సాక్షి, చెన్నై: శృంగార తార సన్నీ లియోన్‌కు ఝలక్ తగిలింది. వీరమా దేవి చిత్రం కోసం ఆదివారం చెన్నైలో నిర్వహించబోయే ఓ కార్యక్రమానికి ఆమె హాజరుకావాల్సి ఉంది. ఇంతలోనే ఆమె రాకను వ్యతిరేకిస్తూ ఓ పోలీస్ కేసు నమోదు అయ్యింది.
ఉద్యమకారుడు ఎమి(ఎనోచ్ మోసెస్) సన్నీపై నజరేత్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ‘సినిమా పేరుతో సన్నీ పోర్నోగ్రఫీని ప్రమోట్ చేస్తోంది. భారత చట్టాల ప్రకారం అది నేరం. అంతేకాదు వీరమా దేవి చిత్రంలో ఆమె నటిస్తే తమిళ జాతికి అవమానం. మన సాంప్రదాయాలు దెబ్బతింటాయి. అందుకే ఆమెను అడ్డుకోండి’ అంటూ ఫిర్యాదులో ఎమి పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అయితే తనపై కేసు నమోదు అయిన విషయం తెలియగానే ఆమె ఈవెంట్‌కు హాజరయ్యే విషయంపై పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. కానీ, నిర్వాహకులు మాత్రం సన్నీ రావటం ఖాయమని చెబుతున్నారు. భారీ బడ్జెట్‌తో తమిళ, తెలుగు, మళయాళ భాషల్లో ఏకకాలంలో వీరమాదేవి చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment