జేజమ్మకు పెళ్లి కళ వచ్చిందా? | The promotion of Anushka's wedding is in full swing. | Sakshi
Sakshi News home page

జేజమ్మకు పెళ్లి కళ వచ్చిందా?

Published Thu, Aug 17 2017 1:36 AM | Last Updated on Sun, Sep 17 2017 5:35 PM

జేజమ్మకు పెళ్లి కళ వచ్చిందా?

జేజమ్మకు పెళ్లి కళ వచ్చిందా?

తమిళసినిమా: పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలోనూ ఒక వేడుకే కాదు, అది మధురమైన, మమతల అల్లికతో కూడిన బంధం కూడా. అలాంటి గడియలు వస్తే ఆపడం ఎవరి తరం కాదు. అయితే ఈ విషయంలో సినిమా వాళ్లపై మీడియా కాస్త అత్యుత్సాహం చూపిస్తుందనడం వాస్తవమే. అలా చాలా మంది తారల మాదిరిగానే నటి అనుష్క ప్రేమ, పెళ్లి గురించి చాలా ప్రచారం జరుగుతోంది.

బాహుబలి చిత్ర షూటింగ్‌ సమయం నుంచి ఆ చిత్ర హీరో ప్రభాస్‌తో ప్రేమ కలాపాలంటూ అనుష్క గురించి ప్రచారం జరుగుతోంది. ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వైరల్‌ అయ్యాయి. అయితే అవన్నీ వదంతులంటూ ఇద్దరూ కొట్టిపారేశారు. అంతే కాదు తన గురించి ప్రచారం అవుతున్న వార్తల్లో నిజం లేదని, మీరు అనుకుంటున్న నటిని తాను పెళ్లి చేసుకోవడం లేదని నటుడు ప్రభాస్‌ ఇటీవల ఒక భేటీలో కుండబద్దలు కొట్టారు. ఇక నటి అనుష్క విషయానికొస్తే బాహుబలి–2 చిత్రం తరువాత కొత్త చిత్రాలను అంగీకరించలేదు.అంతకు ముందు ఒప్పుకున్న భాగమతి చిత్రంలో నటిస్తున్నారు.

ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదల కానున్నట్లు సమాచారం. ఆ మధ్య ఇంజి ఇడుప్పళగి (సైజ్‌ జీరో) చిత్రం కోసం లావెక్కిన అనుష్క ఆ బరువును తగ్గించుకోవడానికి చాలానే శ్రమించాల్సి వచ్చింది. తాజాగా యోగా, ఇతర వర్కౌట్స్‌ చేసి ఎట్టకేలకు మళ్లీ స్లిమ్‌గా తయారయ్యారట. అయినా కొత్త చిత్రాలు అంగీకరించకపోవడంతో అమ్మడు పెళ్లికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం జోరందుకుంది. త్వరలోనే ఆ తీపి కబురు వినే అవకాశం ఉందని సినీ వర్గాల టాక్‌. కాగా ఈ ప్రచారాన్ని అనుష్క ఖండించకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement