extra marital relation
-
వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి
గద్వాల క్రైం (జోగులాంబ గద్వాల): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన సంఘటన శుక్రవారం గద్వాలలో కలకలం రేపింది. సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. పెబ్బేరు మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన ఎండీ అబ్దుల్ (35) గద్వాల పట్టణానికి చెందిన మహబూబ్‌బీని 12 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరు గద్వాల పట్టణంలోని నల్లకుంట కాలనీలో అద్దె ఇంట్లో ఉంటూ కూరగాయాల వ్యాపారం చేస్తున్నారు. దంపతులకు తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే భార్య అదే కాలనీకి చెందిన రఫీతో కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయంపై వారం రోజుల క్రితం భార్యతో గొడవపడ్డాడు. అయితే తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి గురువారం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ప్రియుడితో కలసి చున్నీతో గొంతుకు బిగించి ఊపిరాడకుండా హత్య చేశారు. ఇక భర్త తరఫు బంధువులకు భార్య ఫోన్ చేసి ఫిట్స్ వచ్చి మృతి చెందాడని చెప్పింది. విషయం తెలుసుకున్న బంధువులు మృతదేహాన్ని పరిశీలించి మహబూబ్‌బీపై అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పట్టణ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. హత్య చేసినట్లు అంగీకరించారు. మృతుడి సోదరుడు మహ్మద్ హాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. భార్యను అదుపులోకి తీసుకున్నామని, ప్రియుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. -
వివాహేతర సంబంధం: రాయితో కొట్టి హత్య
సాక్షి, భూత్పూర్: వ్యక్తిని రాయితో కొట్టి చంపిన సంఘటన శుక్రవారం మున్సిపాలిటీలోని అమిస్తాపూర్ చోటు చేసుకుంది. సీఐ కృషన్ తెలిపిన వివరాల ప్రకారం.. అమిస్తాపూర్ చెందిన మల్లేష్, భార్య, ఇద్దరు పిల్లలతో నివసిస్తుండేవాడు. భార్య అదే గ్రామానికి చెందిన శ్రీహరి(43)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారి సంబంధం బయటకు వస్తుందనే కారణంగా 10ఏళ్ల క్రితం శ్రీహరితో కలిసి గోవాకు వెళ్లారు. ఈ క్రమంలో మల్లేష్ మరో వివాహం చేసుకున్నాడు. శ్రీహరి అమిస్తాపూర్‌కు వారం రోజుల క్రితం వచ్చాడు. శుక్రవారం మల్లేష్‌కు, శ్రీహరి తారసపడటంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తోపులాటలో శ్రీహరి రాయిపై పడటంతో గాయాలయ్యాయి. గమనించిన మల్లేష్ పక్కనే ఉన్న రాయిని తీసుకుని శ్రీహరి తలపై వేయడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మల్లేష్ స్వయంగా భూత్పూర్ పోలీస్టేషన్లో లొంగిపోయాడు. సంఘటన స్థలాన్ని సీఐ, ఎస్ఐ భాస్కర్‌రెడ్డి పరిశీలించారు. మల్లేష్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. -
మాట వినని భార్య.. చివరికి 71 గొర్రెలు తీసుకుని..
లక్నో: మూఢ విశ్వాసాలు, ఆచారాలతో వార్తల్లో నిలిచే ఉత్తరప్రదేశ్‌లో తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి పారిపోయిన భార్యను వదులుకోవడానికి ఓ భర్తకు 71 గొర్రెలు నష్టపరిహారంగా ఇవ్వాలని అక్కడి పంచాయతీ ఒకటి విచిత్రమైన తీర్పునిచ్చింది. యువతి భర్తకు 71 గొర్రెలు ఇవ్వాలంటూ పంచాయతీ పెద్దలు ప్రియుడిని ఆదేశించారు. ఈ ఘటన గోరక్‌పూర్ జిల్లాలో జూలై 22న జరిగింది. అయితే, ఈ తీర్పు నచ్చని ప్రియుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గోరఖ్‌పూర్ జిల్లాలోని చార్ఫాణి గ్రామంలో రాజేష్ పాల్ , సీమా పాల్ (25) భార్యాభర్తలు. అదే గ్రామానికి చెందిన ఉమేష్ (27)తో సీమా వివాహేతర సంబంధం బయటపడటంతో గ్రామ పెద్దల సమక్షంలో గత నెలలో పంచాయతీ జరిగింది. భర్తతో కలిసి జీవించేందుకు సీమా ససేమిరా అంది. ఉమేష్‌తోనే ఉంటానని స్పష్టం చేసింది. దీంతో భర్త రాజేష్ పాల్‌కు నష్ట పరిహారం ఇవ్వాల్సిందిగా ఆమె ప్రియుడు ఉమేష్‌ని పంచాయితీ ఆదేశించింది. అతనికి ఉన్న 142 గొర్రెల్లో సగం ఇవ్వాలని పెద్ద మనుషులు తీర్పునిచ్చారు. దీనికి సీమా భర్త కూడా అంగీకరించడంతో వివాదం అంతటితో ముగిసింది. ఇది జరిగి మూడు వారాలు కావొస్తోంది. అయితే, ఉమేష్ తండ్రి గ్రామ పెద్దల తీర్పుపై అసహనం వ్యక్తం చేశాడు. తన గొర్రెలు తిరిగి ఇప్పించాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గొర్రెలు ఉమేష్ స్వార్జితమే అయితే కేసులో తాము చేసేదేం ఉండదని గోరఖ్‌పూర్ ఎస్ఎస్పీ సునీల్ కుమార్ గుప్తా చెప్పారు. ఇక భార్యభర్తల పంచాయతీలో సీమా భర్త ఎలాంటి ఫిర్యాదు చేయనందున జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. -
దొంగలా వచ్చి.. దొరికేశాడు!
వివాహేతర సంబంధాలు పలు రకాలుగా ఉంటాయి. కానీ పుణెలో జరిగిన ఘటన మాత్రం అన్నింటికంటే విచిత్రమైనది. శుక్రవారపేటలో నివాసం ఉంటున్న ఓ జంట ఇంటికి భార్య ప్రియుడు రహస్యంగా వచ్చాడు. అది కూడా ఎవరూ తనను గుర్తుపట్టకుండా మహిళలు ధరించే నైటీ వేసుకుని, ముఖం మీద స్కార్ఫు కట్టుకుని మరీ వచ్చాడు. ఆ సమయానికి మహిళ భర్త నిద్రిస్తుండటంతో.. అతడిని పూర్తి నిద్రలోకి పంపేందుకు ముఖం మీద క్లోరోఫాం చల్లిన గుడ్డ పెట్టాలనుకున్నాడు. కానీ.. సరిగ్గా అదే ప్రయత్నంలో ఉండగా ఆ భర్తకు దొరికిపోయాడు. తీరా అతడి ముసుగు తీసి చూస్తే, గతంలో తన స్నేహితులలో ఒకడే! నిందితుడు రాజేష్ ఘుసులాల్ మెహతా (44) రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పనిచేస్తాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి ప్రేయసి భర్త స్టీలు పాత్రల వ్యాపారం చేస్తుంటాడు. అతడికి ఇద్దరు పిల్లలున్నారు. అతడితో మెహతాకు వ్యాపారపరంగా స్నేహం కుదరడంతో తరచు ఇంటికి వచ్చి వెళ్లేవాడు. బహుశా ఇంతకుముందు కూడా పలు సందర్భాల్లో ఇలాగే మత్తుమందు వాసన చూపించి భర్తను మత్తులోకి పంపి తన పని కానించుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తాను లేనప్పుడు మెహతా తన ఇంటికి వచ్చి వెళ్తున్న విషయాన్ని సెక్యూరిటీ గార్డు తనకు చెప్పాడని, దాంతో ఏడేళ్లుగా వాళ్లిద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం గురించి ఇటీవలే తనకు తెలిసిందని ఆ భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో మెహతాను ఇక తన ఇంటివైపు చూడొద్దని హెచ్చరించానన్నారు. అయినా ఆగని మెహతా, ఇలాగే అమ్మాయి వేషంలో వచ్చిపోయేవాడు. అయితే తాజాగా అతడు చేసిన ఇలాంటి ప్రయత్నం విఫలమైంది. ఉన్నట్టుండి ముక్కుదగ్గర పాత వస్త్రం తాలూకు కంపు రావడంతో ఆ భర్తకు మెలకువ వచ్చింది. దాంతో నిందితుడు పట్టుబడ్డాడు. నిందితుడిపై సెక్షన్ 452, 323, 504, 506ల కింద కేసు నమోదు చేశారు. -
వివాహేతర సంబంధం ఉందని..జుట్టు కత్తిరింపు
పశ్చిమ బెంగాల్లో దారుణం చోటుచేసుకుంది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలతో ఒక మహిళ జుట్టును ఆమె భర్త చేత పంచాయతీ పెద్దలు కత్తిరింపజేశారు. ఈ ఘటన ముర్షీదాబాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అప్పటికే పెళ్లయిన ఓ మహిళకు వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దానిపై కులపెద్దలు పంచాయతీ పెట్టారు. అందులో ఆమె తప్పు చేసిందని తేల్చి.. అందుకు పరిహారంగా రూ. 6 వేలు జరిమానా చెల్లించాలని తీర్పు చెప్పారు. అయితే, ఆమె ఆ మొత్తాన్ని చెల్లించలేకపోయింది. దాంతో ఆమె భర్తను పిలిచి, అతడితోనే బలవంతంగా ఆమె జుట్టును మెడ వరకు కత్తిరింపజేశారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో.. అక్రమంగా కోర్టు నిర్వహించి, తీర్పులు చెప్పినందుకు ముగ్గురిని అరెస్టు చేశారు. -
ఫోన్ గురించి ప్రశ్నించాడని.. భర్తను చంపేసింది!
వాళ్లిద్దరికీ పెళ్లయ్యి మహా అయితే ఏడాది అవుతుంది. కానీ ఇద్దరి మధ్య ఎప్పుడూ కీచులాటలే. ఆమె ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకుని ఎవరితోనో మాట్లాడుతూ ఉండేది. దాని గురించి గట్టిగా ప్రశ్నించాడని.. చివరకు భర్తను బెడ్రూంలోనే పొడిచి చంపేసింది. ఈ ఘటన బిహార్‌లోని నలందలో జరిగింది. లహేరి పోలీసు స్టేషన్ పరిధిలో ఉండే సతీష్ - లలితలకు ఏడాది క్రితం పెళ్లయింది. కానీ ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేదని, చాలా కష్టమ్మీద పెళ్లికి ఒప్పించామని ఆమె తండ్రి చెబుతున్నారు. నిజానికి సతీష్ కూడా లలితను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. ఆమె అక్క సంగీతను పెళ్లాడాలని అనుకున్నాడు. కానీ ఆమె తన బావగారితో కలిసి ఎటో వెళ్లిపోయింది. దాంతో తప్పనిసరిగా లలితను పెళ్లాడాల్సి వచ్చింది. పెళ్లి తర్వాత తన కూతురు అతడితో సుఖంగా లేదని ఆమె తండ్రి చెబుతున్నారు. ఇక ఆమె తరచు ఎవరితోనో ఫోన్లలో మాట్లాడుతుండటాన్ని అతడు గట్టిగా ప్రశ్నించాడు. దాంతో పట్టలేని కోపం వచ్చిన ఆమె.. అతడు పడుకొని ఉండగా మంచం మీదే అతడిని పొడిచేసింది. దాంతో అక్కడికక్కడే రక్తపు మడుగులో మరణించాడు. -
విద్యార్థిని కొట్టి చంపిన ప్రధానోపాధ్యాయుడు
ప్రధానోపాధ్యాయుడికి.. అదే స్కూల్లో పనిచేసే మరో టీచర్‌కు వివాహేతర సంబంధాన్ని చూశాడని.. ఓ ఐదోతరగతి విద్యార్థిని కొట్టి చంపారు. ఈ దారుణ సంఘటన నెల్లూరు జిల్లా కావలిలో ఐదు రోజుల క్రితం జరిగింది. అనుమానాస్పద స్థితిలో చిన్నారి సాయికృష్ణ మృతిచెందినట్లు తొలుత భావించినా, పోలీసు విచారణలో అసలు వివరాలు బయటపడ్డాయి. కావలి శ్రీవిద్యానికేతన్ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు అయ్యన్నకు, అదే స్కూల్లో పనిచేసే టీచర్ కౌసల్యకు కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. వారిద్దరూ ఓ గదిలో ఉండగా సాయికృష్ణ చూశాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా విద్యార్థిని భయపెట్టాలని అయ్యన్నకు కౌసల్య సూచించింది. దీంతో అయ్యన్న పక్కనే ఉన్న వసతిగృహంలోకి వెంకటసాయికృష్ణను పిలిపించి భయపెట్టేందుకు చెంపపై బలంగా కొట్టాడు. పక్కనే ఉన్న కిచెన్ స్లాబుపై పడటంతో విద్యార్థి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఆందోళనకు గురైన అయ్యన్న అనారోగ్యంతో సాయికృష్ణ మృతి చెందాడంటూ ఆస్పత్రికి తరలించి నాటకాలాడాడు. విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి రావడంతో నిందితులిద్దరినీ అరెస్ట్ చేశామని డీఎస్పీ తెలిపారు.