మహిళను అలా తాకి లైవ్‌లో బుక్కయ్యాడు! | bbc Reporter touches Woman private parts On Live TV interview | Sakshi
Sakshi News home page

మహిళను అలా తాకి లైవ్‌లో బుక్కయ్యాడు!

Published Fri, May 19 2017 7:08 AM | Last Updated on Tue, Sep 5 2017 11:31 AM

మహిళను అలా తాకి లైవ్‌లో బుక్కయ్యాడు!

మహిళను అలా తాకి లైవ్‌లో బుక్కయ్యాడు!

లండన్‌: టీవీ లైవ్ ఇంటర్వ్యూ చేస్తూ మహిళను అనుచితంగా తాకినందుకు ఓ ప్రముఖ జర్నలిస్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బీబీసీ జర్నలిస్ట్‌ బెన్‌ బ్రౌన్‌ ఇంగ్లండ్‌ లోని బ్రాడ్‌ఫోర్డ్‌లో నార్మన్‌ స్మిత్‌ అనే వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. లేబర్‌ పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా కొన్ని కీలక విషయాలపై వీరు చర్చిస్తున్నారు. ఇంతలో బెన్‌ బ్రౌన్‌కు పరిచయం ఉన్న ఓ మహిళ అక్కడికి వచ్చింది.
 

ఇంటర్వ్యూ జరుగుతుండగానే బొటనవేలుతో సక్సెస్‌ అంటూ చూపిస్తూ అతడిని పలకరించింది. లైవ్ ఇంటర్వ్యూకు సమస్య తలెత్తుతుందని భావించిన బ్రౌన్‌ వెంటనే ఆ మహిళను కాస్త పక్కకు జరుగు అంటూ అసభ్యకర రీతిలో టచ్ చేస్తూ ఆమెను వెనక్కి జరిపాడు. అనుకోని సంఘటనతో కంగుతిన్న మహిళ వెంటనే తేరుకుని, బెన్‌ బ్రౌన్‌ను ఒక్క దెబ్బకొట్టి మరీ అక్కడినుంచి వెళ్లిపోయింది. ఎంత బిజీ పనులలో ఉన్నా మహిళల పట్ల ఆ తరహాలో అసభ్యంగా ప్రవర్తించకూడదని, మహిళలను అలా తాకవద్దంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బెన్ మాత్రం అనుకోకుండా అలా జరిగిపోయిందని, ఉద్దేశపూర్వకంగా చేయలేదని వివరణ ఇచ్చుకున్నా అలా ప్రవర్తించడం ముమ్మాటికీ తప్పేనంటూ హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement