బీబీసీ ‘100 మంది మహిళల్లో’ సన్నీలియోన్ | Sunny Leone in the BBC '100 womens' | Sakshi
Sakshi News home page

బీబీసీ ‘100 మంది మహిళల్లో’ సన్నీలియోన్

Published Wed, Nov 23 2016 1:18 AM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM

బీబీసీ ‘100 మంది మహిళల్లో’ సన్నీలియోన్

బీబీసీ ‘100 మంది మహిళల్లో’ సన్నీలియోన్

ముంబై: బీబీసీ ఈ ఏడాదికి రూపొందించిన వంద మంది అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో నటి సన్నీలియోన్‌కు చోటు దక్కింది. వ్యాపారం, క్రీడలు, ఫ్యాషన్, కళలు, ఇంజినీరింగ్ తదితర రంగాల్లోని మహిళలతో కూడిన జాబితాను బీబీసీ విడుదల చేసింది. సన్నీతోపాటు ఈ జాబి తాలో మరో నలుగురు భారతీయ మహిళకూ స్థానం లభించింది.

వారిలో గౌరీ చిందార్కర్(సాంగ్లీ-మహారాష్ట్ర), మల్లికా శ్రీనివాసన్ (చెన్నై), నేహా సింగ్ (ముంబై). సాలుమరద తిమ్మక్క (కర్ణాటక) ఉన్నారు. 105 ఏళ్ల తిమ్మక్క గత 80 ఏళ్లలో 8 వేల చెట్లను నాటారు. ‘ట్రాక్టర్ క్వీన్’గా గుర్తింపు పొందిన మల్లిక  ‘ట్రాక్టర్స్ అండ్ ఫామ్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్’ కంపెనీ సీఈవో. గౌరి(20) ‘స్కూల్ ఇన్ ద క్లౌడ్’విద్యా విధానాన్ని పొందిన  కొద్ది మంది పిల్లల్లో ఒకరు. నేహ (34) నటి-రచరుుత, సామాజిక కార్యకర్త.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement