
తెలుగులో బీబీసీ ప్రసారాలు
ముంబై: యూకే మీడియా దిగ్గజం బీబీసీ తన సేవలను మరో 11 భాషలకు విస్తరించనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇందులో భారతీయ భాషలు తెలుగు, గుజరాతీ, మరాఠీ, పంజాబీ కూడా ఉన్నారుు. 1940 తరువాత సంస్థ చేపడుతున్న అతిపెద్ద విస్తరణ ఇదే. ప్రస్తుతం బీబీసీ ప్రసారాలు హిందీ, బెంగాలీ, తమిళం భాషల్లో కొనసాగుతున్నారుు. ఆ సంస్థ భారత్‌లో కొత్తగా 157 ఉద్యోగాలను కల్పించనుంది. యూకేకు ఆవల ఢిల్లీలో అతిపెద్ద బ్యూరోను నెలకొల్పనుంది. బీబీసీ కార్యక్రమాలు 29 భాషల్లో వారానికి సుమారు 35 కోట్ల మందికి చేరుతున్నారుు. తాజా విస్తరణలో ఆరు కొరియా, ఆఫ్రికా భాషల్లో కూడా సేవలు మొదలవుతారుు.