Radheshyam Actress Pooja Hegde Accepted Green India Challenge - Sakshi
Sakshi News home page

Radheshyam Actress Pooja Hegde: 'గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌' స్వీకరించిన రాధేశ్యామ్‌ బ్యూటీ

Published Fri, Nov 26 2021 5:04 PM | Last Updated on Fri, Nov 26 2021 7:52 PM

Radheshyam Actress Pooja Hegde Accepted Green India Challenge - Sakshi

Radheshyam Actress Pooja Hegde Accepted Green India Challenge: తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల‍్లి సంతోష్‌ ప్రారంభించిన గ్రీన్‌  ఇండియా ఛాలెంజ్‌ జోరుగా సాగుతోంది. సామాన్యులు, టాలీవుడ్‌, బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఎందరో మొక‍్కలు నాటుతున్నారు. పర్యావరణాన్ని రక్షించే మంచి ఆలోచనతో ప్రారంభమైన ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌లో ఇప్పటికే సినిమా తారలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు పాల్గొంటున్నారు. తాజాగా హీరోయిన్‌ పూజా హెగ్డే ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రేరణ (రాధేశ్యామ్‌ చిత్రంలో పూజా హెగ్డే పాత్ర పేరు)  మొక్కలు నాటి పలువురికి ప్రేరణ కలిగించింది. 



ఈ విషయాన్ని జోగినపల్లి సంతోష్‌ ఆయన ట్విటర్‌ వేదికగా తెలిపారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి, కార్యక్రమంలో భాగమైనందుకు పూజా హెగ్డేకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 'మంచి భవిష్యత్తు కోసం మీరు చేసిన ఈ గొప్ప కార్యక్రమాన్ని, దేశవ్యాప్తంగా ఉన్న మీ అభిమానులు కూడా నిర్వహిస్తారని భావిస్తున్నాను' అని జోగినపల్లి సంతోష్‌ ట్వీటారు. పూజా హెగ్డేకు హీరో సుశాంత్‌ ఈ గ్రీన్‌ ఇండియా సవాల్‌ విసిరారు. అలాగే బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌  కుమార్‌కు పూజా హెగ్డే 'గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌' ఇచ్చింది. ప్రస్తుతం పూజా హెగ్డే రాధేశ్యామ్‌ చిత్రంలో నటిస్తోంది. అందులో 'ప్రేరణ' అనే పాత్రలో అభిమానులను అలరించనుంది.

ఈ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలతో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఇటీవల స్వతహాగా సవాల్‌ స్వీకరించిన నటి నందితా శ్వేత మొక్కలు నాటారు. అనంతరం ఆమె ఐశ్వర్య రాజేశ్‌, హీరో నిఖిల్, డైరెక్టర్‌ ప్రశాంత్‌కు ఛాలెంజ్‌ విసిరారు. అంతేకాకుండా ఈ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో బాలీవుడ్‌ హీరో అమీర్‌ ఖాన్‌ కూడా పాల్గొని మొక్కలు నాటారు. వారివెంట అక్కినేని నాగ చైతన్య కూడా ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement