పాము.. పురస్కారం.. | Prestigious Wildlife photographer of the Year -2014 | Sakshi
Sakshi News home page

పాము.. పురస్కారం..

Published Mon, Oct 27 2014 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM

పాము.. పురస్కారం..

పాము.. పురస్కారం..

నేచురల్ హిస్టరీ మ్యూజియం, బీబీసీవారు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్-2014లో మనోళ్లు తీసిన చిత్రాలూ అవార్డులను అందుకున్నాయి. ఈ ఫొటో చూడండి. సడన్‌గా చూస్తే.. ఏదో మొక్క అని అనుకుంటాం. సరిగ్గా చూస్తే.. పచ్చటి పరిసరాల్లో కలిసిపోయిన పచ్చ రంగు పాము మనకు కనిపిస్తుంది.

ఈ ఫొటోను తీసిన ఎస్.ఎస్.రవిప్రకాశ్ కూడా తొలిసారి చూసినప్పుడు దీన్ని అలాగే అనుకున్నారట. కర్ణాటకలోని బెంగ ళూరుకు చెందిన రవిప్రకాశ్ తీసిన ఈ చిత్రం ఉభయచరాలు, సరీసృపాలు విభాగంలో విజేతగా నిలిచింది. తన తోటలోనే ఈ చిత్రాన్ని తీశానని.. ఈ పాములు తాము వేటాడే బల్లులు, కప్పలు వంటి వాటి కోసం ఇలా చాలాసేపు కదలకుండా బొమ్మలా ఉండిపోతాయని రవిప్రకాశ్ తెలిపారు. ఆ విషయాన్ని తెలియజెప్పేలా తానీ చిత్రాన్ని తీశానని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement