అరుణ అదృష్టవంతురాలు... కానివారో? | mahesh vijapurkar writes about aruna shanbag | Sakshi
Sakshi News home page

అరుణ అదృష్టవంతురాలు... కానివారో?

Published Mon, May 25 2015 1:18 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM

అరుణ అదృష్టవంతురాలు... కానివారో?

అరుణ అదృష్టవంతురాలు... కానివారో?

సందర్భం

- మహేష్ విజాపుర్కార్

 
అరుణ శాన్‌బాగ్ లైంగిక దాడికి గురై, మెడకు కుక్క గొలుసు బిగుసుకుపోయి ఊపి రాడక గత నాలుగు దశాబ్దాలు గా ముంబైలోని ఒక ఆసు పత్రిలో అచేతనావస్థలో పడి ఉంది. ఆ కారణంగానే కారు ణ్య మరణం లేదా పాక్షిక కారు ణ్య మరణంపై చర్చ జరుగుతూనే ఉన్నా ఏమంత  ముం దుకు సాగలేదు. నలభై ఏళ్లుగా మంచానికే అంటి పెట్టుకుని ఉన్నా అరుణ శరీరంపై ఒక్క పుండు కూడా పడకపోవడం మునిసిపల్ నిర్వహణలోని కేఈఎమ్ ఆసుపత్రికి గర్వదాయకం.

అదే ఆసుపత్రిలోని బేస్‌మెంట్‌లో ఈ విషాదం జరిగేటప్పటికి ఆమె అక్కడ యువ నర్సు. ఆమెను కాపాడటం కోసం అత్యవసర చికిత్స గదిలోకి తీసుకు వచ్చేట ప్పటికి అన్ని శాఖల నిపుణులూ సహాయం అదించడం కోసం అక్కడికి చేరుకున్నారు. ఆమె పట్ల ప్రదర్శించిన శ్రద్ధ, సేవాభావం ప్రైవేటుదైనా, ప్రభుత్వం నడిపేదైనా దేశంలోని ప్రతి ఆసుపత్రికీ ప్రమాణం కావాలి. కానీ పరిస్థితి అలా ఉందా? ఉంటుందని ఆశించగలమా?
 నేటి ఆరవ వేతన సంఘం వేతనాలతో పోలిస్తే అప్పట్లో అరుణకు లభించినది అత్యల్పం. ఆమెగాక మరెవరైనా అత్యాచారం, గొంతు నులిమివేత బాధితు రాలై ఉంటే ఆమె ఎలా ఉండేది? అసలు ఆమెకు ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స అందించేవారేనా? అలా అచేత నావస్థలో పడి ఉండటానికైనా నోచుకునేదేనా? ఆమె తరఫున ఏ నిర్ణయాలు తీసుకున్నారో ఆమెకు తెలిసేదే కాదు. ఆమె చికిత్స వ్యయానికి ఆ కుటుంబం సర్వస్వం కోల్పోయి బికారులై ఉండేదే.  

తరచుగా ఖరీదైన పరీక్షలు, వైద్యపరమైన జోక్యం అవసరం లేకపోయినా ప్రైవేటు ఆసుపత్రులైతే లాభాలు పిండటానికి దొరికిన మరో పేషంటు కోసం  స్థలం కేటా యించేవే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీర్ఘకాలిక అచేతన స్థితిలో ఉన్న రోగి పట్ల ఆసక్తి ఉండదనే చెప్పాలి. అరుణ శాన్‌బాగ్ మాత్రమే అందుకు మినహాయింపు, ఆమె కూడా ఆ ఆసుపత్రికే చెందిన మనిషి. కాలక్రమేణా ఆ ఆసుపత్రికి, ఆమెకూ మధ్య అనుబంధం బలపడింది.

ఆమెను దీర్ఘకాలిక స్వస్థత గృహానికి తరలించేట్ట యితే ఆందోళనకు దిగుతామని ఆమె సహోద్యోగు లంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వస్థత గృహాలుగా చెప్పేవి మన వైద్య వ్యవస్థలో అల్ప ప్రాధాన్యం గలవి. మన చుట్టుపక్కల ఎక్కడా  అలాంటివి కనబడవు లేదా కనిపెట్టడ మే కష్టం. గత వారం అరుణ మరణానంతరం ఆ ఆసుపత్రి డీన్, ఆమె బంధువుతో కలసి అంత్య క్రియలను  నిర్వహించారు. అరుణ విషయంలో కారు ణ్య మరణాన్ని అనుమతించవచ్చంటూ సుప్రీం కోర్టు జోక్యం చేసుకోగా, ఆసుపత్రి సిబ్బంది నిరవధికంగా ఆమెకు సేవలు చేస్తామని అఫిడవిట్లు ఇచ్చారు. ఆమె అదృష్టవంతురాలు. ఒక నిస్సహాయ వ్యక్తి పట్ల అంతటి అంకితభావాన్ని చూపడం నిజంగానే హృదయాన్ని కదిల్చేది, ప్రశంసనీయమైనది.

దురదృష్టవశాత్తూ, సార్వత్రికంగా అలాంటి ప్రతి దీర్ఘకాలిక రోగిని ఆసుపత్రిలో సజీవంగా ఉంచాలనడం తప్పు. ఆమెది ఒక విలక్షణమైన కేసు. కానీ ఆమెకు అందించినంత నాణ్యమైన సేవలు ప్రతి ఒక్కరికీ అందా ల్సినవి, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నిటిలో అందు బాటులో ఉండాల్సినవి. కానీ అక్కడా ఇక్కడా కూడా అవి కొరవడుతున్నాయి. వివిధ కారణాల రీత్యా వైద్య రంగంలో ప్రభుత్వ ఆసుపత్రుల నిష్పత్తి క్షీణించిపోతోం దని, ప్రైవేటు ఆసుపత్రులు పీడకలలేనని అనుభవం ద్వారా తెలుస్తోంది. ప్రభుత్వాసుపత్రుల్లో రోగికి మంచ మే కరువు. పడకల సామర్థ్యాన్ని మించి ఉన్న పేషంట్లం తా నేల మీద చాప పరుచుకు పడుకోవడమే రివాజు. డాక్టర్లు సహా సిబ్బంది కొరత, మందుల షెల్ఫ్‌లు ఖాళీగా ఉండటం, బంధువులే రోగులకు సేవలు చేయా ల్సిరావడం, మొదలైనవి ఈ వ్యవస్థ ఏర్పాట్ల గురించి బోలెడు తెలుపుతుంది.  

ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం ఖర్చులు ఊహిం పరానివి. వాటికి లాభాలు ముఖ్యం. అనవసరమైన పరీక్షలు, అధిక చార్జీలు, ప్రమాదకరంగా మందులు ఎక్కువగా రాయడమూ తప్పవు. రూ. 25,000కు దిగు మతి చేసుకునే స్టెంట్‌కు ఒక రోగి నుంచి రూ.1.5 లక్షలు వసూలు చేశారని తెలిసింది. అయినా, ఎందువలనో దిగువ మధ్యతరగతివారు కూడా ఖరీదైనవైనా ఆ ఆసుప త్రులవేపే మొగ్గుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు తక్కువగా ఉండటం ఒక్కటే అందుకు కారణం కాదు.

రెండు రకాల ఆసుపత్రుల్లోనూ సంస్థాగత నైతిక విలువలు కొరవడటమే ఈ పరిస్థితులకు అసలు కార ణం. అత్యుత్తమమైన వాటితో తులతూగే వైద్య సేవలు చౌకగా లభించే అవకాశం ఉన్నా అవి విధాన కర్తలను లేదా మదుపరులను ఊరించ గలిగేవి కావు.

అరుణ శాన్‌బాగ్ బంధువులలో పలువురు ఆమెకు దూరంగా ఉండిపోయారు. ఆమెను జీవించి ఉంచడానికి అయ్యే వ్యయాల భయమే వారిని దూరంగా తరిమింది. బాధాకరమైన 40 ఏళ్ల తర్వాత ఆమె మరణించాక వారి లో చాలా మంది వచ్చారు. ఎంతో మంది రోగగ్రస్తులు చార్జీలను సైతం భరించలేక బూటకపు వైద్యులతో సరిపె ట్టుకుంటారు. ఆదాయం, విద్య తర్వాత జీవితంలో కోరుకునే ముఖ్యాంశం మంచి ఆరోగ్యమే. ఆరోగ్యంగా ఉండటమే మహా వ్యయభరి తమైనప్పుడు అసలా జీవితం ఏం జీవితం?    

(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు)
e- mal: vapuka@gmai.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement