pullampet
-
వైఎస్సార్ జిల్లాలో మరో స్వాతి కథ
-
కడపలో మరో స్వాతి కథ..
సాక్షి, కడప : తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ స్వాతి ఉదంతం మరవక ముందే కడపలోనూ అదే తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. ఈ దారుణ సంఘటన వైఎస్ఆర్ జిల్లా పుల్లంపేట మండలం చవనవారిపల్లెలో చోటుచేసుకుంది. ఆలస్యంగా ఈ వెలుగులోకి వచ్చింది. స్థానికంగా నివసించే శివ, అరుణ దంపతులకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. వివాహానికి ముందే సాయి సుభాష్ అనే వ్యక్తితో అరుణకు ప్రేమ వ్యవహారం ఉంది. పెళ్లైన తర్వాత కూడా అది కొనసాగుతుండటంతో వద్దంటూ పలుమార్లు శివ వారించాడు. దీంతో భర్త అడ్డు తొలగించుకునేందుకు అరుణ ప్రియుడితో కలిసి హత్యకు పథకం వేసింది. సుభాష్ తన ఇద్దరు మిత్రులతో కలిసి పార్టీ పేరుతో భార్యభర్తలిద్దరిని తోటకు తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగించి విచక్షణా రహితంగా శివను కత్తులతో పొడిచి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని పుల్లంపేట మండలం అన్నసముద్రం అటవీప్రాంతంలో పడేశారు. శివ కనిపించకపోవడంతో మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అరుణ, సాయిసుభాష్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనలో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వైఎస్సార్ జిల్లాలో మరో స్వాతి కథ -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
పుల్లంపేట (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జిల్లాలోని పుల్లంపేట మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేశారు. అయితే ఈ సందర్భంగా అధికారులు రూ.1,90,250లకు ఏసీబీ అధికారులకు సరైన ఆధారాలు చూపలేకపోయారు. ప్రస్తుతం కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
లారీ- కారు ఢీ: దంపతులు మృతి
కనగానపల్లి మండలం పర్వతదేవపల్లి వద్ద ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న వాహనం ఈ రోజు తెల్లవారుజామున బోల్తా పడింది. ఆ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిలో వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఎర్రచందన దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడిని కూడా అదే ఆసుపత్రికి తరలించారు. ఎర్రచందనం దుంగల అక్రమ రవాణపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదే జిల్లాలోని పామిడి మండలం గజరాంపల్లి సమీపంలో వేగంగా వెళ్తున్నలారీ, ఎదురుగా వస్తున్న కారుని ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో దంపతులు మరణించారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను స్వాధీనం చేసుకుని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మృతి చెందిన దంపతుల్లో భర్త సుబ్బరాయుడు రైల్వే అధికారి అని పోలీసులు తెలిపారు. అనంతరం లారీ డ్రైవర్ ను పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాని పుల్లంపేటలో హెచ్పీ గ్యాస్ గోడౌన్ వద్ద ఈ రోజు తెల్లవారుజామున లారీ - పాల వ్యాన్ ఢీ కొన్నాయి. ఆ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కడప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.