మరో కాంట్రవర్సీ: పోర్న్‌స్టార్‌పై షేన్‌ వార్న్‌ దాడి! | Shane Warne allegedly hit a porn star | Sakshi
Sakshi News home page

పోర్న్‌స్టార్‌పై దాడి చేసిన షేన్‌ వార్న్‌

Published Sun, Sep 24 2017 12:17 PM | Last Updated on Tue, Sep 18 2018 8:00 PM

shane warne - Sakshi

లండన్‌: ఆస్ట్రేలియా లెజెండ్‌ క్రికెటర్‌, స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. లండన్‌లోని ఓ విలాసవంతమైన నైట్‌క్లబ్‌లో ఓ పోర్న్‌స్టార్‌తో వార్న్‌ గొడవపడ్డాడు. ఆమె ముఖంపై గట్టిగా కొట్టాడు. దీంతో తనకు ముఖంపై అయిన కమిలిపోయిన గాయాల ఫొటోను పోర్న్‌స్టార్, ప్రముఖ మోడల్‌ వలెరీ ఫాక్స్‌ ట్వీట్‌ చేసింది. గతవారం లౌలౌ క్లబ్‌లో జరిగిన దాడిలో వార్న్‌ కొట్టడంతో తనకు ఈ గాయాలయ్యాయని ఆమె పేర్కొంది. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె.. 'మహిళను కొట్టినందుకు గర్వపడుతున్నావా?  దుష్టుడా?' అంటూ ఆమె ఈ ఫొటోలను షేర్‌ చేసింది. గత శుక్రవారం రాత్రి వార్న్‌ ఫాక్స్‌తో గొడవపడ్డాడని, ఆమె కిందపడేవిధంగా కొట్టాడని ప్రత్యక్ష సాక్షులు 'ద సన్‌' పత్రికకు తెలిపారు.

డజన్ల కొద్దీ పెద్దల చిత్రాల్లో నటించిన ఫాక్స్ (30) ఈ ఘటనపై వెస్ట్‌ మినిస్టర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా వార్న్‌ దుసురుతనాన్ని తప్పుబడుతూ ట్వీట్లు పెట్టింది. ఈ ఘటనపై తాను అబద్ధం చెప్పడం లేదని, ప్రముఖుడైనంత మాత్రాన మహిళను కొట్టి తప్పించుకోవడం తప్పని ఆమె ట్వీట్‌ చేసింది. ఈ ఘటనపై స్పందించేందుకు వార్న్‌ అధికార ప్రతినిధి నిరాకరించారు. 2007లో క్రికెట్‌ నుంచి తప్పుకున్న వార్న్‌ ఎక్కువశాతం బ్రిటన్‌లో నివసిస్తున్నారు. స్కై స్పోర్ట్స్‌ కామెంటరీ టీమ్‌లో సభ్యుడిగా, ఆస్ట్రేలియా నైన్‌ చానెల్‌ విశ్లేషకుడిగా పనిచేస్తున్న ఆయన గతంలో పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. వార్న్‌ ఇటీవల నటి లిజ్‌ హర్లీతో డేటింగ్ చేశాడు. భార్య సైమన్‌ చల్లాహన్‌కు దూరంగా ఉంటున్న ఆయన గతంలో పలువురు మహిళలతో రాసలీలలు నెరిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement