Women list
-
బీబీసీ ‘100 మంది మహిళల్లో’ సన్నీలియోన్
-
బీబీసీ ‘100 మంది మహిళల్లో’ సన్నీలియోన్
ముంబై: బీబీసీ ఈ ఏడాదికి రూపొందించిన వంద మంది అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో నటి సన్నీలియోన్‌కు చోటు దక్కింది. వ్యాపారం, క్రీడలు, ఫ్యాషన్, కళలు, ఇంజినీరింగ్ తదితర రంగాల్లోని మహిళలతో కూడిన జాబితాను బీబీసీ విడుదల చేసింది. సన్నీతోపాటు ఈ జాబి తాలో మరో నలుగురు భారతీయ మహిళకూ స్థానం లభించింది. వారిలో గౌరీ చిందార్కర్(సాంగ్లీ-మహారాష్ట్ర), మల్లికా శ్రీనివాసన్ (చెన్నై), నేహా సింగ్ (ముంబై). సాలుమరద తిమ్మక్క (కర్ణాటక) ఉన్నారు. 105 ఏళ్ల తిమ్మక్క గత 80 ఏళ్లలో 8 వేల చెట్లను నాటారు. ‘ట్రాక్టర్ క్వీన్’గా గుర్తింపు పొందిన మల్లిక ‘ట్రాక్టర్స్ అండ్ ఫామ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్’ కంపెనీ సీఈవో. గౌరి(20) ‘స్కూల్ ఇన్ ద క్లౌడ్’విద్యా విధానాన్ని పొందిన కొద్ది మంది పిల్లల్లో ఒకరు. నేహ (34) నటి-రచరుుత, సామాజిక కార్యకర్త. -
ఫార్చ్యూన్ శక్తివంత మహిళల జాబితాలో చందా కొచర్ టాప్
రెండో స్థానంలో అరుంధతీ భట్టాచార్య ముంబై: ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఫార్చ్యూన్ విడుదల చేసిన ‘ఆసియా-పసిఫిక్ ప్రాంత శక్తివంతమైన మహిళల జాబితా’లో భారత బ్యాంకింగ్ రంగానికి చెందిన పలువురు మహిళలు స్థానం పొందారు. ఈ జాబితాలో ప్రైవేట్ రంగ బాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు హెడ్ చందా కొచర్ అగ్రస్థానంలో నిలిచారు. అలాగే ఈమె తర్వాతి స్థానాన్ని (2వ స్థానం) దేశీ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య దక్కించుకున్నారు. భారత్‌లో ఐసీఐసీఐ బ్యాంకును విశ్వసనీయమైన, లాభదాయకమైన బ్యాంకుగా తీర్చిదిద్దడంలో చందా కొచర్ ప్రముఖ పాత్ర పోషించారని ఫార్చ్యూన్ పేర్కొంది. వీరితోపాటు ఈ జాబితాలో హెచ్‌పీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ నిషి వాసుదేవా (5వ స్థానం), యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ శిఖా శర్మ (9వ స్థానం) తదితరులు ఉన్నారు. -
భారత్ నుంచి ఇంద్రా నూయి ఒక్కరే...
‘ఫార్చ్యూన్’ ప్రపంచ శక్తివంత వ్యాపార మహిళల జాబితాలో రెండో స్థానం న్యూయార్క్: పెప్సికో సీఈవో ఇంద్రా నూయి.. భారత్ నుంచి ‘ఫార్చ్యూన్ 50 మంది శక్తివంతమైన వ్యాపార మహిళల’ జాబితాలో స్థానం దక్కించుకున్న ఒకే ఒక్క భారతీయురాలు. ఫార్చ్యూన్ జాబితాలో జనరల్ మోటార్స్ సీఈవో మేరీ బర్రా అగ్రస్థానంలో ఉంటే, ఇంద్రా నూయి రెండో స్థానంలో ఉన్నారు. గతేడాది కంపెనీ 4 శాతం రెవెన్యూ వృద్ధిని ప్రకటించడంలో ఇంద్రా నూయి కీలక పాత్ర పోషించారు. గతేడాది ఇదే జాబితాలో ఆమె మూడో స్థానంలో ఉండేవారు. ఈ జాబితాలో ఐబీఎం సీఈవో గిన్ని రోమెట్టీ (3వ స్థానం), ఫేస్బుక్ సీఓఓ షెరిల్ శాండ్‌బర్గ్ (8వ స్థానం), యాహూ సీఈవో మరిస్సా మేయర్ (18వ స్థానం) తదితరులు ఉన్నారు. 2015 సంవత్సరానికి ఫార్చ్యూన్ విడుదల చేసిన ఉత్తమ ఔత్సాహిక మహిళావ్యాపారవేత్తల జాబితాలో భారత సంతతికి చెందిన పాయల్ కడాకియా స్థానం దక్కించుకున్నారు. ఆమె ఫిట్నెస్ తరగ తుల సేవలందించే ‘క్లాస్‌పాస్’ సహ వ్యవస్థాపకులు. ఈ స్టార్టప్ కంపెనీని ప్రారంభించి రెండేళ్లయ్యింది. అమెరికా, కెనడా, బ్రిటన్లలో ఫిట్నెస్ జిమ్‌లు, బాటిక్లకు వినియోగదారుల్ని ఈ క్లాస్‌పాస్ అనుసంధానిస్తుంది.