influential people
-
బిబిసి 100 విమెన్ 2024...నూరులో ఆ ముగ్గురు
ఎప్పటిలాగే 2024 సంవత్సరానికి కూడా ప్రపంచవ్యాప్తంగా 100 మంది ప్రభావవంత మహిళలను బీబీసీ ఎంపిక చేసి ప్రకటించింది. వారిలో ముగ్గురు భారతీయ మహిళలు. సామాజిక కార్యకర్త అరుణా రాయ్ కుస్తీ యోధురాలు వినేష్ ఫొగట్ అనాథ శవాల అంతిమ సంస్కారాలు చేసే పూజా శర్మ... ఈ ముగ్గురి ఎంపిక ఎందుకో బీబీసీ ఇలా తెలిపింది.బి.బి.సి బి.బి.సి 2024 సంవత్సరానికి ‘బీబీసీ 100 విమెన్’ లిస్ట్‌ను విడుదల చేసింది. ప్రపంచ దేశాల నుంచి ఎంతో వడపోత తర్వాత ఈ 100 మందిని ఎంపిక చేయడం ఆనవాయితీ. పర్యావరణం, సంస్కృతి–విద్య, వినోదరంగం–క్రీడారంగం, రాజకీయరంగం, సైన్స్–హెల్త్ అండ్ టెక్నాలజీ విభాగల నుంచి సమాజం మీద విస్తృతమైన ప్రభావం ఏర్పరిచిన స్త్రీలను ఎంపిక చేసింది. వీరిలో వ్యోమగామి సునీతా విలియమ్స్, రేప్ సర్వైవల్ గిసెల్ పెలికట్, నటి షెరాన్ స్టోన్, ఒలింపిక్ అథ్లెట్ బెబాక అండ్రాడె, నోబెల్ శాంతి విజేత నాడియా మురాద్, రచయిత్రి క్రిస్టీనా రివెరా గర్జా తదితరులు ఉన్నారు. అలాగే మన దేశం నుంచి అరుణా రాయ్, వినేష్ ఫొగట్, పూజాశర్మలను ఎంపిక చేసింది. ‘ఓర్పు, పోరాట పటిమతో నిలబడి తమ తమ రంగాలలో, సమూహాలలో మార్పు కోసం కృషి చేస్తున్న ధీరలు వీరంతా’ అని బీబీసీ ఈ సందర్భంగా అంది. మన దేశం నుంచి ఎంపికైన ముగ్గురు ఎందుకు ఎంపికయ్యారు?పూజా శర్మÉì ల్లీకి 27 సంవత్సరాల పూజాశర్మ తల ఒంచక న్యాయం వైపు నిలబడి పోరాడటం వల్లే ముందుకు వెళ్లగలరు అని ఈ విధానం వినేష్‡కు ‘చనిపోయిన వ్యక్తిని సగౌరవంగా సాగనంపే సేవ’ చేయాలని తన జీవితంలోని సొంత విషాదం వల్ల గట్టిగా అనిపించింది. ఆమె సోదరుణ్ణి మూడేళ్ల క్రితం ఒక కొట్లాటలో చంపేశారు. ఆ గొడవ వల్ల అతని దహన కార్యక్రమాలకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు పూజాశర్మ తానే పూనుకొని దహన సంస్కారాలు చేసింది. ఇలాంటి సందర్భాలలోనే పేదరికం వల్ల, ప్రమాదాల వల్ల అనారోగ్యం వల్ల దహన సంస్కారాలకు నోచుకోని అనాథ శవాలను, దిక్కూమొక్కూ లేని శవాలను తానే గౌరవంగా సాగనంపాలని నిర్ణయించుకుంది. వెంటనే ‘బ్రైట్ ది సోలా ఫౌండేషన్’ స్థాపించి ఇప్పటికి వందల శవాలకు దహన సంస్కారాలు స్వయంగా నిర్వహించింది. ఇందుకు మొదట్లో కొంతమంది నుంచి విమర్శలు ఎదురైనా, ఇది ఆడవాళ్ల పని కాదు అని ఆమెను వారించినా, ఆమె చేసే పనులు సోషల్ మీడియా ద్వారా మద్దతు కూడగట్టుకున్నాయి. సేవారంగంలో ఎంతో మానవీయమైన ఆమె కృషికి నేడు దక్కిన గౌరవం బిబిసి 100లో చేరిక.అరుణా రాయ్అరుణా రాయ్ (74) తన జీవితం ఆరంభం నుంచి నేటి వరకూ అట్టడుగు వర్గాల జీవనమార్పు కోసం పోరాడుతూనే ఉన్నారు. ‘పెద్ద ముందంజలు కాదు... ఇరుగు పొరుగువారి చిన్న చిన్న ముందడుగులు అవసరం’ అనే ఆమె తన జీవితమంతా ఆదర్శాల కోసం నిలబడ్డారు. మద్రాసులో పుట్టి పెరిగిన అరుణ బాల్యం నుంచి ఛాందస భావాలను నిరోధించారు. తన 21 ఏళ్ల వయసులో 1967లో ఐ.ఏ.ఎస్ పరీక్ష రాసి ఎంపికయ్యారు. ఆ రోజుల్లో ఐ.ఏ.ఎస్ రాసే మహిళలే లేరు దేశంలో. 1967లో 10 మాత్రమే ఎంపికైతే వారిలో ఒకరు అరుణ. తమిళనాడులో కలెక్టర్‌గా పని చేసిన అరుణ గ్రామాలు బాగుపడాలంటే తన ఉద్యోగం పనికిరాదని అట్టడుగు వర్గాల చైతన్యం ముఖ్యమని, వారి ఆర్థిక స్వావలంబన తప్పదని భావించి ఉద్యోగానికి రాజీనామా చేసి తన భర్త సంజిత్ రాయ్‌తో కలిసి ‘బేర్‌ఫుట్ కాలేజ్’ స్థాపించి గ్రామీణుల కోసం పని చేశారు. ‘మజ్దూర్ కిసాన్ సంఘటన్’,‘నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్’ వీటన్నింటిలో ఆమెవి కీలక బాధ్యతలు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉనికిలోకి రావడానికి అరుణ కూడా ఒక కారణం. చైతన్యవంతమైన సమాజం, స్త్రీల హక్కుల కోసం ఆమె చేస్తున్న ఎడతెగని కృషే ఆమెను బీబీసీ 100 విమెన్‌కు చేర్చింది. -
అడవి శేష్ ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు
చిన్న సినిమాలు, చిన్న హీరోలు అంటూ చాలామంది ప్రతిభావంతులైన నటీనటులను పక్కన పెట్టి స్టార్ హీరోల వెంట పరిగెత్తేవారు ప్రేక్షకులు. అలాంటి వారికి సస్పెన్స్ సినిమాలంటే ఇతనే తీయాలి అన్నట్టు అందరి చూపు తన వైపు తిప్పుకున్నాడు యంగ్ హీరో అడవి శేష్. మల్టీ టాలెంటెడ్ అంటే ఇతనే అనిపించాడు. నటన మాత్రమే కాకుండా దర్శకత్వం, రచనలో కూడా ఎవరికి తీసిపోను అని నిరూపించాడు. తన సినిమాలకు తనే కథా సహకారం అందించుకోవడంతో పాటు దర్శకత్వం కూడా చేసుకున్నాడు. శశి కిరణ్ టిక్కా తెరకెక్కిస్తున్న మేజర్ సినిమాతో బాలీవుడ్లో కూడా నిలదొక్కుకోవాలని తన కలల పరిధిని విస్తరించుకుంటున్నాడు. ఈ సినిమా 2008లో జరిగిన 26/11 ముంబాయి దాడులలో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోంది. కేరీర్ మొదట్లో ఎన్నో ఒడిదుడుకులను, ఆ తర్వాత వరుస విజయాలతో ఎన్నో అవార్డులను చూసిన అడవి శేష్ ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. న్యూయార్క్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ, బ్రిటీష్ జర్నలిస్ట్ కిరణ్ రాయ్ చేసిన సర్వే ప్రకారం దక్షిణ ఆసియాలో ఆర్ట్స్, మీడియా, కల్చర్లలో 400 ప్రతిభావంతులైన వారి జాబితాలో ఒకడిగా నిలిచాడు శేష్. ఇందులో అతను ఏ.ఆర్.రెహమాన్, జాకీర్ హుస్సేన్ లాంటి వారి పక్కన చోటు సంపాదించుకున్నాడు. ఈ 400 మంది ఇంటర్వ్యూలను జూమ్ ద్వారా తీసుకున్నారు. ఇది శేష్‌తో పాటు తెలుగు సినిమా కూడా గర్వపడాల్సిన సందర్భం. -
గ్లోబల్ టాప్ సీఈఓల్లో అంబానీ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సీఈఓ వరల్డ్ మ్యాగజైన్ తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీల చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ (సీఈఓ) 2019 జాబితాను విడుదల చేసింది. 121 మందితో కూడిన ఈ జాబితాలో వాల్‌మార్ట్ సీఈఓ డగ్లస్ మెక్‌మిలన్ అగ్రస్థానంలో నిలిచారు. 10 మంది భారతీయులకూ ఈ జాబితాలో చోటు లభించింది. భారత్‌కు సంబంధించి ర్యాంకింగ్ విషయానికి వస్తే, ఆర్సిలార్ మిట్టల్ చీఫ్ లక్ష్మీ మిట్టల్ 3వ ర్యాంక్‌తో ముందు నిలిచారు. అయితే ఆయన కంపెనీ కేంద్రాన్ని లగ్జెంబర్గ్గా పేర్కొనడం జరిగింది. దీనితో 49వ ర్యాంక్‌తో ముకేశ్ అంబానీ దేశంలో తొలి స్థానాన్ని దక్కించుకున్నట్లయ్యింది. టాప్ 3గా లక్ష్మీ మిట్టల్: గ్లోబల్ జాబితాలో వాల్‌మార్ట్ సీఈఓ డగ్లస్ మెక్‌మిలన్ ముందు నిలవగా, రెండవ స్థానంలో రాయల్ డచ్ షెల్ గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెన్ వాన్ బెవుర్డెన్ నిలిచారు. మూడవ స్థానంలో ఆర్సిలర్ మిట్టల్ చైర్మన్ అండ్ సీఈఓ లక్ష్మీ మిట్టల్ ఉన్నారు. నాల్గవ ర్యాంక్‌ను సౌదీ ఆరామ్కో సీఈఓ అమిన్ హెచ్ నాసర్ సొంతం చేసుకున్నారు. బీపీ చీఫ్ బాబ్ డుబే ఐదవ స్థానాన్ని, ఎక్సాన్‌మొబిల్ సీఈఓ డారిన్ ఉడ్స్ ఆరవస్థానాన్ని, ఫోక్స్‌వ్యాగన్ సీఈఓ హెర్బర్ట్ డియాస్ ఏడవ స్థానాన్ని, టయాటా సీఈఓ అరియో టయోడా ఎనిమిదవ స్థానాన్ని పొందారు. 9,10 స్థానాలను వరుసగా యాపిల్ సీఈఓ టిమ్‌కుక్, బెర్క్‌షైర్ హాత్వే సీఓఈ వారెన్ బఫెట్ పొందారు. అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ 11వ స్థానాన్ని, యునైటెడ్హెల్త్గ్రూప్ సీఈఓ డేవిడ్ విచ్మన్ 12వ స్థానాన్ని, శాంసంగ్ సీఈఓ కిమ్ కి–నామ్ 13వ స్థానాన్ని దక్కించుకున్నారు. గర్వకారణం: ఓఎన్జీసీ, ఐఓసీ తమ సంస్థల సీఈఓలకు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో గుర్తింపు లభించడం గర్వకారణమని ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)లు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నాయి. ప్రాతిపదిక ఇది...: సీఈఓలకు సంబంధించి సీఈఓ వరల్డ్ మ్యాగజైన్ గ్లోబల్ ర్యాకింగ్స్ ప్రతిష్టాత్మకమైనవి. 96 దేశాల్లో 1,200కిపైగా సీఈఓలను ఈ ర్యాంకింగ్స్‌కు పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. కంపెనీ వ్యాపార పనితీరు, సీఈఓ పూర్తి బాధ్యతల కాలంలో కంపెనీ సాధించిన ఫైనాన్షియల్ రిటర్న్స్ తుది ర్యాంకింగ్‌లో 60 శాతం వెయిటేజ్‌ని కలిగిఉంటాయి. పర్యావరణం, పాలనాతీరు, కంపెనీలో ఉద్యోగుల ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ షేర్లు, మార్కెట్ క్యాపిటలైజేషన్లో మార్పులు వంటి అంశాలు మిగిలిన 40 శాతం వెయిటేజీలో ఉన్నాయి. -
టైమ్ మ్యాగజైన్ ప్రభవాశీలుర జాబితాలో ముఖేశ్ అంబానీకి చోటు
-
ముకేశ్, అరుంధతిలకు ‘టైమ్’
న్యూయార్క్: రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, ప్రజా ప్రయో జన వ్యాజ్యాలతో మానవ హక్కుల కోసం పోరాడుతున్న మహిళలు అరుంధతి కట్జూ, మేనక గురుస్వామిలకు అరుదైన గుర్తింపు లభించింది. టైమ్స్ మ్యాగజైన్ ప్రతీ ఏడాది రూపొందించే ప్రపంచంలో అత్యంత ప్రభావం చూపించిన 100 మంది జాబితాలో భారత్ నుంచి వారికి చోటు లభించింది. మార్గదర్శకులు, నాయకులు, కళాకారులు, వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలతో 2019 సంవత్సరానికి టైమ్స్ మ్యాగజైన్ బుధవారం ఈ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ఇండో అమెరికన్ కమేడియన్, టీవీ హోస్ట్ హసన్ మిన్హాజ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పోప్ ఫ్రాన్సిస్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాక్ ప్రధాని ఇమ్రాన్, గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్‌వుడ్స్, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ ఉన్నారు. వీరంతా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ముద్ర వేశారో టైమ్స్ వారి ప్రొఫైల్స్‌లో వివరించింది. అరచేతిలో ప్రపంచం ముకేశ్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ భారత వాణిజ్య రంగంలో అద్భుతమైన దార్శనికుడని, రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచ దేశాలకు విస్తరింపజేయడంలో ఆయన పాత్రను మరువలేమని ముకేశ్ ప్రొఫైల్‌ని రాసిన మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహేంద్ర అన్నారు. అరచేతిలో∙ప్రపంచమంటూ ముఖేశ్ చేసిన రిలయన్స్ జియో ఆవిష్కరణతో ఆయన ప్రతిష్ట పెరిగిందన్నారు. స్వలింగ సంపర్కులు హక్కుల కోసం, సెక్షన్ 377ను (దీని ప్రకారం స్వలింగ సంపర్కం శిక్షార్హమైన నేరం. ఈ సెక్షన్‌ను 2018 సెప్టెంబర్‌లో సుప్రీం రద్దు చేసింది) రద్దు కోసం పోరాడి సుప్రీంకోర్టులో విజయం సాధించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న పిటిషన్‌దారులు అరుంధతి కట్జూ, మేనక గురుస్వామి. ‘ఎల్జీబీటీక్యూ హక్కుల కోసం అరుంధతి, మేనక చిత్తశుద్ధితో చేసిన న్యాయపోరాటం మరువలేనిది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ ఎలుగెత్తి చాటి భారత్ సామాజిక పురోగతికి ముందడుగు వేశారు’ అని నటి ప్రియాంక అన్నారు. -
ఫార్చూన్ 40లో నలుగురు భారతీయులు
న్యూయార్క్: పిన్న వయస్సులోనే వ్యాపార రంగాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న 40 మంది ప్రముఖుల జాబితాలో భారత సంతతికి చెందిన వారు నలుగురు చోటు దక్కించుకున్నారు. 40 ఏళ్ల లోపు వయస్సు గల 40 మంది ప్రముఖులతో ఫార్చూన్ మ్యాగజైన్ ఈ జాబితాను రూపొందించింది. ‘40 అండర్ 40’ లిస్టులో జనరల్ మోటార్స్ సీఎఫ్‌వో దివ్య సూర్యదేవర (4వ స్థానం), విమియో సీఈవో అంజలీ సూద్ (14), రాబిన్‌హుడ్ సహవ్యవస్థాపకుడు బైజూ భట్ (24), ఫిమేల్ ఫౌండర్స్ ఫండ్ వ్యవస్థాపక భాగస్వామి అను దుగ్గల్ (32వ స్థానం) ఉన్నారు. ఈ జాబితాలో ఇన్స్టాగ్రామ్ సహ వ్యవస్థాపకుడు కెవిన్‌స్ట్రామ్, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిల్చారు. జనరల్ మోటార్స్ తొలి మహిళా సీఎఫ్‌వోగా దివ్య సూర్యదేవర చరిత్ర సృష్టించారని ఫార్చూన్ పేర్కొంది. ఫార్చూన్ 500 కంపెనీల్లోని కేవలం రెండు కంపెనీల్లో మాత్రమే మహిళా సీఈవో, సీఎఫ్‌వోలు ఉన్నారని వివరించింది. ఈసారి ఫైనాన్స్, టెక్నాలజీ రంగాల ముఖచిత్రాన్ని మారుస్తున్న యువ సూపర్‌స్టార్స్‌తో అనుబంధ లిస్టును కూడా ఫార్చూన్ మ్యాగజైన్ రూపొందించింది. ‘లెడ్జర్ 40 అండర్ 40’లో కరెన్సీ ఎక్సే్చంజ్ రిపుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆశీష్ బిర్లా, డిజిటల్ కరెన్సీ ప్లాట్‌ఫాం కాయిన్‌బేస్ సీటీవో బాలాజీ శ్రీనివాసన్, ఎంఐటీ డిజిటల్ కరెన్సీ ఇనీషియేటివ్ డైరెక్టర్ నేహా నరులా, కాయిన్‌బేస్ వైస్ ప్రెసిడెంట్ టీనా భట్నాగర్ ఉన్నారు. -
భూమి ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్
బాలీవుడ్లో టాప్ స్టార్‌గా ఉన్నారు దీపికా పదుకోన్. గత ఏడాది హాలీవుడ్‌కి కూడా హాయ్ చెప్పారీ బ్యూటీ. తాజాగా తన కెరీర్లో మరో మైల్స్టోన్ అందుకున్నారామె. తన నటనతో ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసిన ఈ బాలీవుడ్ బ్యూటీ ఈసారి ఏకంగా ప్రపంచవ్యాప్తంగా వంద మంది ఇన్ఫ్లూ్యయన్స్ పర్సన్స్ (అత్యంత ప్రభావశీలుర జాబితా) లిస్ట్‌లో నిలిచారు. ఓ ప్రముఖ మ్యాగజైన్ విడుదల చేసిన ‘100 మోస్ట్ ఇన్ఫ్లూ్యయన్సియల్ మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ 2018’ లిస్ట్‌లో దీపిక చోటు సంపాదించుకున్నారు. ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న ఓన్లీ ఇండియన్ యాక్టర్ దీపికా కావడం విశేషం. ఆ మ్యాగజైన్లో దీపికా ఫ్రొఫైల్‌ను తన హాలీవుడ్ ఫస్ట్ హీరో, ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ కో–స్టార్ విన్ డీజిల్ రాయడం విశేషం. ‘‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా టైమ్‌లో దీపికని కలిశా. తను ఓ స్పెషల్ పర్సన్ అని అప్పుడే నాకు అర్థం అయింది. తన రూమ్‌లోకి ఎంటర్ అవగానే ఒక ఎనర్జీ, కెమిస్ట్రీ కనిపిస్తుంది. అనుకోని కారణాల వల్ల తను ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’లో యాక్ట్ చేయలేకపోయింది. ‘ట్రిప్లెక్స్’లో తనను ఎలాగైనా క్యాస్ట్ చేసుకుందామని డిసైడ్ అయ్యాం. ‘నేను ఈ సినిమాలో యాక్ట్ చేయాలంటే నువ్వు ఇండియా రావాలి’ అని డీల్ ఫిక్స్ చేసిందామె. ఆ డీల్ ఒప్పుకొని మంచి పని చేశా. అందరూ దీపిక అందాన్ని, కామెడీ టైమింగ్ గురించి మాట్లాడతారు. దీపికా జస్ట్ స్టార్ మాత్రమే కాదు. యాక్టర్స్ యాక్టర్. క్రాఫ్ట్‌కి డెడికేట్ అయిన ఆర్టిస్ట్. ఇండస్ట్రీలో కొంతమంది కొన్ని మార్కెట్స్‌కు స్టక్ అయిపోతుంటారు. బట్.. దీపిక కేవలం ఇండియాను రిప్రజెంట్ చేయడానికి కాదు.. ఈ ప్రపంచాన్ని రిప్రజెంట్ చేయడానికి వచ్చింది. భూమి మనకు అందించిన బెస్ట్ గిఫ్ట్ దీపిక’’ అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు విన్ డీజిల్. -
ప్రపంచంలో ప్రభావవంతులు వీరేనట
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చోటుదక్కించుకున్నారు. ఓ జాతీయ మేగజిన్ నిర్వహించిన సర్వే ద్వారా ఈ విషయం వెల్లడైంది. త్వరలోనే పూర్తి వివరాలను ఆ మేగజిన్ అధికారికంగా ప్రకటించనుంది. అయితే, గతంలో నిర్వహించిన ఆన్లైన్ పోల్‌లో పొందిన ఓట్ల కన్నా ఈసారి తక్కువ ఓట్లు వీరు పొందినట్లు మేగజిన్ స్పష్టం చేసింది. ఈ జాబితాలో చోటుదక్కించుకున్నవారిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, పాప్ స్టార్స్ లేడీ గగా, టేలర్ స్విప్ట్ కూడా ఉన్నారు. ఇక త్వరలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగనున్నట్లు ప్రకటించిన హిల్లరీ క్లింటన్‌తోపాటు, దలైలామా, హ్యారీ పోటర్ నటి ఎమ్మా వాట్సన్, నోబెల్ శాంతిబహుమతి విజేత మలాలా యూసఫ్ జాయ్, మిషెల్లీ ఒబామా, ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కూడా ఇందులో చోటుదక్కించుకున్నారు.