ఫోన్ గురించి ప్రశ్నించాడని.. భర్తను చంపేసింది! | husband stabbed to death for questioning on extra marital relation | Sakshi
Sakshi News home page

ఫోన్ గురించి ప్రశ్నించాడని.. భర్తను చంపేసింది!

Published Tue, Sep 27 2016 9:38 AM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

ఫోన్ గురించి ప్రశ్నించాడని.. భర్తను చంపేసింది!

ఫోన్ గురించి ప్రశ్నించాడని.. భర్తను చంపేసింది!

వాళ్లిద్దరికీ పెళ్లయ్యి మహా అయితే ఏడాది అవుతుంది. కానీ ఇద్దరి మధ్య ఎప్పుడూ కీచులాటలే. ఆమె ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకుని ఎవరితోనో మాట్లాడుతూ ఉండేది. దాని గురించి గట్టిగా ప్రశ్నించాడని.. చివరకు భర్తను బెడ్రూంలోనే పొడిచి చంపేసింది. ఈ ఘటన బిహార్‌లోని నలందలో జరిగింది. లహేరి పోలీసు స్టేషన్ పరిధిలో ఉండే సతీష్ - లలితలకు ఏడాది క్రితం పెళ్లయింది. కానీ ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేదని, చాలా కష్టమ్మీద పెళ్లికి ఒప్పించామని ఆమె తండ్రి చెబుతున్నారు.

నిజానికి సతీష్ కూడా లలితను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. ఆమె అక్క సంగీతను పెళ్లాడాలని అనుకున్నాడు. కానీ ఆమె తన బావగారితో కలిసి ఎటో వెళ్లిపోయింది. దాంతో తప్పనిసరిగా లలితను పెళ్లాడాల్సి వచ్చింది. పెళ్లి తర్వాత తన కూతురు అతడితో సుఖంగా లేదని ఆమె తండ్రి చెబుతున్నారు. ఇక ఆమె తరచు ఎవరితోనో ఫోన్లలో మాట్లాడుతుండటాన్ని అతడు గట్టిగా ప్రశ్నించాడు. దాంతో పట్టలేని కోపం వచ్చిన ఆమె.. అతడు పడుకొని ఉండగా మంచం మీదే అతడిని పొడిచేసింది. దాంతో అక్కడికక్కడే రక్తపు మడుగులో మరణించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement