Lashed out
-
'టీడీపీతో జనసేన పొత్తు.. పిచ్చోడికి మళ్లీ పెళ్లి లాంటిది'
సాక్షి, అమరావతి: టీడీపీతో జనసేన పొత్తుపై మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఇది పిచ్చోడికి మళ్లీ మళ్లీ పెళ్లి లాంటిదని ఎద్దేవా చేశారు. జైల్లో చంద్రబాబుతో మిలాఖత్ తరువాత లగ్నం కుదిరిందని అన్నారు. తాడు బొంగరం లేని వాళ్లతో పవన్ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందుతోందని మంత్రి జోగి రమేశ్ అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా సీఎం జగన్‌పై పవన్ అర్థరహితమైన విమర్శలు చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ ఒంటిచేత్తో వైసీపీని స్థాపించారని అన్నారు. విపక్ష నేతగా ఒక్కడే 67 మందిని గెలిపించాడని చెప్పారు. ఆ తర్వాత 151 సీట్లు గెలిపించి సీఎం అయ్యారని అన్నారు. ఇదీ చదవండి: సైకిల్ గుర్తుతో జనసేన పోటీ? -
పోలీసులపై జేసీ ప్రభాకర్‌రెడ్డి జులుం
తాడిపత్రి: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై జులుం ప్రదర్శించారు. ఆగ్రహంతో ఊగిపోతూ చిందులు తొక్కారు. టీడీపీ తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జి, ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి శనివారం సాయంత్రం పట్టణంలోని ఒకటో వార్డులో పర్యటించేందుకు నివాసం నుంచి బయల్దేరారు. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ముందస్తు అనుమతి లేనిదే వార్డుల్లో పర్యటించకూడదని పోలీసులు ఆయన్ను ఒకటో వార్డు గాందీనగర్ వద్ద అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి అక్కడికి చేరుకుని పోలీసులపై చిందులు తొక్కారు. డీఎస్పీ వీఎన్కే చైతన్య జోక్యం చేసుకుని.. శాంతిభద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించబోమని, నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయని స్పష్టంచేశారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డిని పంపించివేశారు. ఇదీ చదవండి: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో రంగంలోకి సీబీఐ.. నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లు -
ముంబైని ముంచెత్తిన భారీ వర్షం
సాక్షి, ముంబై: ముంబైలో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాలను భారీ వాన ముంచెత్తుతోంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు రైల్వే ట్రాక్‌లు నీటమునిగాయి. దీంతో లోకల్ రైళ్లు నిలిచిపోయాయి. మహారాష్ట్రను ఒకరోజు ముందే రుతుపవనాలు తాకాయి. రుతుపవనాల రాకతో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. మరో ఐదు రోజుల పాటు ముంబైకి భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాలతో కొంకణ్ తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి. థానే, రాయ్‌గఢ్, పుణె, బీడ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యమంత్రి ముందస్తు సూచనలు వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వెంటనే ముంబై రీజియన్, కొంకణ్ రీజియన్‌లోని అన్ని జిల్లాలకు చెందిన ప్రకృతి విపత్తుల నివారణ శాఖ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిస్తే సాయం కోసం కోస్టు గార్డులు, సైన్యం సిద్ధంగా ఉండాలని సూచనలివ్వాలని తెలిపారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఇన్చార్జి మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముంబైసహా ఇతర కార్పొరేషన్లు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్పొరేషన్ల కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, ఇతర సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ తగిన సూచనలివ్వాలని తెలిపారు. కోవిడ్ రోగులకు ఆక్సిజన్ కొరత, మందుల కొరత లేకుండా చూడలి. అవసరమైతే వెంటనే ఇతర ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా యంత్రసామగ్రిని సమకూర్చుకుని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఆస్పత్రుల్లో జనరేటర్లు, వాటికి అవసరమైన డీజిల్ ముందుగానే సమకూర్చుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇదివరకే నగరంలో లోతట్టు ప్రాంతాలున్న చోట వర్షపు నీరు బయటకు తోడేందుకు 474 మోటర్లను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. అత్యవసరం సమయంలో సాయం కోసం ఎదురుచూసే బాధితులకు అన్ని హెల్ప్‌లైన్ నంబర్లు పనిచేసేలా చూడాలన్నారు. కంట్రోల్ రూముల్లో 24 గంటలు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సంబంధిత శాఖలకు నిర్దేశించారు. చదవండి: Coronavirus: స్వల్పంగా పెరిగిన కొత్త కేసులు -
పోర్న్ సైట్లో నటి ఫొటోలు.. వివాదం
తిరువంతపురం: కేరళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి జ్యోతికృష్ణ ఫొటోలు పోర్న్సైట్లో దర్శనచ్చాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కేరళ సినీ పరిశ్రమలో కలకలం రేపింది. ఈ విషయం ఆలస్యంగా తన దృష్టికి రావడంతో జ్యోతి కృష్ణ ఆవేదనకు గురయ్యారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు ఆమె సన్నద్ధమవుతున్నారు. జ్యోతికృష్ణ ఫొటోలు పోర్న్ సైట్లో ప్రత్యక్షం కావడం, వెంటనే ఇవి సోషల్ మీడియాలో భారీగా వ్యాపించడం క్షణాల్లో జరిగిపోయింది. దీంతో వివాదం రేగింది. ఈ విషయాన్ని ఇండస్ట్రీ పెద్దలు, మరికొందరు స్నేహితులు జ్యోతికృష్ణ దృష్టికి తీసుకురావడంతో ఆమె సోషల్ మీడియాలో స్పందించారు. తానంటే గిట్టనివారు ఎవరో తన ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆ సైట్స్‌లో పెట్టారని మండిపడ్డారు. తనకు మానసిక వేదనను మిగిల్చినవారికి తగిన బుద్ధి చెప్పనునట్టు ఫేస్బుక్లో మలయాళంలో కామెంట్ పోస్ట్ చేశారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించిన వ్యక్తులను వదిలిపెట్టేది లేదన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో తనలాంటి బాధితుల్లో మానసిక బలాన్ని పెంచేందుకు కృషి చేస్తానన్నారు. బీబీసీ ఇంటర్వ్యూ లోమాట్లాడిన నటి జ్యోతి ప్రముఖ డైరెక్టర్, తన స్నేహితుడి ద్వారా ఈ విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. కాగా నటిగా జ్యోతి కృష్ణ 2011లో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. లైఫ్ ఆఫ్ జోసుట్టి (2015) ఆమె నటించిన చివరి చిత్రం. -
ఇక ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల ఆటకట్టు
సాక్షి, ముంబై: ప్రయాణికులపట్ల దురుసుగా వ్యవహరించే ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల ఆట కట్టించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం రవాణా విభాగం ఓ సాఫ్ట్‌వేర్‌ను త్వరలో అందుబాటులోకి తేనుంది. దీంతో ఇటువంటి డ్రైవర్లపై చర్యలు తీసుకునే వీలుంది. బాధిత ప్రయాణికులు ‘ఐవీఆర్ఎస్ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్’ నంబర్ (1800-22-0110)ను ఆశ్రయించాల్సి ఉంటుంది. అమర్యాదగా ప్రవర్తించిన డ్రైవర్ల ట్యాక్సీ, ఆటోల నంబర్లను అందులో పొందుపర్చాల్సి ఉంటుంది. ఇందువల్ల పర్మిట్ హోల్డర్ డిజిటల్ డాటా ఫిర్యాదుతో సహా ఆర్టీవో అధికారులకు కనిపిస్తుంది. తద్వారా ఆర్టీవో అధికారులు ఇటువంటి డ్రైవర్లపై సత్వరమే చర్యలు తీసుకుంటారు. ప్రయాణికులను ఎక్కించుకునేందుకు నిరాకరించినా లేదా దురుసుగా వ్యవహరించినా లేదా ఎక్కువ చార్జీలు వసూలు చేసినా ప్రయాణికులు ఫిర్యాదు చేయొచ్చు. ఈ ఫిర్యాదు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటారు. కాగా ఫిర్యాదుదారులకు ఆర్టీవో కార్యాలయ అధికారులు రసీదు ఇస్తే బాగుంటుందని కొంతమంది ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఇది సంక్షిప్త సమాచార సేవ (ఎస్ఎంఎస్) ఆధారంగా ఉండాలని ప్రయాణికుల హక్కుల కార్యకర్త సునీల్ సూచించారు.