
సన్ని లియోన్ కేరళలో గత రెండు మూడు వారాలుగా వార్తలలో ఉంది. మూడు వారాల క్రితం కేరళలో ఒక షో నిర్వాహకులు సన్ని లియోన్ మీద పోలీసు ఫిర్యాదు చేశారు. కొచ్చిలో తను ఒక షోకు అటెండ్ అవుతానని చెప్పి 11 లక్షలు అడ్వాన్సు తీసుకుని అటెండ్ కాలేదని ఆ ఫిర్యాదు సారాంశం. అయితే మరికొందరు ఆమె 28 లక్షలు తీసుకొని ఎగ్గొట్టిందని ప్రచారం చేశారు. కాని కరోనా వల్ల తాను షోకు అటెండ్ కాలేదని, తీసుకున్నది వెనక్కు ఇస్తానని ఆమె తరఫు వారు ప్రకటించడంతో గొడవ సద్దు మణిగింది.
ఇప్పుడు సన్ని లియోన్ కేరళలో ఎం.టివి వారి షో ‘స్పిట్స్‌విల్లా’ కోసం షూట్‌లో ఉంది. మధ్యలో ఆమె కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంది. తాజాగా షేర్ చేసిన ఫోటో అభిమానులను ఆకట్టుకుంది. ‘దేవుని నేల అయిన ఈ కేరళతో ప్రేమలో ఉన్నా’ అంటూ ఆమె ఆ ఫొటోలో బొట్టు పెట్టుకుని కనిపించింది. పైన గంధపు నామం కూడా పూసుకుంది. దక్షిణాది సంప్రదాయంలో సన్ని కనిపించడం ఒక విశేషం అయితే ఎప్పుడూ బొట్టుతో కనిపించని సన్నీని చూసి ‘ఇది చాలా విడ్డూరం. అందుకే అకాల వర్షాలు పడుతున్నాయని సరదాగా కామెంట్లు చేస్తున్నవారు కూడా ఉన్నారు.
చదవండి: (ఊదబోయి.. గుటుక్కున మింగేసింది!)
Comments
Please login to add a commentAdd a comment