
భాగ్యనగర్‌కాలనీ: బ్రిగ్గింగ్ టు గెదర్ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూపులో చిన్నారుల పట్ల అసభ్యకరంగా పోస్ట్‌లు పెడుతున్న ఓ వ్యక్తిని గురువారం కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కుషాల్ అలియాస్ పవర్ నిజాంపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు.
అతను క్రియేట్ చేసిన గ్రూపులో చిన్నారులను అశ్లీల పదజాలంతో పోస్టులు పెడుతున్నాడని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్చుతరావుకు సమాచారం అందింది. దీంతో ఆయన వెంటనే కుషాల్‌పై కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా పోస్ట్‌లు పెట్టినట్లు లె లియటంతో కుషాల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment