
అధికారిక సమావేశంలో పోర్న్ వీడియో కలకలం
చండీగఢ్:
బీఎస్ఎఫ్ అధికారిక కార్యక్రమంలో అశ్లీల వీడియో ప్లే అవ్వడం పెను దుమారం రేపింది. వివరాలు..పంజాబ్లో ఫిరోజ్ పూర్లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ 77వ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్లో దేశ భద్రతకు సంబంధించి చర్చించడానికి ఆదివారం అధికారులు వచ్చారు. మీటింగ్ హాలులో బోర్డర్కు సంబంధించి సమస్యలను వివరించడానికి ప్రొజెక్టర్ను వాడారు. బోర్డర్ను ఎలా రక్షించాలి అనే అంశంపై చర్చ ప్రారంభం అవ్వగానే ప్రొజెక్టర్లో అనుకోకుండా పోర్న్ వీడియో ప్లే అయింది. దీంతో అక్కడున్నవారందూ షాక్కు గురయ్యారు. ఈ సమావేశానికి వచ్చిన వారిలో 12 మంది మహిళా అధికారులతో పాటూ 20 మంది జవాన్లు కూడా ఉన్నారు.
కాగా, ఈ సంఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్టు బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.