
ఆ వెబ్‌సైట్లు కనిపించవు
న్యూఢిల్లీ: భారతదేశంలో పోర్న్‌వెబ్‌సైట్లు మూతపడనున్నాయి. దాదాపు 3500 పోర్నసైట్లను ఇండియాలో నిషేధించాలని భారత ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించింది. బ్రిటన్‌కు చెందిన వాచ్‌డాగ్ సంస్థ 3500 అశ్లీల వెట్‌సైట్ జాబితాను భారత ప్రభుత్వానికి అందించింది.
దీంతో ఆయా వెబ్‌సైట్లను, 2017 జులై 31లోపు నిషేధించాలని కేంద్రం సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించింది. 2013సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఈనిర్ణయం తీసుకుంది. దాదాపు 3500 వెబ్‌సైట్లలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అశ్లీలత ఉందని నిర్ధారించిన కేంద్రం వీటన్నింటిని నిషేధించనుంది. భారత్‌లో చైల్డ్‌పోర్నోగ్రఫీ నిషిద్ధం. ఈజాబితాను ఎప్పటికప్పడు పరిశీలించి ప్రతిరెండురోజులకు జాబితాను అప్డేట్ చేయనున్నారు.