాల ని మందలించాడు. తాను విధినిర్వహణకు వెళ్లే సమయంలో భార్యను ఇంటిలో పెట్టి, తాళం వేసి వెళ్లేవాడు. తన భర్త డ్యూటీకి వెళ్లగానే వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని నేరుగా తన ఇంటికే పిలిపించుకునేది. ఈ క్రమంలో సదరు భర్త, సునీల్ కుమార్‌ను చంపుతానని ఊరిలో అక్కడక్కడా చెప్పాడు. అలాగే భార్యను వేధించేవాడు. దీంతో అతని అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. దీంతో వారిద్దరూ పక్కా స్కెచ్ వేసుకున్నారు. తాము అనుకున్న ప్రకారం డ్యూటీకి వెళుతున్న వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని మరోచోటికి తీసుకుని వెళ్లి ప్రమాద సంఘటనగా చిత్రీకరించారు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. భార్య, స్నేహితుడితో పాటు మొత్తం నలుగురు కటకటాల పాలయ్యారు. ఈ సంఘటనపై కడప డీఎస్పీ కార్యాలయంలో శనివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా వెల్లడించారు. జిల్లాలోని ముద్దనూరు మండలం కోసినేపల్లెకు చెందిన కునపులి గంగానాయుడు 2011 నుంచి ఆర్టీపీపీలో కోల్‌ప్లాంట్‌లో మెయింటెనెన్స్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన చందా సునీల్‌కుమార్‌తో గంగానాయుడు భార్య కుళ్లాయమ్మ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ విషయం తెలుసుకున్న కుళ్లాయమ్మ భర్త గంగానాయుడు తన భార్యను మందలించాడు. అంతేగాక తాను డ్యూటీకి వెళ్లే సమయంలో భార్యను ఇంటిలోపెట్టి తాళం వేసుకుని వెళ్లేవాడు. అయినా తన భర్త విధులకు వెళ్లగానే సునీల్ కుమార్‌ను ఇంటికి పిలిపించుకునేది. ఈ క్రమంలోనే వీరిరువురు గంగానాయుడు అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. పథకం పన్నారు. ఇందుకోసం సునీల్‌కుమార్ తన బంధువు వీరభద్రుడు, స్నేహితుడు గంగరాజులకు డబ్బు ఆశ చూపి గంగానాయుడు హత్యకు పక్కా ప్రణాళిక రూపొందించారు. ఈనెల 4న తన భర్త రాత్రి డ్యూటీకి వెళ్లగానే సునీల్‌కుమార్‌కు కుళ్లాయమ్మ ఫోన్ చేసి చెప్పింది. ముందుగా అనుకున్న ప్రకారం గంగానాయుడు డ్యూటీకి వెళ్లే మార్గమధ్యంలో గంగరాజు తోట వద్ద, ముగ్గురు నిందితులు కాపు కాసి అతనిపై దాడి చేసి, నోరు మూసి, రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి ఈడ్చుకునిపోయి దారుణంగా తలకు లుంగీకట్టి కాళ్లతో తన్ని, రాళ్లతో కొట్టి చంపేశారు. మృతదేహాన్ని ఆర్టీపీపీ 600డబ్లు్యప్లాంట్ సమీపాన ఆర్టీపీపీ–సున్నపురాళ్ల పల్లి రోడ్డులో మోటర్‌సైకిల్‌ను, మృతదేహాన్ని పడేసి హతుడి మరణాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. ఈ సంఘటనను కొండాపురం సీఐ చిన్నపెద్దయ్య, ఎర్రగుంట్ల సీఐ కొండారెడ్డి, కలమల్ల ఎస్ఐ చిరంజీవి తమ సిబ్బందితో చాకచక్యంగా విచారించారు. హత్య కేసును ఛేదించి, నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ముద్దనూరు మండలం కొసినేపల్లి గ్రామానికి చెందిన చందా సునీల్‌కుమార్, అతని బంధువు పంజగాళ్ల వీరభద్రుడు, తాటి గంగరాజుతో పాటు హతుడు గంగానాయుడు భార్య కుళ్లాయమ్మను అరెస్ట్ చేశారు. కేసు ఛేదించినందుకు పోలీసులను కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా అభినందించారు. -
మద్యం తాగి వేధిస్తున్నాడని భర్తను చంపింది
-
వీడిన శ్రీశైలం యువకుడి హత్య కేసు మిస్టరీ
పెద్దదోర్నాల: మండల పరిధి ఐనముక్కల సమీపం తీగలేరు కాలువ వద్ద గత నెల 24వ తేదీన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ వాసి నేలటూరి శ్రీనివాసులుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఐదు రోజుల వ్యవధిలోనే మర్డర్ మిస్టరీని ఛేదించారు. హత్యకు పాల్పడిన నిందితుడు శ్రీరాంశెట్టి భాస్కరరావుతో పాటు, హత్యను ప్రోత్సహించిన మృతుడి భార్య నేలటూరి మల్లేశ్వరిని మార్కాపురం డీఎస్పీ రామాంజనేయులు అరెస్టు చేసి వారిని శనివారం విలేకరుల ఎదుట ప్రవేశ పెట్టారు. డీఎస్పీ కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు కాలనీకి చెందిన నేలటూరి శ్రీనివాసులు, శ్రీరాంశెట్టి భాస్కరరావులు సహ వ్యాపారులు. కాలనీలో పండ్లు, పూలు అమ్ముకుంటూ స్నేహంగా ఉండేవారు. మద్యానికి అలవాటు పడిన శ్రీనివాసులు అప్పులపాలై ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఒంటరిగా ఉన్న అతడి భార్య మల్లేశ్వరితో చనువు పెంచుకున్న భాస్కరరావు ఆమెతో సన్నిహితంగా ఉండేవాడు. కాలక్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొన్నాళ్లకు శ్రీనివాసులు తిరిగి ఇంటికి చేరాడు. భార్య వివాహేతర సంబంధంపై అనుమానం వచ్చి ఆమెతో ముభావంగా ఉంటున్నాడు. తమ వివాహేతర సంబంధానికి భవిష్యత్తులో అడ్డం వస్తాడన్న కారణంతో ఎలాగైనా అతడిని మట్టు పెట్టాలని నిర్ణయించుకున్న భాస్కరరావు గత నెల 24వ తేదీన తన సొంత ఆటోలో కొబ్బరి చిప్పలు నింపుకుని శ్రీనివాసులుతో కలిసి పెద్దారవీడు మండలం కుంట చేరుకున్నాడు. వేరే వాహనంలో కొబ్బరి బోండాల లోడుతో తిరుగు ప్రయాణమయ్యారు. దోర్నాల చేరుకున్న భాస్కరరావు అక్కడ ఓ మద్యం షాపులో మద్యాన్ని కొనుగోలు చేసి శ్రీనివాసరావుకు మోతాదుకు మించి తాగించాడు. స్పృహ కోల్పోయిన శ్రీనివాసరావును తన ఆటోలో వేసుకుని ఐనముక్కల వద్ద తీగలేరు కాలువ వద్దకు చేరుకున్నాడు. అక్కడే తువాలుతో గొంతు బిగించి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ఉండేందుకు పెట్రోల్‌తో కాల్చి అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీకి చేరుకున్నాడు. దినపత్రికల్లో వచ్చిన కథనాలు చూసిన మృతుని తండ్రి పెంచలయ్య హత్యకు గురైన వ్యక్తి తన కుమారుడేనని గుర్తించడంతో పోలీసులు దర్యాన్తును వేగవంతం చేశారు. బంధువులు వ్యక్తం చేసిన అనుమానంతో భార్య మల్లేశ్వరి, భాస్కరరావు కదలికలపై నిఘా ఉంచారు. వీరి ఫోన్‌కాల్స్ డేటా పరిశీలించడంతో పాటు, మండల కేంద్రంలోని సీసీ కెమోరాల్లో భాస్కరరావు వాహనం ఎటువైపు ప్రయాణించిందన్న సాక్ష్యాలు సేకరించారు. తమపై అనుమానం ఉందని పసిగట్గిన వీరి ఆటోలో గుంటూరు పారిపోతుండగా కుంట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మార్కాపురం కోర్టులో హాజరు పరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి తక్కువ సమయంలో మిస్టరీని ఛేదించడంలో చరుగ్గా వ్యవహరించిన సీఐలు భీమానాయక్, మల్లికార్జునరావు, ఎస్ఐ రామకోటయ్యతో పాటు సిబ్బందిని అభినందించారు. -
భర్త పీక కోసి చంపేసింది..
నంగునూరు(సిద్దిపేట): దుబాయి నుంచి వచ్చి నెల రోజులు తిరగక ముందే వ్యక్తి దారుణ హత్యకు గురి కావడం నంగునూరు మండలం ఘణపూర్‌లో కలకల సృష్టించింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హత్యకు కారణమని ఆరోపిస్తూ మృతదేహాన్ని అతడి ఇంటి ఎదుట ఉంచి నిరసన తెలపడంతో గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నంగునూరు మండలం ఘణపూర్ గ్రామానికి చెందిన బండి బాలయ్య (40) ఆరేళ్ల క్రితం దుబాయికి వలస వెళ్లాడు. 20 రోజుల క్రితం ఇక్కడకు తిరిగి వచ్చిన బాలయ్య ఆదివారం భార్య నర్సవ్వతో కలిసి వేములవాడకు వెళ్లాడు. సోమవారం తెల్లవారుజామున అక్కడ బాలయ్య దారుణ హత్యకు గురి కావడంతో గ్రామంలో కలకలం చెలరేగింది. భార్య నర్సవ్వ అతడిని హత్య చేయించి పోలీసులకు లొంగిపోయిందని గ్రామంలో ప్రచారం జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ సైదులు, రాజగోపాల్‌పేట, చేర్యాల, బెజ్జంకి మండలాల నుంచి పెద్ద ఎత్తున పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో బందోబస్తు నిర్వహించారు. అనుమానితుడి ఇంటి ఎదుట నిరసన పోస్టుమార్టం అనంతరం బాలయ్య మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చిన బంధువులు అతడి హత్యకు గ్రామాని చెందిన కారెడ్ల వెంకట్‌రెడ్డికి సంబంధం ఉందని ఆరోపించారు. నిందుతుడిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ వెంకట్‌రెడ్డి ఇంటి ఎదుట మృతదేహాన్ని ఉంచి నిరసన తెలిపారు. న్యాయం చేస్తామని పోలీసులు నచ్చ చెప్పినా వినకుండా రాత్రి వరకు నిరసన కొనసాగించారు. కూతుళ్ల భవిష్యత్ అగమ్యగోచరం బాలయ్య, నర్సవ్వ దంపతుల ఇద్దరు కూతుళ్ల భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైంది. తండ్రి హత్యకు గురికావడం, తల్లి పోలీసులకు లొంగిపోవడంతో వారి ఆలనాపాలనా చూసే దిక్కు లేకుండా పోయింది. పెద్ద కూతురు శైలజ ఇంటర్ చదువుతుండగా చిన్న కూతరు అంజలి నాలుగవ తరగతి చదువుతోంది. దైవ దర్శనానికి తాము వస్తామని చెప్పినా తీసుకెళ్లలేదని, నాన్న వెంట వేములవాడకు వెళ్తే బతికేవాడని ఆ కూతుళ్లు బోరున విలపించారు. బాలయ్య మృతి చెందడంతోపాటు నర్సవ్వ పోలీసులకు లొంగిపోవడంతో వారు తల్లిదండ్రులు లేనివారిలా తయారయ్యారు.