
సాక్షి, భూత్పూర్: వ్యక్తిని రాయితో కొట్టి చంపిన సంఘటన శుక్రవారం మున్సిపాలిటీలోని అమిస్తాపూర్ చోటు చేసుకుంది. సీఐ కృషన్ తెలిపిన వివరాల ప్రకారం.. అమిస్తాపూర్ చెందిన మల్లేష్, భార్య, ఇద్దరు పిల్లలతో నివసిస్తుండేవాడు. భార్య అదే గ్రామానికి చెందిన శ్రీహరి(43)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారి సంబంధం బయటకు వస్తుందనే కారణంగా 10ఏళ్ల క్రితం శ్రీహరితో కలిసి గోవాకు వెళ్లారు. ఈ క్రమంలో మల్లేష్ మరో వివాహం చేసుకున్నాడు. శ్రీహరి అమిస్తాపూర్‌కు వారం రోజుల క్రితం వచ్చాడు. శుక్రవారం మల్లేష్‌కు, శ్రీహరి తారసపడటంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తోపులాటలో శ్రీహరి రాయిపై పడటంతో గాయాలయ్యాయి. గమనించిన మల్లేష్ పక్కనే ఉన్న రాయిని తీసుకుని శ్రీహరి తలపై వేయడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మల్లేష్ స్వయంగా భూత్పూర్ పోలీస్టేషన్‌లో లొంగిపోయాడు. సంఘటన స్థలాన్ని సీఐ, ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి పరిశీలించారు. మల్లేష్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment