నేను షాక్ కు లోనయ్యా: షేన్ వార్న్ | I was shocked to read the media stories, Warne | Sakshi
Sakshi News home page

నేను షాక్ కు లోనయ్యా: షేన్ వార్న్

Published Mon, Sep 25 2017 12:32 PM | Last Updated on Tue, Sep 18 2018 8:00 PM

I was shocked to read the media stories, Warne - Sakshi

లండన్:నగరంలోని ఓ విలాసవంతమైన నైట్ క్లబ్ లో పోర్న్ స్టార్ పై దాడి చేసినట్లు వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ పేర్కొన్నాడు. అసలు ఆమెతో ఎటువంటి ఘర్షణ పడకపోయినప్పటికీ ఆ వార్తలు మీడియాలో రావడంతో షాక్ కు గురైనట్లు తెలిపాడు. ప్రస్తుతం ఆ వివాదం నుంచి బయటపడినట్లు వార్న్ స్పష్టం చేశాడు.

'ఈ కేసుకు సంబంధించి పోలీసులకు పూర్తిగా సహకరించాను.సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పోలీసులు పరిశీలించారు. అక్కడ ఉన్నవారితో కూడా పోలీసులు మాట్లాడారు. ఆమెపై నేను దాడి చేయలేదనే విషయాన్ని పోలీసులు నిర్దారించారు. ఆ కేసుకు ముగింపు పడింది'అని వార్నర్ తెలిపాడు.

ఓ పోర్న్‌స్టార్‌తో వార్న్‌ గొడవపడినట్లు వార్తలో వచ్చిన సంగతి తెలిసిందే. తనకు ముఖంపై అయిన కమిలిపోయిన గాయాల ఫొటోను పోర్న్‌స్టార్ వలెరీ ఫాక్స్‌ ట్వీట్‌ చేసింది. గతవారం లౌలౌ క్లబ్‌లో జరిగిన దాడిలో వార్న్‌ కొట్టడంతో తనకు ఈ గాయాలయ్యాయని ఆమె పేర్కొంది. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె.. 'మహిళను కొట్టినందుకు గర్వపడుతున్నావా?  దుష్టుడా?' అంటూ ఆమె ఈ ఫొటోలను షేర్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement