promoting
-
పూజా హెగ్డేపై నెటిజన్ల ఫైర్.. అసలేం చేసింది..
Pooja Hegde Trolled By Netizens For Promoting Alcohol Brand: టాలీవుడ్లో వరుస హిట్లు అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా చక్రం తిప్పుతోంది పూజా హెగ్డే. 'పూజా.. నా గుండెలో బాజా' అనుకుంటూ మురిసిపోతారు తన అభిమానులు. తాను ఏం చేసిన వావ్.. సో క్యూట్.. అంటూ సోషల్ మీడియాలోనే పులిహోర కలుపుతారు. అయితే తాజాగా మాత్రం ఆమెపై నెటిజన్లు పైర్ అవుతున్నారు. ఇటీవల కాలంలో సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ద్వారా వాణిజ్య ప్రకటనలను ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ 'రాధేశ్యామ్' బ్యూటీ ఒక విస్కీ బ్రాండ్‌కు ప్రచారం చేసింది. ఒక గౌను ధరించి, ప్రముఖ కంపెనీ తయారు చేసిన విస్కీని ఒక గ్లాసులో పోసి, అందులో ఐస్ క్యూబ్స్, సోడా కలిపి ఆహా అనేలా మిక్సింగ్ చేస్తుంది. తర్వాత తన్మయత్వంతో డ్యాన్స్ చేస్తుంది పూజా. ఈ ప్రక్రియ అంతా ఒక వీడియో తీసి తన ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసింది పూజా హెగ్డే. ఈ వీడియో కాస్త వైరల్ అయింది. అది చూసిన నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు. డబ్బు కోసం మద్యం సేవించాలని ప్రోత్సహిస్తారా ? అని కొందరు అడుగుతుంటే, 'వీళ్లకు డబ్బు సంపాదనే ధ్యేయం. నైతిక విలువలు ఏమాత్రం పట్టించుకోరు.' అని సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. మరికొందరైతే 'విస్కీపైనా అడ్వర్టైజ్మెంట్ ఆ.. షేమ్ ఆన్ యూ హక్డే' అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే గతంలో కూడా చందమామ కాజల్ అగర్వాల్ కూడా ఇదే తరహాలో మద్యానికి ప్రచారం చేసి విమర్శలు ఎదుర్కొంది. ఇదిలా ఉంటే పూజా హెగ్డే పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న 'రాధేశ్యామ్' సినిమాలో ప్రభాస్ సరసన నటించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 14, 2022న విడుదల కానుంది. అలాగే తమిళంలో విజయ్ హీరోగా రూపొందుతున్న 'బీస్ట్' సినిమాలో నటిస్తోంది. ఇదీ చదవండి: అలా అయితే పెళ్లి వద్దు.. వివాహ బంధంపై పూజా హెగ్డే ఆసక్తిర వ్యాఖ్యలు -
అబ్బాయిల్ని కూడా వివిధ రూపాల్లో..
బ్రాడీ జెన్నర్ టెలివిజన్ పర్సనాలిటీ. మోడల్. డిస్క్ జాకీ. ఇవేం గొప్ప గానీ.. ఒకప్పుడు అతడు యువకుడు! ఇప్పుడైనా మరీ యువకుడు కాకుండా ఏం పోలేదు. థర్టీ సెవెన్లో ఉన్నాడు. సరిగ్గా ఆయనకు తోడుబోయినవాడు స్కాట్ డిసిక్. అతడికీ ముప్పై ఏడేళ్లు. మీడియా పర్సనాలిటీ. సోషలైట్. ఇద్దరిదీ యూఎస్. ఈ ఇద్దరికీ తోడుబోయింది ‘గ్రేడియంట్’ ఫొటో ఎడిటింగ్ యాప్. యవ్వనంలో యౌవనస్తుల ఆలోచనలు ఏ ఎగ్జామ్స్ టైమ్‌లోనో తప్పితే తక్కిన ఏ కాలంలోనూ ఒక్క క్షణం కూడా స్త్రీలను తప్పుకుని, తల తిప్పుకుని వెళ్లవు. ‘మీకు ఒక వయసు వచ్చిన పిదప భూలోకమున స్త్రీలు సాక్షాత్కరించెదరు. మీరు మీ పనులను పక్కన పెట్టి ఆ స్త్రీలను అదే పనిగా ఆరాధించెదరు’ అని దేవుడు ఆజ్ఞాపించి పురుష జన్మను ప్రసాదించినట్లుగా ఇంట్లో చెప్పిన పనులు కూడా చేయడం మానేసి విధి లేక అన్నట్లుగా స్త్రీల ఆలోచనలతో వీధుల్లో తల మునకలు అవుతుంటారు బాయ్స్. ఒకప్పుడు బ్రాడీ జెన్నర్, స్కాట్ డిసిక్ కూడా ఇలా దైవాజ్ఞానుసారం నడుచుకున్న వాళ్లే. పెళ్లిళ్లు అయ్యాక దైవాన్ని ధిక్కరించి, ఇన్నాళ్లకు మళ్లీ తమ దైవధిక్కార అపరాధాన్ని గ్రహించి అందుకు పరిహారంగా లేటెస్ట్గా వచ్చిన ‘గ్రేడియంట్’ ఫొటో ఎడిటింగ్ యాప్‌కి ప్రమోటర్లుగా చేరిపోయారు. ఆ యాప్ ఎంత బాగా పని చేస్తుందో చూడండి. ‘బి’ అనే యౌవనస్తుడికి ‘జి’ అనే గర్ల్ ఫ్రెండ్ ఉందనుకుందాం. (అనుకోనక్కర్లేని విషయమే అనుకోండి..) ఆ గర్ల్ ఫ్రెండ్ ఫొటోను ఈ గ్రేడియంట్ యాప్‌లో పడేసి ఏ దేశం బటన్ నొక్కితే ఆ దేశం అమ్మాయిగా ప్రత్యక్షం అవుతుంది! ఈ మానవలోకంలో 197 దేశాలు ఉన్నట్లు వినికిడి. ‘హు.. ఇవి ఏమాత్రం?’ అని తీవ్ర నిరాశా నిస్పృహలతో చింతాక్రాంతులై పోతున్నారట అబ్బాయిలు.. ఈ యాప్‌లోకి ఎంటర్ అయిన కాసేపటికే!! వాళ్ల సంగతి అలా ఉంచితే.. ఈ పనికిమాలిన ‘రేసిస్ట్’ యాప్‌ని ప్రమోట్ చెయ్యడానికి మీకు బుద్ది లేదా?! అని యవ్వనాపూర్ని దాటేసి ఏళ్ల మైళ్లు వచ్చేసినవారు.. బ్రాడీ జెన్నర్, స్కాట్ డిసిక్ లను పట్టుకుని కడిగేస్తున్నారు. యాప్‌లో అబ్బాయిల్ని కూడా వివిధ రూపాల్లో.. యూరోపియన్లుగా, ఏషియన్లుగా, ఆఫ్రికన్లుగా, ఇండియన్లుగా.. చూసే అప్షన్లు కూడా ఉన్నప్పటికీ అమ్మాయిలసలు వాటి ముఖం కూడా చూడటం లేదట! దేవుడు వాళ్లను.. ‘ఒక వయసు వచ్చిన మీదట మీకు భూలోకమున అబ్బాయిలు ప్రత్యక్షమగుదురు. వారిలో మీకు పురుగులు దర్శనమిచ్చును’ అని బ్లెస్ చేసి పంపినట్లున్నాడు! -
పరీక్షలు లేకుండానే పాస్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో 9వ తరగతి వరకున్న విద్యార్థులకు ఈసారి పరీక్షలు నిర్వహించకుండానే పాస్ చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కోవిడ్ విజృంభన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు సెలవులను ప్రకటించింది. అయితే కేంద్రం వచ్చే నెల 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో ఇక పరీక్షలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. వాస్తవానికి ఏప్రిల్ 7 నుంచి ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14 వరకు ప్రకటించింది. మరోవైపు ఈ విద్యా సంవత్సరం ఈ నెల 23తో ముగియనుంది. దీంతో పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. కోవిడ్ నేపథ్యంలో లాక్డౌన్ మరో వారం పొడిగిస్తే కనుక అసలు సాధ్యమే కాదు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులను పైతరగతికి ప్రమోట్ చేయాలని విద్యాశాఖ నిర్ణయానికి వచ్చింది. 9వ తరగతి వరకు విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పాస్ చేసేలా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. -
చివరి నిమిషంలో సన్నీ లియోన్‌కు షాక్!
సాక్షి, చెన్నై: శృంగార తార సన్నీ లియోన్‌కు ఝలక్ తగిలింది. వీరమా దేవి చిత్రం కోసం ఆదివారం చెన్నైలో నిర్వహించబోయే ఓ కార్యక్రమానికి ఆమె హాజరుకావాల్సి ఉంది. ఇంతలోనే ఆమె రాకను వ్యతిరేకిస్తూ ఓ పోలీస్ కేసు నమోదు అయ్యింది. ఉద్యమకారుడు ఎమి(ఎనోచ్ మోసెస్) సన్నీపై నజరేత్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ‘సినిమా పేరుతో సన్నీ పోర్నోగ్రఫీని ప్రమోట్ చేస్తోంది. భారత చట్టాల ప్రకారం అది నేరం. అంతేకాదు వీరమా దేవి చిత్రంలో ఆమె నటిస్తే తమిళ జాతికి అవమానం. మన సాంప్రదాయాలు దెబ్బతింటాయి. అందుకే ఆమెను అడ్డుకోండి’ అంటూ ఫిర్యాదులో ఎమి పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే తనపై కేసు నమోదు అయిన విషయం తెలియగానే ఆమె ఈవెంట్‌కు హాజరయ్యే విషయంపై పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. కానీ, నిర్వాహకులు మాత్రం సన్నీ రావటం ఖాయమని చెబుతున్నారు. భారీ బడ్జెట్‌తో తమిళ, తెలుగు, మళయాళ భాషల్లో ఏకకాలంలో వీరమాదేవి చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. -
జేజమ్మకు పెళ్లి కళ వచ్చిందా?
తమిళసినిమా: పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలోనూ ఒక వేడుకే కాదు, అది మధురమైన, మమతల అల్లికతో కూడిన బంధం కూడా. అలాంటి గడియలు వస్తే ఆపడం ఎవరి తరం కాదు. అయితే ఈ విషయంలో సినిమా వాళ్లపై మీడియా కాస్త అత్యుత్సాహం చూపిస్తుందనడం వాస్తవమే. అలా చాలా మంది తారల మాదిరిగానే నటి అనుష్క ప్రేమ, పెళ్లి గురించి చాలా ప్రచారం జరుగుతోంది. బాహుబలి చిత్ర షూటింగ్ సమయం నుంచి ఆ చిత్ర హీరో ప్రభాస్‌తో ప్రేమ కలాపాలంటూ అనుష్క గురించి ప్రచారం జరుగుతోంది. ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అవన్నీ వదంతులంటూ ఇద్దరూ కొట్టిపారేశారు. అంతే కాదు తన గురించి ప్రచారం అవుతున్న వార్తల్లో నిజం లేదని, మీరు అనుకుంటున్న నటిని తాను పెళ్లి చేసుకోవడం లేదని నటుడు ప్రభాస్ ఇటీవల ఒక భేటీలో కుండబద్దలు కొట్టారు. ఇక నటి అనుష్క విషయానికొస్తే బాహుబలి–2 చిత్రం తరువాత కొత్త చిత్రాలను అంగీకరించలేదు.అంతకు ముందు ఒప్పుకున్న భాగమతి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్లో విడుదల కానున్నట్లు సమాచారం. ఆ మధ్య ఇంజి ఇడుప్పళగి (సైజ్ జీరో) చిత్రం కోసం లావెక్కిన అనుష్క ఆ బరువును తగ్గించుకోవడానికి చాలానే శ్రమించాల్సి వచ్చింది. తాజాగా యోగా, ఇతర వర్కౌట్స్ చేసి ఎట్టకేలకు మళ్లీ స్లిమ్‌గా తయారయ్యారట. అయినా కొత్త చిత్రాలు అంగీకరించకపోవడంతో అమ్మడు పెళ్లికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం జోరందుకుంది. త్వరలోనే ఆ తీపి కబురు వినే అవకాశం ఉందని సినీ వర్గాల టాక్. కాగా ఈ ప్రచారాన్ని అనుష్క ఖండించకపోవడం గమనార్హం. -
భారీగా ట్విట్టర్ ఎకౌంట్ల తొలగింపు
న్యూయార్క్: ఉగ్రవాద చర్యలను నియంత్రించే క్రమంలో మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్.. ట్వట్టర్ కఠినమైన చర్యలు చేపడుతోంది. తీవ్రవాదాన్ని ప్రమోట్ చేస్తున్నారన్న కారణంతో భారీ సంఖ్యలో ఎకౌంట్లను సస్పెండ్ చేస్తోంది. గత ఆరునెలల కాలంలో 2,35,000 ఎకౌంట్లను ఉగ్రవాద కార్యకలాపాల మూలంగా సస్పెండ్ చేసినట్లు ట్విట్టర్ సంస్థ శుక్రవారం వెల్లడించింది. దీంతో గత ఏడాది కాలంగా ట్విట్టర్ తొలగించిన ఖాతాల సంఖ్య 3,60,000కు చేరింది. ప్రాధమికంగా ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించిన 1,25,000 ఖాతాలను 2016 ప్రారంభంలో ట్విట్టర్ సస్పెండ్ చేసింది. ఉగ్రవాదులు సోషల్ మీడియా ద్వారా తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటున్న క్రమంలో వారికి ట్వట్టర్ ప్రధాన ఆయుధంగా మారిందని గతంలో విమర్శలు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన ట్విట్టర్ నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఉగ్రవాద సంభాషణలకు సంబంధించిన సమాచారాన్ని గుర్తించి.. అలాంటి అకౌంట్లను తొలగించే పటిష్టమైన చర్యలను ట్విట్టర్ చేపడుతోంది. -
సీవోఏఐపై జియో సంచలన వ్యాఖ్యలు
రిలయన్స్ జియో, సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ)మధ్య వివాదం మరింత ముదురుతోంది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ జియో సెల్యులర్ ఆపరేటర్ అసోసియేషన్ (సీవోఏఐ ) పై సంచలన వ్యాఖ్యలు చేసింది. సీవోఏఐ తాజా విమర్శలను రిలయన్స్ జియో తిప్పి కొట్టింది. లైసెన్సింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తోందని.. పరీక్షలు నిర్వహిస్తున్న నెపంతో పూర్తి స్థాయి టెలికాం సేవలను విస్తరిస్తోందన్న సీవోఏఐ ఆరోపణలపై స్పందించిన సంస్థ వారి విమర్శలు అవాస్తవాలని బుధవారం రిలయన్స్ ఇన్ఫోకామ్ కొట్టి పారేసింది. సీవోఏఐ తమ పేరు ప్రతిష్ఠలను మసకబార్చాలని ప్రయత్నిస్తోందని ప్రత్యారోపణలు చేసింది. జీఎస్ఎం పరిశ్రమల బాడీలో కొన్ని సంస్థలే పెత్తనం చేస్తున్నాయని పేర్కొంది. ఆపరేటర్ల స్వార్థ ప్రయోజనాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించింది. సీఓఏఐ ఉద్దేశపూర్వకంగానే అసమంజసమైన అపవాదులను ప్రచారం చేస్తోందని పేర్కొంది. సీఓఏఐ కోర్ సభ్యులుగా ఉన్న అధికారంలోలేని మూడు ప్రధాన (పేర్లు చెప్పలేదు) ఆపరేటర్లు ఐయూసీగా పిలవబడే వసూలు రేట్లను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. బిలియన్ ప్లస్ చందాదారులతోమార్కెట్లో 65 శాతం పైచిలుకు మార్కెట్ వాటా వున్న ఆ ముగ్గురే మార్కెట్ ను శాసిస్తున్నారని పేర్కొంది. ప్రస్తుత ఆధిపత్య అధికారంలోలేని ఆపరేటర్లు, కొత్తగా నిర్వాహకులు సహా, ఇతర ఆపరేటర్లను నిర్మూలించడానికి చూస్తున్నారనే స్పష్టమైతోందంటూ విమర్శలు గుప్పించింది. కాగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో తన 4జీ సేవలను ఆగస్టు 15న ప్రారంభించేందుకు రంగం సిద్దం చేసింది. 4జీ సేవల ప్రారంభం సందర్భంగా ఫ్రీ కాల్స్, డేటా సేవలను అందించనుంది. ఈ నేపథ్యంలో ఇటీవల రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కుందిన 1.5 మిలియన యూజర్ల కనెక్ష్లను నిలిపివేయమని కోరుతో టెలికాం శాఖ (డాట్) కు సీవోఏఐకి లేఖ రాసింది. -
మేకిన్ ఇండియా ప్రచారం కాస్త ఎక్కువైంది...
న్యూఢిల్లీ: ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించడంలో ప్రభుత్వం క్రియాశీలకంగానే వ్యవహరిస్తోన్నప్పటికీ.. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా కార్యక్రమాలకు ప్రచారం అతిగా ఉంటోందని పారిశ్రామికవేత్త, భారతీ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాజన్ భారత్ మిట్టల్ వ్యాఖ్యానించారు. స్టార్టప్‌లకు, చిన్న సంస్థలకు క్షేత్రస్థాయిలో చాలా సమస్యలు అలాగే ఉన్నాయని ఆయన చెప్పారు. చిన్న సంస్థల వ్యాపారాల నిర్వహణ చాలా కష్టతరంగానే ఉంటోందని ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) ఇండియా సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఏవో చిన్న చిన్న మార్పులు చేసి ర్యాంకింగ్‌లు మెరుగుపర్చుకోవడం, దాని గురించి గొప్పలు చెప్పుకోవడం కాకుండా.. సిసలైన మార్పును సాధించడానికి నడుం బిగించాలని రాజన్ చెప్పారు. చైనా మందగమన పరిస్థితుల మధ్య అవకాశాలను అందిపుచ్చుకునేందుకు భారత్ మరింత వేగంగా స్పందించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘ఒక్క చిన్న మార్పుతో ర్యాంకింగ్స్‌లో 12 స్థానాలు పైకి ఎగబాకేయొచ్చు.. గొప్పలు చెప్పుకుంటూ తిరగొచ్చు. కానీ, వాస్తవంగా మెరుగుపడాలంటే కొరడా ఝుళిపించాలి. మరింత పోటీతత్వంతో పనిచేయాలి. చైనాలో మందగమన పరిస్థితులను సద్వినియోగం చేసుకునేందుకు సరైన సమయంలో స్పందించకపోతే మరో అవకాశాన్ని.. తుది అవకాశాన్ని చేజార్చుకున్న వాళ్లం అవుతాము’ అని రాజన్ పేర్కొన్నారు.