సీవోఏఐపై జియో సంచలన వ్యాఖ్యలు
రిలయన్స్ జియో, సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ)మధ్య వివాదం మరింత ముదురుతోంది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ జియో సెల్యులర్ ఆపరేటర్ అసోసియేషన్ (సీవోఏఐ ) పై సంచలన వ్యాఖ్యలు చేసింది. సీవోఏఐ తాజా విమర్శలను రిలయన్స్ జియో తిప్పి కొట్టింది. లైసెన్సింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తోందని.. పరీక్షలు నిర్వహిస్తున్న నెపంతో పూర్తి స్థాయి టెలికాం సేవలను విస్తరిస్తోందన్న సీవోఏఐ ఆరోపణలపై స్పందించిన సంస్థ వారి విమర్శలు అవాస్తవాలని బుధవారం రిలయన్స్ ఇన్ఫోకామ్ కొట్టి పారేసింది. సీవోఏఐ తమ పేరు ప్రతిష్ఠలను మసకబార్చాలని ప్రయత్నిస్తోందని ప్రత్యారోపణలు చేసింది. జీఎస్‌ఎం పరిశ్రమల బాడీలో కొన్ని సంస్థలే పెత్తనం చేస్తున్నాయని పేర్కొంది. ఆపరేటర్ల స్వార్థ ప్రయోజనాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించింది. సీఓఏఐ ఉద్దేశపూర్వకంగానే అసమంజసమైన అపవాదులను ప్రచారం చేస్తోందని పేర్కొంది.
సీఓఏఐ కోర్ సభ్యులుగా ఉన్న అధికారంలోలేని మూడు ప్రధాన (పేర్లు చెప్పలేదు) ఆపరేటర్లు ఐయూసీగా పిలవబడే వసూలు రేట్లను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. బిలియన్ ప్లస్ చందాదారులతోమార్కెట్లో 65 శాతం పైచిలుకు మార్కెట్ వాటా వున్న ఆ ముగ్గురే మార్కెట్ ను శాసిస్తున్నారని పేర్కొంది. ప్రస్తుత ఆధిపత్య అధికారంలోలేని ఆపరేటర్లు, కొత్తగా నిర్వాహకులు సహా, ఇతర ఆపరేటర్లను నిర్మూలించడానికి చూస్తున్నారనే స్పష్టమైతోందంటూ విమర్శలు గుప్పించింది.
కాగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో తన 4జీ సేవలను ఆగస్టు 15న ప్రారంభించేందుకు రంగం సిద్దం చేసింది. 4జీ సేవల ప్రారంభం సందర్భంగా ఫ్రీ కాల్స్, డేటా సేవలను అందించనుంది. ఈ నేపథ్యంలో ఇటీవల రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కుందిన 1.5 మిలియన యూజర్ల కనెక్ష్లను నిలిపివేయమని కోరుతో టెలికాం శాఖ (డాట్) కు సీవోఏఐకి లేఖ రాసింది.