వివాహేతర సంబంధం ఉందని..జుట్టు కత్తిరింపు | woman hair chopped off for having extra marital relation | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం ఉందని..జుట్టు కత్తిరింపు

Published Thu, Oct 13 2016 11:05 AM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

వివాహేతర సంబంధం ఉందని..జుట్టు కత్తిరింపు

వివాహేతర సంబంధం ఉందని..జుట్టు కత్తిరింపు

పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలతో ఒక మహిళ జుట్టును ఆమె భర్త చేత పంచాయతీ పెద్దలు కత్తిరింపజేశారు. ఈ ఘటన ముర్షీదాబాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అప్పటికే పెళ్లయిన ఓ మహిళకు వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దానిపై కులపెద్దలు పంచాయతీ పెట్టారు.

అందులో ఆమె తప్పు చేసిందని తేల్చి.. అందుకు పరిహారంగా రూ. 6 వేలు జరిమానా చెల్లించాలని తీర్పు చెప్పారు. అయితే, ఆమె ఆ మొత్తాన్ని చెల్లించలేకపోయింది. దాంతో ఆమె భర్తను పిలిచి, అతడితోనే బలవంతంగా ఆమె జుట్టును మెడ వరకు కత్తిరింపజేశారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో.. అక్రమంగా కోర్టు నిర్వహించి, తీర్పులు చెప్పినందుకు ముగ్గురిని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement