
Pooja Hegde Trolled By Netizens For Promoting Alcohol Brand: టాలీవుడ్‌లో వరుస హిట్‌లు అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతోంది పూజా హెగ్డే. 'పూజా.. నా గుండెలో బాజా' అనుకుంటూ మురిసిపోతారు తన అభిమానులు. తాను ఏం చేసిన వావ్.. సో క్యూట్.. అంటూ సోషల్ మీడియాలోనే పులిహోర కలుపుతారు. అయితే తాజాగా మాత్రం ఆమెపై నెటిజన్లు పైర్ అవుతున్నారు. ఇటీవల కాలంలో సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ద్వారా వాణిజ్య ప్రకటనలను ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ 'రాధేశ్యామ్' బ్యూటీ ఒక విస్కీ బ్రాండ్‌కు ప్రచారం చేసింది. ఒక గౌను ధరించి, ప్రముఖ కంపెనీ తయారు చేసిన విస్కీని ఒక గ్లాసులో పోసి, అందులో ఐస్ క్యూబ్స్, సోడా కలిపి ఆహా అనేలా మిక్సింగ్ చేస్తుంది. తర్వాత తన్మయత్వంతో డ్యాన్స్ చేస్తుంది పూజా.
ఈ ప్రక్రియ అంతా ఒక వీడియో తీసి తన ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసింది పూజా హెగ్డే. ఈ వీడియో కాస్త వైరల్ అయింది. అది చూసిన నెటిజన్లు తమదైన స్టైల్‌లో కామెంట్స్ చేస్తున‍్నారు. డబ్బు కోసం మద్యం సేవించాలని ప్రోత్సహిస్తారా ? అని కొందరు అడుగుతుంటే, 'వీళ్లకు డబ్బు సంపాదనే ధ్యేయం. నైతిక విలువలు ఏమాత్రం పట్టించుకోరు.' అని సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. మరికొందరైతే 'విస్కీపైనా అడ‍్వర్టైజ్‌మెంట్ ఆ.. షేమ్ ఆన్ యూ హక్డే' అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే గతంలో కూడా చందమామ కాజల్ అగర్వాల్ కూడా ఇదే తరహాలో మద్యానికి ప్రచారం చేసి విమర్శలు ఎదుర్కొంది.
ఇదిలా ఉంటే పూజా హెగ్డే పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న 'రాధేశ్యామ్' సినిమాలో ప్రభాస్ సరసన నటించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 14, 2022న విడుదల కానుంది. అలాగే తమిళంలో విజయ్ హీరోగా రూపొందుతున్న 'బీస్ట్' సినిమాలో నటిస్తోంది.
ఇదీ చదవండి: అలా అయితే పెళ్లి వద్దు.. వివాహ బంధంపై పూజా హెగ్డే ఆసక్తిర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment