ట్రంప్ పై కాల్పులు: బీబీసీ ట్వీట్
లండన్: అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది సమయంలోనే ఆయన్ను కాల్చివేశారంటూ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ చేసిన ట్వీట్ ప్రపంచాన్ని కాసేపు కాలవరపాటుకు గురిచేసింది. కొద్దిసేపటికే తప్పును సరిదిద్దుకున్న బీబీసీ సంబంధిత ట్వీట్‌ను తొలగించింది. తుపాకీ కాల్పుల్లో ట్రంప్ గాయపడ్డారని ట్వీట్‌లో బీబీసీ పేర్కొంది. దీంతో ఒక్కసారిగా ట్విట్టర్‌లో కలకలం రేగింది. ట్వీట్‌ను తొలగించిన తర్వాత సంబంధిత పోస్టుకు క్షమాపణలు వేడుకుంటున్నట్లు చెప్పింది. తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసి పోస్టు చేశారని తెలిపింది. ఘటనపై విచారణ జరపుతామని వెల్లడించింది.