సాక్షి, ముంబై: ప్రయాణికులపట్ల దురుసుగా వ్యవహరించే ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల ఆట కట్టించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం రవాణా విభాగం ఓ సాఫ్ట్‌వేర్‌ను త్వరలో అందుబాటులోకి తేనుంది. దీంతో ఇటువంటి డ్రైవర్లపై చర్యలు తీసుకునే వీలుంది. బాధిత ప్రయాణికులు ‘ఐవీఆర్‌ఎస్ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్’ నంబర్ (1800-22-0110)ను ఆశ్రయించాల్సి ఉంటుంది. అమర్యాదగా ప్రవర్తించిన డ్రైవర్ల ట్యాక్సీ, ఆటోల నంబర్లను అందులో పొందుపర్చాల్సి ఉంటుంది.
ఇందువల్ల పర్మిట్ హోల్డర్ డిజిటల్ డాటా ఫిర్యాదుతో సహా ఆర్టీవో అధికారులకు కనిపిస్తుంది. తద్వారా ఆర్టీవో అధికారులు ఇటువంటి డ్రైవర్లపై సత్వరమే చర్యలు తీసుకుంటారు. ప్రయాణికులను ఎక్కించుకునేందుకు నిరాకరించినా లేదా దురుసుగా వ్యవహరించినా లేదా ఎక్కువ చార్జీలు వసూలు చేసినా ప్రయాణికులు ఫిర్యాదు చేయొచ్చు. ఈ ఫిర్యాదు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటారు. కాగా ఫిర్యాదుదారులకు ఆర్టీవో కార్యాలయ అధికారులు రసీదు ఇస్తే బాగుంటుందని కొంతమంది ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఇది సంక్షిప్త సమాచార సేవ (ఎస్‌ఎంఎస్) ఆధారంగా ఉండాలని ప్రయాణికుల హక్కుల కార్యకర్త సునీల్ సూచించారు.
ఇక ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల ఆటకట్టు
Published Wed, Apr 23 2014 10:22 PM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM
Advertisement