
... అంటూ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు సన్నీ లియోన్. ‘కరణ్ జీత్ కౌర్– ది అన్ టోల్డ్ స్టోరీ’ పేరుతో సన్నీ లియోన్ లైఫ్ స్టోరీ వెబ్ సిరీస్‌గా తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు. శృంగార తారగా పేరొందిన మీరు తొలిసారి భారత్‌కు వచ్చినప్పుడు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి కదా? అనే ప్రశ్నకు ఆమె బదులిస్తూ– ‘‘నిజానికి ఇక్కడికి రాకముందే 21 ఏళ్ల వయసులోనే నేను ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నా. అప్పట్లో నన్ను ద్వేషిస్తూ ఎన్నో మెయిల్స్ పంపేవారు.
లోలోన ఎంతో కుంగిపోయిన నేను నా ఫ్యామిలీ సపోర్ట్‌తో ధైర్యంగా నిలబడగలిగా. నేను పడిన బాధలు నా పిల్లలు పడకూడదు. నేను ఎదుర్కొన్న అవమానాలు వాళ్లు ఎదుర్కోకూడదని కోరుకుంటున్నా’ అని చెబుతూ ఉద్వేగానికి గురయ్యారు. ఓ మధ్యతరగతి సిక్కు కుటుంబానికి చెందిన కరణ్‌జీత్ కౌర్ పోర్న్‌స్టార్ సన్నీ లియోన్‌గా ఎలా మారింది? ఇప్పుడున్న స్థాయికి ఎలా చేరింది? అనే విషయాలను ‘కరణ్ జీత్ కౌర్– ది అన్‌టోల్డ్ స్టోరీ’లో చూడొచ్చని పేర్కొన్నారు సన్నీ లియోన్.
Comments
Please login to add a commentAdd a comment