
ఫేస్‌బుక్ పోకిరీకి గట్టి జవాబు
చెన్నై యువకుడిపై నటి నిత్యారామ్ మండిపాటు
బనశంకరి : సినిమా నటులకు సామాజిక మాధ్యమాల్లో మానసికంగా హింసిస్తుండటం హెచ్చుమీరుతోందని కన్నడనటి నిత్యారామ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఫేస్‌బుక్‌లో తన ఫొటోలను పోస్ట్ చేసిన వ్యక్తిని తీవ్రంగా హెచ్చరించింది. హీరోయిన్ రచితారామ్ సహోదరి, బుల్లితెర నటి నిత్యారామ్ గురించి చెన్నై కి చెందిన గౌతమ్ అనే యువకుడు అశ్లీల ఫొటోలను పోస్ట్ చేయడం, మీ అభిమాని అంటూ అసభ్య కామెంట్లు చేయడం ఆమె దృష్టికి వచ్చింది.
దీంతో చిర్రెత్తుకొచ్చిన నిత్యారామ్ అతడిని తీవ్రంగా హెచ్చరించింది. ఓ అమ్మాయి పట్ల గౌరవంగా నడుచుకోవాలంటూ మండిపడింది. ఫేస్‌బుక్‌లో తనకు ఎంతోమంది అభిమానులు మెసెజ్ పెట్టి అభిమానిస్తారని, అది చూసి సంతోషం కలుగుతుందని పేర్కొంది. కానీ ఈ విధమైన ప్రవర్తనలకు తాను ప్రోత్సహించనని నిత్యారామ్ ఆ పోకిరీని ఫేస్‌బుక్‌లో తీవ్రస్థాయిలో హెచ్చరించింది.