పోర్న్‌ క్లిప్‌ పంపిన కాంగ్రెస్‌ నేత.. సస్పెండ్‌ | Goa Congress Functionary Sacked For Allegedly Send Porn Clip | Sakshi
Sakshi News home page

పోర్న్‌ క్లిప్‌ పంపిన కాంగ్రెస్‌ నేత.. సస్పెండ్‌

Published Sun, Jul 9 2017 1:03 PM | Last Updated on Tue, Sep 18 2018 7:50 PM

పోర్న్‌ క్లిప్‌ పంపిన కాంగ్రెస్‌ నేత.. సస్పెండ్‌ - Sakshi

పోర్న్‌ క్లిప్‌ పంపిన కాంగ్రెస్‌ నేత.. సస్పెండ్‌

పనాజీ: వాట్సాప్‌ గ్రూప్‌లో ఓ అశ్లీల వీడియోను పంపించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుడిని గోవా కాంగ్రెస్‌ పార్టీ తొలగించింది. అతడిని పార్టీలో కొనసాగించబోమని స్పష్టం చేసింది.'జరిగిన పొరపాటుకు నేను క్షమాపణలు చెబుతున్నాను. మేం ఇప్పటికే ఆయనను వాట్సాప్‌ గ్రూపులో నుంచి పార్టీలో నుంచి తొలగించాం. ఈ విషయాన్ని అందరూ అర్ధం చేసుకోవాలి' అని గోవా కాంగ్రెస్‌ పార్టీ అధికారిక ప్రతినిధి సునీల్‌ కవథాంకర్‌ తెలిపారు.

జర్నలిస్టులకు ఎప్పటికప్పుడు పార్టీ సంబంధించిన కార్యక్రమాలను తెలిపేందుకు కాంగ్రెస్‌ పార్టీ నేతల తరుపున ఒక వాట్సాప్‌ గ్రూప్‌ను పెట్టారు. దానిని నిర్వహించేది సునీల్‌ కవథాంకర్‌. అయితే, ఇటీవలె ఓ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు ఆ గ్రూపులో పోర్న్‌ వీడియోను పోస్ట్‌ చేశాడు. దీంతో అంతా అవాక్కయ్యారు. అతడిని వెంటనే సస్పెండ్‌ చేసి గ్రూపులో నుంచి తొలగించారు. కీలక వర్గల సమాచారం మేరకు ఆ వ్యక్తి గతంలో గోవా కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement