► నాలుగు నియోజక వర్గాల్లో ఏర్పాట్లు పూర్తి
► పోలింగ్ బూతుల్లో ప్రత్యక్ష ప్రసారానికి కెమెరాలు
► ఎన్నికల పిటిషన్ కొట్టివేత జరిమానా
తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో జరుగుతున్న ఉపఎన్నికలపై శనివారం పోలింగ్ జరుగనుంది. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేశారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: గడచిన అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని తంజావూరు, అరవకురిచ్చి నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రలోభపరిచే విధంగా నగదు, బహుమతుల పంపిణీ జరిగిందనే ఆరోపణలు రావడంతో మద్రాసు హైకోర్టు ఎన్నికలను రద్దు చేసింది. తిరుప్పరగున్రం అన్నాడీఎంకే ఎమ్మెల్యే శీనివేల్ అనారోగ్య కారణాలతో మృతి చెందారు. దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లో ప్రస్తు తం ఉప ఎన్నికలు జరుగుతున్నారుు. అన్నాడీఎంకే, డీ ఎంకే, బీజేపీ, పీఎంకే, డీఎండీకేలు తమ అభ్యర్థులను పోటీకి దించాయి. అన్నిపార్టీలూ, స్వతంత్ర అభ్యర్థులు కలుపుకుని తంజావూరులో 14 మంది, అరవకురిచ్చి లో 39 మంది, తిరుప్పరగున్రంలో 28 మంది పోటీ చే స్తున్నారు.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయకుండానే పీఠాన్ని అధిష్టించారు. దీంతో ఆరు నెలల్లోగా ఆయన ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో పుదుచ్చేరి రాష్ట్రం నెల్లితోపు ఎమ్మెల్యే రాజీనామా చేయగా, అదే అసెంబ్లీ నియోజకవర్గ నుం చి కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ స్వామి సహా మొత్తం 8 మంది పోటీ చేస్తున్నారు. నెలన్నర రోజులుగా ఈ నా లుగు నియోజకవర్గాల్లో సాగిన హోరాహోరీ ప్రచారం ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగిసింది.
నేడే పోలింగ్:ఈ నాలుగు నియోజకవర్గాల్లో శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల తో ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్ లఖానీ తెలిపారు. పోలింగ్ బూతుల్లో ఇంటర్నెట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కెమెరాలను అమర్చామని తెలిపారు. అలాగే ఎన్నికల పర్యవేక్షకులు, ఫ్ల రుుంగ్ స్క్వాడ్ నిరంతరం నియోజవర్గాల్లో తిరుగుతూ పోలింగ్‌ను పర్యవేక్షిస్తారని చెప్పారు.
చెరిగిపోని ఇంకు వాడకండి: ఎన్నికల కమిషన్
కరెన్సీ మార్పిడి కోసం వచ్చేవారి
వేలిపై చెరిగిపోని ఇంకును వాడొద్దని బ్యాంకులకు ఎన్నికల కమిషన్ ఒక ఉత్తరం రాసింది. కరెన్సీ నోట్లు మార్చుకునే వారు పదే పదే రాకుండా నిరోధించేందుకు వేలిపై ముద్ర వేయాలన్న నిబంధనను ఎన్నికల కమిషన్ తప్పుపట్టింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రికి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఒక ఉత్తరాన్ని రాసింది. వేలిపై ఇంకు ముద్ర వేసే విధానం ఎన్నికల కమిషన్‌కు మాత్రమే పరిమితం, దీనిని బ్యాంకుల్లో అమలు చేయరాదని సూచించింది. తమిళనాడు, పుదుచ్చేరీల్లో నాలుగు నియోజక వర్గాలతోపాటు దేశంలోని అనేక చోట్ల ఈనెల 19వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతున్న దృష్ట్యా ఈ జాగ్రత్తలు పాటించాలని కోరింది.
పిటిషనర్‌కు కోర్టు జరిమానా
అరవకురిచ్చిలో ఎన్నికలను నిలిపివేసేలా ఆదేశించాలని కోరుతూ దేశీయ మక్కల్ కట్చి తరఫున మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసిన గీతా అనే మహిళకు కోర్టు రూ. 5వేల జరిమానా విధించడంతో పాటు పిటిషన్‌ను కొట్టివేసింది. అరవకురిచ్చిలో అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులు విచ్చలవిడిగా నగదును పంచుతున్నారని, ఈ విషయంపై ఎన్నికల కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోనందున ఎన్నికలను నిలిపివేసేలా ఆదేశించాలని, ఆయా పార్టీల అభ్యర్థుల నామినేషన్‌ను తిరస్కరించాలని పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు.
మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్, న్యాయమూర్తి మహదేవన్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఎన్నికలు నిలిపివేయాలని ఇప్పటికే అనేక పిటిషన్లు విచారించాం, ఎన్నికల సరళి కొనసాగుతున్న దశలో రద్దు చేయడం సాధ్యం కాదని గతంలో తీర్పు చెప్పామని వారు తెలిపారు. ఈ విషయం తెలిసి కూడా మరో పిటిషన్ వేసి న్యాయస్థానం విలువైన సమయాన్ని దుర్వినియోగం చేసినందుకుగానూ గీతకు రూ.5వేలు జరిమానా విధిస్తున్నామని ప్రకటించి పిటిషన్‌ను కొట్టి వేశారు.
అన్నాడీఎంకే వేధింపుల వల్లనే ఆత్మహత్య
అన్నాడీఎంకే నేతల వేధింపుల వల్లనే కమిషనర్ ముత్తు వెంకటేశ్వరన్ (56) గురువారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కన్నన్ ఆరోపించారు. తిరుప్పరగున్రం అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికల ఖర్చుల నిమిత్తం ఒక్కో మున్సిపాలిటీ రూ.10 లక్షలు అందజేయాలంటూ విరుదునగర్ జిల్లా అరుంబుకోట్టై మున్సిపల్ కమిషనర్ ముత్తు వెంకటేశ్వరన్‌ను అన్నాడీఎంకే నేతలు వేధించారని ఆయన ఆరోపించారు.
కమిషనర్ ఆత్మహత్య కేసు విచారణను సీబీసీఐడీకి అప్పగించాలని శుక్రవారం ఆయన డిమాండ్ చేశారు. బ్యాంకులకు వచ్చే వారి వేలిపై ఇంకు గుర్తు వేయడంపై నిషేధం విధిస్తూ మధురై జిల్లా కలెక్టర్ వీరరాఘరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ జిల్లా పరిధిలోని తిరుప్పరగున్రంలో ఈనెల 19వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతున్న దృష్ట్యా ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోకుండా ఈ చర్యలు చేపట్టినట్లు బ్యాంకు అధికారులను ఆదేశించారు.
నేడే ఉప సమరం
Published Sat, Nov 19 2016 1:52 AM | Last Updated on Tue, Sep 18 2018 8:00 PM
Advertisement
Advertisement