
కిరణ్‌బేడీకి అశ్లీల వీడియో పంపిన అధికారి
సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) కిరణ్‌బేడీకి వాట్సాప్‌లో అశ్లీల వీడియో పంపించాడనే ఆరోపణలతో శివకుమార్ అనే ప్రభుత్వాధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రజా సమస్యలను వెనువెంటనే పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులతో కిరణ్‌బేడీ ఓ వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. దాని ద్వారానే అన్ని శాఖల అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేస్తుంటారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి సహకార సంఘాల రిజిస్ట్రార్ పేరుతో ఈ గ్రూపునకు మూడు ఫోల్డర్లలో ఓ వీడియో వచ్చింది. అయితే ఈ వీడియోలను చూసిన కిరణ్ బేడీ సహా అధికారులంతా బిత్తరపోయారు. అందులో 30కి పైగా అసభ్య మెసేజ్‌లు, వీడియోలు ఉన్నాయి. దీంతో వీటిని పంపిన అధికారిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ మనోజ్ ప్రీతాను ఆమె ఆదేశించారు. దీనిపై సీనియర్ ఎస్పీ రాజీవ్‌రంజన్ విచారణ జరిపి శనివారం తెల్లవారుజామున రిజిస్ట్రార్ శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.