న్యూడ్ వీడియోలు పంపితే వదిలిపెడతానని నమ్మించి.. | Man held for uploding nude videos in porn sites | Sakshi

న్యూడ్ వీడియోలు పంపితే వదిలిపెడతానని నమ్మించి..

Mar 5 2017 10:36 AM | Updated on Sep 18 2018 8:00 PM

న్యూడ్ వీడియోలు పంపితే వదిలిపెడతానని నమ్మించి.. - Sakshi

న్యూడ్ వీడియోలు పంపితే వదిలిపెడతానని నమ్మించి..

శారీరకంగా తనతో కలవలేదని బాధితురాలికి సంబంధించిన నగ్న చిత్రాలను వివిధ పోర్న్‌ సైట్లలో అప్‌లోడ్‌ చేసి వేధిస్తున్న వ్యక్తిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

హైదరాబాద్:
శారీరకంగా తనతో కలవలేదని బాధితురాలికి సంబంధించిన నగ్న చిత్రాలను వివిధ పోర్న్‌ సైట్లలో అప్‌లోడ్‌ చేసి వేధిస్తున్న వ్యక్తిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సైబరాబాద్‌ సైబర్‌ ఇన్‌స్పెక్టర్‌ హరినాథ్‌ కథనం ప్రకారం... కూకట్‌పల్లిలోని నిజాంపేట ఎక్స్‌ రోడ్డులో నివసించే బాధితురాలు ఇంటర్‌ చదివే సమయంలో ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉండేది.

ఈ తల్లిదండ్రుల హెచ్చరికతో అతడికి దూరంగా ఉంటోంది. దీంతో ఆమెపై కోపాన్ని పెంచుకున్నాడు. నగ్న వీడియోలు పంపితే వదిలిపెడతానని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన ఆమె నగ్న వీడియోలను పంపింది. తనతో కలవాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. వీడియోలను బాధితురాలి బంధువు విశాఖపట్నంకు చెందిన సూరబత్తుల దిలీప్‌కుమార్‌కు పంపించాడు. దీంతో దిలీప్‌ కూడా బాధితురాలిని బెదిరిస్తున్నాడు. ఆమె పట్టించుకోకపోవడంతో వీడియోలను పోర్న్‌ సైట్లలో ఆప్‌లోడ్‌ చేసి వాటి లింక్‌లను బాధితురాలి బంధువులకు పంపాడు. బాధితురాలు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు దిలీప్‌కుమార్‌ను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement