
సాక్షి, అమరావతి: టీడీపీతో జనసేన పొత్తుపై మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఇది పిచ్చోడికి మళ్లీ మళ్లీ పెళ్లి లాంటిదని ఎద్దేవా చేశారు. జైల్లో చంద్రబాబుతో మిలాఖత్ తరువాత లగ్నం కుదిరిందని అన్నారు. తాడు బొంగరం లేని వాళ్లతో పవన్ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు.
ఏపీలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందుతోందని మంత్రి జోగి రమేశ్ అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా సీఎం జగన్‌పై పవన్ అర్థరహితమైన విమర్శలు చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ ఒంటిచేత్తో వైసీపీని స్థాపించారని అన్నారు. విపక్ష నేతగా ఒక్కడే 67 మందిని గెలిపించాడని చెప్పారు. ఆ తర్వాత 151 సీట్లు గెలిపించి సీఎం అయ్యారని అన్నారు.
ఇదీ చదవండి: సైకిల్ గుర్తుతో జనసేన పోటీ?
Comments
Please login to add a commentAdd a comment