పోర్న్ సైట్‌లో నటి ఫొటోలు.. వివాదం | Kerala actress hits back after image photoshopped for porn sites | Sakshi
Sakshi News home page

పోర్న్ సైట్‌లో నటి ఫొటోలు.. వివాదం

Published Tue, Mar 22 2016 12:44 PM | Last Updated on Tue, Sep 18 2018 7:52 PM

పోర్న్ సైట్‌లో నటి ఫొటోలు.. వివాదం - Sakshi

పోర్న్ సైట్‌లో నటి ఫొటోలు.. వివాదం

తిరువంతపురం: కేరళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి జ్యోతికృష్ణ ఫొటోలు పోర్న్సైట్‌లో దర్శనచ్చాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  దీంతో కేరళ సినీ పరిశ్రమలో కలకలం రేపింది. ఈ విషయం ఆలస్యంగా తన దృష్టికి రావడంతో జ్యోతి కృష్ణ  ఆవేదనకు గురయ్యారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు ఆమె సన్నద్ధమవుతున్నారు.  

జ్యోతికృష్ణ ఫొటోలు పోర్న్ సైట్‌లో ప్రత్యక్షం కావడం,  వెంటనే ఇవి సోషల్ మీడియాలో భారీగా వ్యాపించడం క్షణాల్లో జరిగిపోయింది. దీంతో వివాదం రేగింది. ఈ విషయాన్ని ఇండస్ట్రీ పెద్దలు, మరికొందరు స్నేహితులు జ్యోతికృష్ణ దృష్టికి తీసుకురావడంతో ఆమె సోషల్ మీడియాలో  స్పందించారు. తానంటే గిట్టనివారు ఎవరో తన ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆ సైట్స్‌లో పెట్టారని మండిపడ్డారు. తనకు మానసిక వేదనను మిగిల్చినవారికి తగిన బుద్ధి చెప్పనునట్టు ఫేస్బుక్‌లో మలయాళంలో కామెంట్ పోస్ట్ చేశారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించిన వ్యక్తులను వదిలిపెట్టేది లేదన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో తనలాంటి బాధితుల్లో మానసిక బలాన్ని పెంచేందుకు కృషి చేస్తానన్నారు.

బీబీసీ  ఇంటర్వ్యూ లోమాట్లాడిన నటి జ్యోతి ప్రముఖ డైరెక్టర్, తన  స్నేహితుడి ద్వారా ఈ విషయం తన దృష్టికి  వచ్చిందని చెప్పారు. కాగా నటిగా జ్యోతి కృష్ణ 2011లో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. లైఫ్ ఆఫ్ జోసుట్టి (2015) ఆమె నటించిన చివరి చిత్రం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement