బస్సుపై పోర్న్‌ స్టార్స్‌ ఫొటోలు.. ఫుల్‌ గిరాకీ! | Buses Painted With Porn stars Are Roaming The Roads Of Kerala | Sakshi
Sakshi News home page

Jul 2 2018 9:26 PM | Updated on Sep 18 2018 8:00 PM

Buses Painted With Porn stars Are Roaming The Roads Of Kerala - Sakshi

బస్సుపై పోర్న్‌ స్టార్స్‌ చిత్రాలు

త్రివేండ్రం: కస్టమర్స్‌ను ఆకర్షించడానికి వచ్చిన ఎలాంటి అవకాశాన్ని వదులుకోవట్లేదు వ్యాపారస్థులు. ఇటీవల రూపాయి పతనాన్ని కూడా తమ బ్రాండ్‌ ప్రచారానికి ఉపయోగించుకుంది డ్యూరెక్స్‌ ఇండియా కండోమ్ కంపెనీ‌. ఈ యాడ్‌ సోషల్‌ మీడియాలో తెగవైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ తరహాలోనే కేరళకు చెందిన ఓ ట్రావెల్‌ కంపెనీ వినూత్నంగా ఆలోచించి కస్టమర్లను ఆకర్షిస్తోంది. 

ఏకంగా బస్సుపై పోర్న్‌స్టార్ల చిత్రాలను పెట్టేసింది. త్రివేండ్రంకు చెందిన చీకూస్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ కంపెనీ.. సంస్థకు చెందిన అన్ని బస్సులపైనా సన్నీ లియోన్, మియా ఖలీఫా, కీరన్ లీ వంటి పోర్న్‌స్టార్ల ఫొటోలను అతికించింది. అంతే, ఒక్కసారిగా వారి బస్సులకు డిమాండ్ పెరిగిపోయింది. పోర్న్ స్టార్ల ఫొటోలతో అందంగా ముస్తాబై రోడ్డుపై వెళ్తున్న బస్సులను చూసేందుకు కూడా జనాలు ఎగబడుతున్నారట. కేరళకే చెందిన ఓ వ్యక్తి ఈ బస్సుల ఫొటోలు తీసి ‘కేరళలోని బస్సులు.. సీరియస్‌గా తీసుకోవద్దు’ అని ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి. అయితే ఈ పోస్ట్‌కు పోర్న్‌ స్టార్‌ కీరన్‌ లీ స్పందిస్తూ   ‘ఆకట్టుకునేలా’  ఉందనడం ఇక్కడ విశేషం.

చదవండి: రూపాయి పతనం.. కండోమ్‌ యాడ్‌ వైరల్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement