
హైదరాబాదీ స్టార్, భారత మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ అత్యంత శక్తిమంతమైన భారత మహిళల్లో ఒకరిగా ‘బీబీసీ’ జాబితాలో నిలిచింది. బీబీసీ విడుదల చేసిన ఈ టాప్–100 ప్రభావవంతమైన మహిళల్లో ఆమె ఉంది. వచ్చే నెల ‘బీబీసీ 100 విమెన్ చాలెంజ్’ పేరుతో భారత్‌లోని వివిధ నగరాల్లో అవగాహన కార్యక్రమాలు జరుగనున్నాయి.
గత జూన్–జూలైలలో ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్‌కప్‌లో మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది.